S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో 9మంది సైనికుల గల్లంతు

అమెరికా: పోర్ట్‌హుడ్ మిలటరీ బేస్‌లో శిక్షణ పొందుతున్న వాహనం వరదల్లో కొట్టుకుపోవడంతో పనె్నండు మంది సైనికులు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురిని రక్షించారు. మరో తొమ్మిది మంది మరణించారు. వారి మృతదేహాలకోసం గాలిస్తున్నారు. ప్రత్యేకవాహనం నడిపే శిక్షణ పొందుతున్న సమయంలో ఒక్కసారిగా వరదలు రావడంతో వారి వాహనం (ఓ పడవ) కొట్టుకుపోయింది.

కృష్ణా వివాదంపై దత్తన్నతో హరీశ్ భేటి

హైదరాబాద్:కృష్ణా యాజమాన్య బోర్డు వ్యవహారంలో జోక్యం చేసుకుని తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను మంత్రి హరీశ్‌రావు కోరారు. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, అడ్డంకులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేంద్రానికి ఈ విషయంలో వాస్తవాలు తెలియచేయాలని ఆయన దత్తన్నను కోరారు. త్వరలో తాను ఢిల్లీకి వెళ్లి వాస్తవాలు తెలియచేస్తానని కూడా హరీశ్ చెప్పారు.

హరీశ్‌తో కోమటిరెడ్డి భేటి

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుతో నల్గొండ కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఉదయం భేటీ అయ్యారు. ఆయన త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

అనంత్‌నాగ్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడి

శ్రీనగర్:ఉప ఎన్నికలు జరుగుతున్న అనంత్‌నాగ్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. నిన్న జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా ఇవాళ అనంత్‌నాగ్ జనరల్ బస్టాండ్‌లో భద్రతాబలగాలపై దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఎఎస్‌ఐ బషీర్ అహమ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయారు.

చంద్రబాబుతో సురేశ్‌ప్రభు భేటీ

విజయవాడ:రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పేందుకు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఆయన నివాసానికి వచ్చిన సురేశ్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యసభ ఎన్నికలో సహకరించినందుకు ఆయన కు కృతజ్ఞతలు తెలిపారు.

మహామంత్రి ఖడ్సే రాజీనామా

ముంబై: తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర రెవిన్యూమంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే రాజీనామా చేశారు. అథోజగత్తు అధిపతి దావూద్ ఇబ్రహీంసహా పలువురు తీవ్రవాదులతో సంబంధాలున్నాయని, ఆయన కాల్‌లిస్ట్‌లో దావూద్ ఫోన్‌నెంబర్ ఉందన్న విమర్శలు వచ్చాయి. 40 కోట్ల రూపాయల విలువైన ఫ్రభుత్వ భూమిని అల్లుడికి కేవలం నాలుగు కోట్ల రూపాయలకే కట్టబెట్టారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ వివాదాలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లి ఓ నివేదికను సమర్పించారు. ఈలోగా ఖడ్సే రాజీనామా చేశారు.

బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ కన్నుమూత

వాషింగ్టన్:ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ (74) కన్నుమూశారు. అమెరికాలోని అరిజోనాలో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నెగ్గిన మహమ్మద్ అలీ తలకు తగిలిన గాయాలతో పార్సిన్సన్ వ్యాధికి గురయ్యారు. 32 ఏళ్లుగా ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నారు. చివరకు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

సెరెనా ఆశలు సజీవం

పారిస్, జూన్ 3: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (34) టైటిల్‌కు చేరువైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె అన్‌సీడెడ్ కికీ బెర్టెన్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో 60వ ర్యాంకు క్రీడాకారిణి యులియా పుతిన్‌త్సెవాపై విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిన సెరెనా విలియమ్స్ శుక్రవారం సెమీఫైనల్‌లో వరుసగా రెండో రోజు కూడా స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయినప్పటికీ 7-6 (9/7), 6-4 తేడాతో కికీ బెర్టెన్స్‌ను ఓడించి ఫైనల్‌లో ప్రవేశించింది.

పేస్‌కు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్

పారిస్, జూన్ 3: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) టైటిల్ కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో వీరు 4-6, 6-4, 10-8 సెట్ల తేడాతో హైదరాబాద్ క్వీన్ సానియా మీర్జా, ఇవాన్ డోడిగ్ జోడీని మట్టికరిపించి విజేతలుగా నిలిచారు.

ఐఓసికి నామినేట్ అయిన నీతా

న్యూఢిల్లీ, జూన్ 3: ప్రపంచంలో అత్యున్నత క్రీడా ప్రాధికార సంస్థ అయిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యత్వానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నామినేట్ అయ్యారు. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఐఓసి సమావేశంలో నీతా అంబానీ సభ్యురాలిగా ఎన్నికైతే అందులో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళగా ఆమె రికార్డులకు ఎక్కుతారు. ఐఓసిలో భారత్‌కు సర్ దొరాబ్జీ టాటా తొలి ప్రతినిధిగా వ్యవహరించగా, ప్రస్తుతం రాజా రణ్‌ధీర్ సింగ్ గౌరవ సభ్యునిగా కొనసాగుతున్నారు.

Pages