S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు

హైదరాబాద్, జూన్ 4: కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏ రెండేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన సభకు సినీ, బీడి, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

హైదరాబాద్‌లో 9వ అంతర్జాతీయ ముత్యాలు, రత్నాల ప్రదర్శన ప్రారంభం

హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్‌లో అంతర్జాతీయ 9వ ముత్యాలు, రత్నాల ప్రదర్శన శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌లో ఈ ప్రదర్శనను జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రాంమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ జివి శ్రీ్ధర్, యుబిఎం ఎండి యోగేష్ ముద్‌రాస్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో వందకుపైగా ప్రముఖ ఆభరణాల సంస్థలు పాల్గొన్నాయని చెప్పారు. రూబీ, ఎమరాల్డ్, ముత్యాలు వంటి విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శన వల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోని ఆభరణాల వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు.

ఏపి పిజి ఈసెట్-2016 ఫలితాలు విడుదల

కాకినాడ, జూన్ 4: ఎపి పిజి ఈసెట్-2016 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య లక్కసాని వేణుగోపాలరెడ్డి కాకినాడ జెఎన్‌టియులో శనివారం విడుదల చేశారు. గత రెండేళ్ళుగా ఎపి పిజి ఈసెట్‌ను కాకినాడ జెఎన్‌టియు నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో 22199 మంది దరఖాస్తు చేసుకోగా 19,780 మంది హాజరయ్యారు. 16945 మంది అర్హత సాధించగా 85.67 శాతం ఉత్తీర్ణత లభించింది. నాన్ లోకల్ కేటగిరీ కింద 1513 మంది దరఖాస్తు చేసుకోగా 1291 మంది హాజరయ్యారు. 1073 మంది అర్హత సాధించగా 83.11 శాతం ఉత్తీర్ణత నమోదయింది.

రంజాన్ తోఫా!

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ రాష్ట్రంలో రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు సాయంత్రం విధి నిర్వహణ నుండి ఒక గంట ముందుగా వెళ్లిపోయేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా పేరుతో శనివారం ఒక సర్క్యులర్ మెమో జారీ అయింది. రంజాన్ మాసం ఈ నెల 6 లేదా ఏడో తేదీన వస్తోందని, జూలై ఐదు వరకు ఉంటుందన్నారు. ఈ నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుండి వెళ్లిపోయేందుకు అవకాశం కల్పించారు.

రండి.. విమానం ఎక్కండి!

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 90 మంది విద్యార్ధులకు వందేమాతరం ఫౌండేషన్ విహంగ విహారం చేసే అవకాశం కల్పించింది. గత ఎనిమిదేళ్లుగా విద్యార్ధుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు, పేద విద్యార్ధులకు విమానం ఎక్కే అవకాశాన్ని కల్పించేందుకు వందేమాతరం ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిపిఎ 10కి 10 పాయింట్లు సాధించిన వారినే కాకుండా 9.9, 9.8 పాయింట్లు సాధించిన వారిని కూడా ఎంపిక చేశామని ఫౌండేషన్ ప్రతినిధి అనిల్ నలందా చెప్పారు. ఈ కార్యక్రమానికి ఫ్లైటెక్ సంస్థ తోడ్పాటునిస్తూ వస్తోంది.

టి- ఎమ్సెట్-2కు 30వేల దరఖాస్తులు

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రం మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు శనివారం రాత్రికి 30వేల దరఖాస్తులు వచ్చాయి. తొలి రోజు ఆరు వేల దరఖాస్తులు రాగా రెండో రోజు దరఖాస్తుల సంఖ్య 15వేలకు పెరిగింది. మూడో రోజు నాటికి 22వేలకు, నాలుగో రోజు 30వేలకు పెరిగాయి. అబ్బాయిలు 10 వేల మంది దరఖాస్తు చేయగా, అమ్మాయిలు సుమారు 20వేల మంది దరఖాస్తు చేశారు. వారిలో ఉస్మానియా ఏరియా నుండి 19వేలు, ఆంధ్రా ఏరియా నుండి 5వేలు, ఎస్వీయు నుండి 4 వేల మంది దరఖాస్తు చేశారు. మిగిలినవి ఇతర ప్రాంతాల నుండి వచ్చాయి.

‘కొవ్వాడ’ పనులు చకచకా

హైదరాబాద్, జూన్ 4: ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద తలపెట్టిన 9564 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ పనులు స్పీడందుకున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్ధాయి నిపుణులు ఈ నెలలో అణు విద్యుత్ ప్లాంట్ సైట్‌ను సందర్శించి పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా సామాజిక ప్రభావిత అంచనా అధ్యయనం కూడా చేసి కేంద్రానికి వెంటనే నివేదిక ఇవ్వనున్నారు. మరో వైపు భూమి సర్వే పనులు కూడా ఊపందుకున్నాయి. సర్వే పనులు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయి. సామాజిక ప్రభావిత అంచనా నివేదికను పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్ధ చేపట్టనుంది.

సమస్యల పరిష్కారానికి.. ప్రాంతీయ భద్రతా వ్యవస్థ అవసరం

సింగపూర్, జూన్ 4: ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, బలప్రయోగం, ఇతర ముప్పులనుంచి ఎదుర్కోవడానికి ఒక ప్రాంతీయ భద్రతా వ్యవస్థ అవసరమని భారత్ అభిప్రాయ పడింది. శనివారం ఇక్కడ 15వ షంగ్రీ-లా సదస్సునుద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి ఇప్పటికీ ప్రధాన ముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఆయన అన్నారు. ‘మన ప్రాంతంలోని భద్రతా వ్యవస్థ ఇప్పటికీ ఉగ్రవాదంపట్ల అవసరమైనంత దృష్టి పెట్టడం లేదు.

ఎవరు దున్నపోతు? (కథ)

కుండపోతగా కురుస్తున్న వర్షంలో గొడుగు వేసుకుని మరీ వచ్చిన శేషగిరిని చూసి నేనాశ్చర్యపోయాను.
‘‘ఇంత వర్షంలో వచ్చావేంట్రా? రారా!’’ అంటూ ఆహ్వానించాను, ఉబుసుపోక తిరగేస్తున్న ‘పోసుకోట పిట్ట’ తెలుగువీక్లీని పక్కన పడేసి..
శేషగిరి గొడుగు గుమ్మానికి ఆనించి, చెప్పులు విడిచి లోనికి ప్రవేశించాడు.
చేతిలో గొడుగున్నా కురుస్తున్న వర్షం సామాన్యమైందా? మనిషి సగానికి పైగా తడిసిపోయి ఉన్నాడు. చలికి కొద్దిగా వణుకుతూ ఉన్నాడు. ‘ఏదో అర్జంటు పనే ఉండుంటుంది.. లేకపోతే ఇంత వర్షంలో ఎందుకొస్తాడు? అని మనసులో అనుకుంటూ- ‘‘రారా! వచ్చి అలా కూర్చో! నీకు మర్యాదలేంటి?’’ అన్నాను కుర్చీ చూపిస్తూ..

- కోలపల్లి ఈశ్వర్

భారత్‌తో అలీకి ఎనలేని అనుబంధం

న్యూఢిల్లీ, జూన్ 4: మహమ్మద్ అలీకి భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. 1980 జనవరి 31న అతను మద్రాసు (నేటి చెన్నై)లో మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ జిమీ ఎలిస్‌తో కలిసి ఎగ్జిబిషన్ ఫైట్‌లో పాల్గొన్నాడు. ఆ పోటీకి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్‌లో తనకు లభించిన ఆదరణను అలీ చాలా సందర్భాల్లో గుర్తుచేసుకున్నాడు. ‘మీనంబాకం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు వేలాది మంది అభిమానులు నాకు అభినందనలు తెలుపుతూ హర్షధ్వానాలు చేయడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జీవితాంతం నా జ్ఞాపకాల దొంతరలో పదిలంగా దాచుకునే సందర్భమది.

Pages