S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి

హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతం ఆక్రమణలకు గురికావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తక్షణమే హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ చెరువు ఆక్రమణలకు గురైందని పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ చెరువును పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కెప్టెన్ జె.రామారావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

సర్కారు బడులను మూసివేయొద్దు

హైదరాబాద్, జూన్ 4: రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయకూడదని, రాష్టవ్య్రాప్తంగా ఉన్న 29వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించారు. రేషనలైజేషన్ ముసుగులో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బిసిలు చదువుకునే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం పాఠశాలలను మూసేసే ఆలోచన మానుకోవాలని ఆర్ కృష్ణయ్య తెలంగాణ సిఎస్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

సింగిల్ పర్మిట్ ఇవ్వకుంటే ‘సరిహద్దు దిగ్బంధం’

హైదరాబాద్, జూన్ 4: ఈ నెల 10వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకుంటే రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో రోడ్డు దిగ్బంధం చేస్తామని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ శనివారం హెచ్చరించింది. తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ భాస్కర్‌రెడ్డి, జి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నిరుడు తెలంగాణ లారీ యజమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా సింగిల్ పర్మిట్ కావలసి ఉండగా ఆ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం గత పక్షం రోజుల క్రితం ఉత్తరప్రత్యుత్తరాలు జరిపింది. సింగిల్ పర్మిట్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదు.

కృష్ణా జిల్లాలో భారీ వర్షం

మచిలీపట్నం, జూన్ 4: కృష్ణా జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుఝాము నుండి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి జన జీవనం స్తంభించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు భీతిల్లారు. తీవ్రమైన ఈదురుగాలులు వీయటంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ కృష్ణాలో చిరుజల్లులు పడగా తూర్పు కృష్ణా ప్రాంతంలో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి వర్షపాతం 37.5 మి.మీలుగా నమోదైంది. అత్యధికంగా పామర్రులో 125.2 మి.మీలు, అత్యల్పంగా వీరుళ్ళపాడులో 1.6 మి.మీల వర్షపాతం నమోదైంది.

నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతిపక్షం పాత్ర జీరో

శ్రీకాకుళం, జూన్ 4: విభజన తర్వాత జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు తెలిసికూడా ప్రతిపక్షం తన పాత్రను సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఐదుకోట్ల ప్రజలు సిఎం పిలుపుతో మూడోరోజున నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న నేపథ్యంలో ఇటువంటి సంకల్పాన్ని శతవిధాలుగా విఫలం చేసేందుకు జగన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుతోవపట్టిస్తున్నారంటూ ఆరోపించారు. శనివారం ఇక్కడ నవనిర్మాణ దీక్ష మూడోరోజు కార్యక్రమంలో ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీతతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఆర్థిక ఉన్మాదంటూ విమర్శించారు.

మధుర అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు మృతి

మధుర, జూన్ 4: ఉత్తరప్రదేశ్‌లోని మధుర పట్టణంలో ‘స్వాధీన్ భారత్ సుభాష్ సేన’ నేతృత్వంలో కనీ వినీ ఎరుగని రీతిలో హింసాకాండ చెలరేగి 24 మందిని బలిగొన్న 48 గంటల తర్వాత ఈ హింసాకాండ ప్రధాన నిందితుడు సాయుధ ముఠా నేత రామ్‌వృ యాదవ్ మృతి చెందినట్లు పోలీసులు శనివారం సాయంత్రం ధ్రువీకరించారు. అతని మృత దేహాన్ని పోలీసుల కస్టడీలో ఉన్న అతని అనుచరులు కొందరు గుర్తించారని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ జావేద్ అహ్మద్ శనివారం సాయంత్రం ట్విట్టర్‌లో తెలిపారు. యాదవ్ నేతృత్వంలో దాదాపు 3 వేల మంది అతని అనుచరులు పోలీసులపై దాడి చేసినప్పుడు జరిగిన ఘర్షణల్లో 22 మంది అనుచరులతో పాటుగా అతను కూడా చనిపోయినట్లు ఆయన తెలిపారు.

అవలక్షణాలన్నీ జగన్‌లో ఉన్నాయి

హైదరాబాద్, జూన్ 4: ప్రపంచంలో మనుషుల అవలక్షణాలన్నీ వైకాపా అధినేత వై జగన్మోహన్‌రెడ్డిలోనే ఉన్నాయని ఐటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జగన్ పిచ్చికుక్క కరిచినట్టు ప్రవర్తిస్తున్నాడని మంత్రి ఆరోపించారు. అవినీతిపై మాట్లాడే నైతిక అర్హత, స్థాయి జగన్‌కు లేదని, వంద జన్మలు ఎత్తినా రాదని పేర్కొన్నారు.

కీలక దశలో విజయవాడ మెట్రో

విజయవాడ, జూన్ 4: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ మరో అడుగు ముందుకు వేసింది. విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందుకోసం కేంద్ర పెద్దలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మెట్రో ఫైలును ముందుకు నడిపించుకుంటూ వచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు ఆమోద ముద్ర లభించాలంటే, అనేక మైలు రాళ్లను దాటాల్సి ఉంటుంది.

జగన్‌పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

విశాఖపట్నం, జూన్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డిపై టిడిపి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు జగన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే వంగలపూడి అనిత, యలమంచిలి పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు జగన్ తీరుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే విశాఖ నగర పరిధిలోని పెదగంట్యాడ పోలీసు స్టేషన్ పరిధిలో పులి రమణారెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు.

అసహన బీజం (శాంతి వచనం)

మనం ఆశిస్తామే కానీ కోరుకున్న వాటిని ఇతరులకు వాటిని అందివ్వం... ఎందుకని ప్రశ్నించుకుంటే, కోరుకున్నవి ఎందుకు తీరటం లేదో ఎవరికి తీర్చడం లేదో అర్థమవుతుంది. వినిమయానికి మనమిచ్చే ప్రాధాన్యమే సద్వినియోగానికి ఇవ్వలేని కారణం. రోజువారీ వ్యవహారాలతో ప్రారంభించిన మన దినచర్య ముగిసేటప్పటికి ఏ అర్థరాత్రో అపరాత్రో అవుతుంది. ఎక్కడ మొదలుపెడతామో అక్కడికే వెళ్లి మరీ ముగిస్తున్నాం. హడావుడిగా, అనాలోచితంగా, తొందర తొందరగా పనులు ముగించుకుంటూ ఏ దిశాగమ్యం లేని బ్రతుకు సమరం చేస్తున్నాం. ఆ బతుకు బాటలో దిశానిర్దేశనం లేని గమనంలో ఆలోచనాత్మకతకు చోటు లేకుండా బండిని నెట్టుకొచ్చేస్తున్నాం.

- అమృత్

Pages