S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రా అభివృద్ధికి ప్రణాళికలు

విజయవాడ (రైల్వేస్టేషన్), జూన్ 4: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని అందుకు కావాల్సిన ప్రణాళికను రూపొందిస్తున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో అడుగిడిన మంత్రి ప్రభు శనివారం భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి శాలువా కప్పారు. అనంతరం ప్రభు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధ్యయనంతో ఆంధ్ర రాష్ట్రం పురోగతి చెందుతుందన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 4: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయినా విభజన పాపం కాంగ్రెస్ పార్టీకే అంటగడుతూ విమర్శలతోనే కాలం గడుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని, నాడు మాటతిప్పని వెంకయ్యనాయుడు నేడు మెడ తిప్పి రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిన తీరు హేయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ ఎద్దేవా చేశారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 4: విద్య వున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలని అందరం చదువుకుందాం, నేను చదివిస్తాను, మీ పిల్లలను స్కూలుకు పంపండని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పేదరికంపై గెలుపుకు కృషి చేస్తానని, ఆర్ధికంగా మహిళలు నిలదొక్కుకోటానికి పది శాతం వడ్డీతో నిధులు ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా శనివారం ఏ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, పవర్ గ్రిడ్, టూరిజం, ఫైబర్ గ్రిడ్ అంశాలపై ఆయా శాఖల నిపుణులతో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి మనుగడ

హైదరాబాద్, జూన్ 4: ప్రతి ప్రాణి పట్టుక, మరణం ప్రకృతితోనే ముడిపడి ఉంది. ప్రకృతి పచ్చగా ఉంటేనే భూమి మీదున్న ప్రాణులన్నీ చక్కగా మనుగడ సాగిస్తాయి. కానీ రోజురోజుకి పెరిగిపోతున్న గ్లోబర్ వార్మింగ్, పట్టణీకరణ, అడవుల నరికివేత, మానన జీవనశైలిలో ఊహించని మార్పులు చోటుచేసుకోవటం వంటి అనేక కారణాలతో పర్యావరణంలో మానవాళికి ముప్పు కల్గించే పరిస్థితులు తలెత్తాయి. వాటి పర్యవసానంగానే వాతావరణం సమతుల్యత కోల్పోయి అకాల వర్షాలు, సీజన్ లేకుండానే ఎండలు మండిపోవటం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి.

6న మెగా జాబ్‌మేళా

వికారాబాద్, జూన్ 4: వికారాబాద్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణ/అంబేద్కర్ భవన్‌లలో ఈనెల 6న ఉదయం నిర్వహించే జాబ్‌మేళా, ఉపాధి శిక్షణ ఎంపికను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి ఎం.సత్తయ్య పిలుపునిచ్చారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో నియోజకవర్గ పరిధిలోని ఏడో తరగతి పాసై ఆపై చదువులు చదవిన నిరుద్యోగులు 11 కంపెనీలు భర్తీ చేసే 1550 ఉద్యోగాలకు ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు బి.సంజీవరావు హాజరవుతారని చెప్పారు.

తెలంగాణ హరితహారంలో విస్తృతంగా మొక్కలు నాటాలి

హైదరాబాద్, జూన్ 4: జూలై మాసంలో చేపట్టే తెలంగాణ హరితహారం కార్యక్రమం కింద విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్‌లకు సూచించారు. శనివారం సచివాలయం నుండి హరితహారం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌లు, అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధిత శాఖల సమన్వయం తీసుకోవాలని అన్నారు.

ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

తాండూరు, జూన్ 4: రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా వారి ఆశలు తీర్చేలా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నారాయణపూర్‌లో కాగ్నానదిపై రూ.9.50 కోట్ల విలువతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్తాపన చేసారు. బంగారు తెలంగాణకు ప్రతిరూపంగా తాండూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం నా ఆశయమని అన్నారు. రూ.500 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. తెలంగాణ -కర్నాటక మధ్య రవాణా సదుపాయం మెరుగు పరుస్తామని మంత్రి వివరించారు.

తేలికగా గణితం నేర్చుకోవడంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

హైదరాబాద్, జూన్ 4: నిత్య జీవితంలోనూ, పోటీపరీక్షల్లోనూ విజయం సాధించడంలో గణితం పాత్ర రోజురోజుకూ పెరుగుతోందని ఈ క్రమంలో అందరూ తేలికగా గణితం నేర్చుకోవడంపై ప్రత్యేక శిక్షణ ద్వారా తర్ఫీదు ఇవ్వనున్నట్టు మాథ్స్ అకాడమి డైరెక్టర్ వి రామ్ చెప్పారు.

ఉద్యమ విద్యార్థులకు ఉద్యోగాలు ఉద్యమ కేసులు ఎత్తి వేయండి

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘాల నాయకులకు, ఇతర విద్యార్థులకు ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకున్నట్లు ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూరాల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. నాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులన్నింటినీ ఎత్తి వేయాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో కెసిఆర్‌ను కోరారు. విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు.

సూక్ష్మ పరిశీలన

హైదరాబాద్, జూన్ 4: మహానగర పాలక సంస్థ చెత్త తరలించే వాహనాల రాకపోకలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని చెత్త కుండీల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు చెత్తను తరలించే రవాణా విభాగాన్ని సర్కిళ్లు, జోన్ల వారీగా వికేంద్రీకరించటంతో వాహనాలు సంఖ్య సుమారు ఇరవై శాతం తగ్గింది. అయినా డీజిల్ వినియోగం తగ్గకపోవటంతో కమిషనర్ జనార్దన్ రెడ్డి సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు కోసం ఈస్ట్‌జోన్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పిన్ పాయింట్ కార్యక్రమం సత్పలితాలిస్తోంది.

Pages