S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్ కొత్త చిత్రం

రొటీన్‌కు భిన్నంగా సరికొత్త కథలను ఎంచుకొని హీరోగా నటిస్తున్న సుమంత్ అశ్విన్ మరో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్, కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథాకథనాలతో సినిమా రూపొందించాలనుకున్న తమ సంస్థ ఈసారి సుమంత్ అశ్విన్‌తో ఓ మంచి చిత్రాన్ని రూపొందించనుందని తెలిపారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో అత్యధిక బడ్జెట్‌తో ప్రారంభిస్తున్నామని అన్నారు.

చిరుతో దీపిక?

చిరంజీవి 150 చిత్రానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడే కొత్తకొత్తగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య కథానాయికగా నయనతార ఖరారైందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. నయనతార తర్వాత అనుష్క పేరు వినిపించినా వెనక్కెళ్ళింది. వీరందరినీ కాదని ఇప్పుడు బాలీవుడ్ భామ దీపికాపదుకొనే పేరు వినిపిస్తోంది. చిరంజీవి పక్కన నటించమని తననెవరూ అడగలేదని నయనతార చెప్పింది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో కాల్షీట్లు ఎడ్జస్ట్ చేయటం కష్టమని, అనుష్క కూడా చెప్పేసిందని వార్తలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ పొడుగుకాళ్ల సుందరి దీపికను ఎంపిక చేశారని వినిపిస్తున్న వార్త!

కృష్ణతో నటించడం అదృష్టం నటుడు ఆశిష్ గాంధీ

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ, విజయనిర్మల ప్రధాన పాత్రలో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్‌అవుతున్న శ్రీశ్రీ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషించాడు నటుడు ఆశిష్ గాంధీ. ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కిందని చెబుతున్న ఆశిష్ గాంధీ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో.. ‘కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆ పాత్ర చేసినందుకు చాలామంది బాగా చేశావు అని అభినందించారు. మొదటినుంచి నాకు సినిమాలంటే ఆసక్తి. మాది హైదరాబాద్ అయినా చిన్నప్పుడే ముంబాయిలో సెటిల్ అయ్యాను. తర్వాత అక్కడే రోషన్ తనేజ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను.

మెగా హీరోయిన్

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంటూ విజయాల్ని దక్కించుకుంటోంది. ఇప్పటివరకూ రకుల్ చేసిన సినిమాల్లో మెగా హీరోల సినిమాలే ఎక్కువ. దాంతో ఈమెకు మెగా హీరోయిన్ అనే ట్యాగ్ పడిపోయింది. ఇటీవలే రామ్‌చరణ్ సరసన బ్రూస్‌లీ, అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రాల్లో నటించిన రకుల్ ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ సరసన ఓ చిత్రంలో, వరుణ్‌తేజ్ సరసన మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది.

సిద్ధమైన గుప్పెడంత ప్రేమ

సాయిరోనక్, అతిథిసింగ్ ప్రధాన తారాగణంగా ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుప్పెడంత ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వినోద్ లింగాల మాట్లాడుతూ లవ్‌లోని మ్యాజిక్ ఎంత దూరాన్నైనా దగ్గర చేయగలదని, ప్రేమకోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొనేలా చేస్తుందని, అందరికీ ఆనందంతోపాటు మనసులకు చేరువయ్యేలా చేసే శక్తి ప్రేమలో ఉందని, అటువంటి కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. కథలోని డైలాగ్స్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సరికొత్తగా ఉండి ప్రేక్షకులకు నచ్చుతాయని అన్నారు.

ఆ లెక్చరర్ మనలో ఒకడు

ఆర్.పి.పట్నాయక్, అనిత హెచ్.రెడ్డి జంటగా యూని క్రాఫ్ట్స్ మూవీ పతాకంపై ఆర్.పి. దర్శకత్వంలో జి.సి.జగన్మోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.పి. మాట్లాడుతూ ఈనెల 16నుండి నెలాఖరు వరకు జరిపే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నామని అన్నారు. కృష్ణమూర్తి అనే సామాన్యమైన ఓ లెక్చరర్ కథగా సాగే ఈ చిత్రంలో కొన్ని యధార్థ సంఘటనలు ఉన్నాయని, బ్రోకర్ ఎంత విజయం సాధించిందో అంతకుమించిన స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత జగన్మోహన్ అన్నారు.

రుణఎగవేతదార్లను నిద్రపోనివ్వను : జైట్లి

టోక్యో:బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలను ఎవరినీ వదిలిపెట్టమని, వారిని నిద్రపోనివ్వమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హెచ్చరించారు. జపాన్‌లో ఐదురోజుల పర్యటనలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌కు భారీగా పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఉద్దేశించి ఆయన జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెట్టుబడులకు భారత్‌లో ఉన్న మంచి అవకాశాలను ఆయన వివరిస్తూ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. భారత్‌లో ఎస్‌బిఐవంటి బ్యాంకులు అప్పులిచ్చినా లాభాల్లో ఉన్నాయని, కొన్ని బ్యాంకులు మాత్రం నిర్వహణ లోపంతో నష్టాల్లో చిక్కుకుంటున్నాయని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను : ఉమాభారతి

న్యూదిల్లి:బిజిపి నేత సుబ్రహ్మణ్యస్వామి తన హీరో అని, అయోధ్యలో రామాలయం ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తామన్న ఆయన మాటలను విశ్వసించవచ్చని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను లేనని, ఈ ఎన్నికల్లో యూపిలో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. న్యూదిల్లీలో ఆదివారం ఆమె పిటిఐతో మాట్లాడారు. అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవచ్చని అన్నారు.

కార్మికులతో మోదీ భోజనం

ఖతార్:తన పర్యటనలో భాగంగా ఖతార్‌లో పనిచేస్తున్న వివిధ కంపెనీల కార్మికులతో భారత ప్రధాని మోదీ కలసి మాట్లాడారు. ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. మోదీ వ్యవహారశైలితో కార్మికులంతా సంబరపడ్డారు. తమ కష్టాలను ఆయన పంచుకున్నారని, ఆయన జనం మనిషి అని ఆనందం వ్యక్తం చేశారు.

భారత్ పెట్టుబడులకు అనుకూలం :మోదీ

దోహా:భారత్‌లో ఇప్పుడు వాణిజ్యరంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని భారత ప్రధాని మోదీ అన్నారు. ఖతార్‌లో రెండో రోజు పర్యటన సందర్భంగా ఆయన ప్రముఖ వ్యాపార సంస్థల అధిపతులు, సిఇఒలతో సమావేశమయ్యారు. భారత్‌లో ఇటీవల చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. భారత్‌లో అపారమైన వనరులు ఉన్నాయని, యువశక్తి ఉందని, పెట్టుబడులతో వస్తే లాభాలు తప్పక వస్తాయని ఆయన వారికి వివరించారు.

Pages