S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ గిటార్ వాయించలేం

ఔను అది నిజమే! ఎందుకంటే ఇది అగ్గిపుల్లలతో తయారు చేసినది కాబట్టి. నలభై ఏళ్లుగా అగ్గిపుల్లలతో కళాఖండాలను సృష్టించడం జనుజ్ టర్బన్‌స్కికి అలవాటు. పోలండ్‌కు చెందిన ఈ కళాకారుడు రుడాప్లాస్కాలోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ స్టాల్‌లో తాను తయారు చేసిన వస్తువులను ప్రదర్శనకు ఉంచుతాడు. తాజాగా ఆయన రూపొందించిన వాటిలో ఈ గిటార్ కుడా ఉంది.

భారతి

బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం

తొమ్మిదో ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిప త్యం స్పష్టంగా కనిపించింది. ఒక వికెట్‌కు సగటున 28.36 పరుగులు జత కలిశాయి. 2014లో వికెట్‌కు సగటున 28.18 పరుగులు నమోదయ్యాయి. ఆ రికార్డును తొమ్మిదో ఐపిఎల్ అధిగమించింది. విరాట్ కోహ్లీ 973 పరుగులు సాధించాడు. ఒక సీజన్‌లో ఒక బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో అతను అగ్రస్థానాన్ని సంపాదించాడు. అంతేగాక, ఐపిఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ పట్టికలో సురేష్ రైనాను రెండో స్థానానికి నెట్టిన కోహ్లీ నంబర్ వన్‌గా ఎదిగాడు. కాగా, ఈ ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 848 పరుగులు సాధించాడు.

తోటలో యోగా

ఆరుబయట, చల్లగాలి వీస్తూంటే, టీ తోటల్లో యోగా చేయడం ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు ఈ చిత్రంలో కన్పిస్తున్న అందగత్తెలు. చైనాలోని హంగ్జౌ ప్రాంతంలో ఓ టీవీ కార్యక్రమంకోసం వీరంతా ఓ టీ తోటలో ఇలా యోగా ప్రదర్శన చేశారు.

భారతి

క్రికెట్ బోర్డులకు ఐపిఎల్ భయం!

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) భయం పట్టుకుంది. స్వదేశంలో జరిగే టోర్నీలకేకాదు.. దేశం తరఫున ఆడాల్సిన సిరీస్‌లకు కూడా గైర్హాజరవుతున్న చాలా మంది క్రికెటర్లు ఐపిఎల్‌లో పాల్గొనేందుకు పరుగులు తీయడమే బోర్డుల ఆందోళనకు ప్రధాన కారణం. కెరీర్ మొత్తంలో సంపాదించలేనంత మొత్తం ఒకటి రెండు ఐపిఎల్ సీజన్లలోనే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అందుకే, ఒక్కసారైనా ఈ మెగా టోర్నీలో ఆడాలని బ్యాట్ లేదా బాల్ పట్టిన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అనారోగ్యాన్ని, ఫిట్నెస్ సమస్యలను పట్టించుకోకుండా ఐపిఎల్‌లో ఆడేస్తున్నారు.

- శ్రీహరి

సైకిల్‌కోతి

ఈ దృశ్యం చూసి...కోతి చేష్టలంటూ తీసి పడేయకండి! చైనాలోని షెన్‌యాంగ్ పట్టణంలోని ఓ సైన్స్ రిసార్ట్‌లో ఇది సందర్శకులకు పెద్ద ఆకర్షణ. ఎందుకంటే అది ఓ చిన్న సైకిల్‌ను చక్కగా తొక్కుతూంటుంది. దానిని చూసేందుకు పెద్దసంఖ్యలో సందర్శకులు ఆ రిసార్టుకు వస్తూంటారు మరి.

భారతి

అందమైన మలుపు

అందంగా కన్పిస్తున్న ఈ మలుపుల రహదారిపై ప్రయాణించాలని మనసు ఎంత తపన పడినా గుండెధైర్యం ఉండాలి. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ గోర్జి మొరాకోలో ఉంది. అల్లాస్, బెల్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న లోతైన లోయలోని మలుపుల రహదారి ఇప్పుడు పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ నిర్వహించిన ట్రావెలర్ ఫొటోగ్రఫీ పోటీకోసం పంజియాలోమ్ నెట్టి అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీసి పంపాడు.

భారతి

ఈ పండు అక్కడ నిషేధం!

అచ్చం పనసపళ్లలా కన్పించే వీటిని డురియన్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. ఆగ్నేయ ఆసియాలో వీటిని ఎక్కువగా పండిస్తారు. బాగా పండినప్పుడు ఈ పళ్లు కుళ్లిన ఉల్లిపాయల్లా దుర్వాసన వెదజల్లుతాయి. రుచి తియ్యగానే ఉన్నా ఈ వాసన ఎవరూ భరించలేరు. ప్రపంచంలో డురియన్ పళ్ల సాగులో థాయ్‌లాండ్ అగ్రస్థానంలో ఉంది. సింగపూర్ సహా పలు ఆగ్నేయ ఆసియా దేశాల్లో బహిరంగ ప్రాంతాల్లో వీటిని పెంచడం, విక్రయించడం, వినియోగించడం నిషేధించారు. మెట్రోరైళ్లు, బస్సులు, విమానాలు, సినిమాహాళ్లు, పార్కులవంటి పబ్లిక్‌ప్లేసుల్లో వీటిని వాడితే భారీ జరిమానా తప్పదు. ఈ పళ్ల ఉపరితలంపై ముళ్లలాంటి బొడిపెలుంటాయి.

ఎస్.కె.కె.రవళి

డంగ్ బీటిల్స్ మూడు రకాలు

పర్యావరణానికి ఎంతో మేలు చేసే ‘డంగ్ బీటిల్స్’ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. జీవులు విసర్జించిన మలాన్ని క్షణాల్లో రీసైకిల్ చేసే ఈ బీటిల్స్ ప్రపంచానికి చేసే మేలుకు వెలకట్టలేం. ఏనుగు విసర్జించిన పేడను తినేందుకు క్షణాల్లో 16వేల డంగ్ బీటిల్స్ చేరిపోతాయి. అవి కేవలం రెండు గంటల్లో ఆ పేడను తరలించేస్తాయి. ఒక్కో డంగ్ బీటిల్ తన శరీర సామర్థ్యానికన్నా 250 రెట్లు అధిక బరువును దొర్లించుకుపోయే శక్తి కలిగి ఉంటుంది. బంతుల్లా చుట్టి మలాన్ని తరలించే ఈ డంగ్ బీటిల్స్ గుడ్లను ఆ బంతుల్లోనే పెట్టేస్తాయి. వీటిలో మూడు రకాలుంటాయి. మలాన్ని ఎక్కడుందో వెతికి, వాటిని తరలించేవాటిని రోలర్స్ అంటారు.

ఎస్.కె.కె.రవళి

మలింగ విశ్వప్రయత్నం

గాయంతో బాధపడుతున్నానని అంటూ ప్రతిష్టాత్మక టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి నిరాకరించిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఐపిఎల్‌లో ఆడేందుకు ఉత్సాహం చూపాడు. ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సిన అతను చివరి వరకూ ఐపిల్‌లో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, జాతీయ జట్టుకు ఆడేందుకు అడ్డు వచ్చిన ఫిట్నెస్ సమస్య ఇప్పుడు ఏమైందంటూ శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అధికారులు మలింగను నిలదీశారు. ఐపిఎల్‌లో పాల్గొంటే, ఆతర్వాత లంక జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని
శాశ్వతంగా కోల్పోతా

ఈ కుక్క మొరగదు!

ఆస్ట్రేలియాలో అందరూ ప్రేమగా పెంచుకునే ‘డింగో’ డాగ్స్ మిగతా కుక్కలకు భిన్నంగా ఉంటాయి. ఇవి వేటకు ఉపయోగించే రకం. ఇవి మిగతా కుక్కల్లా అరవడం, మొరగడం చేయవు. తోడేళ్లలా ఇవి ఊళపెడతాయి. కుందేళ్లు, కంగారూలవంటి జంతువులను ఇవి వేటాడి చంపుతాయి. చాలామంది అందుకోసమే వీటిని పెంచుతారు. అయితే వీటి విశృంఖల వైఖరివల్ల చాలా జీవజాతులు అంతరించిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఇవి ఈ దేశపు జంతువులు కావు. వేరేప్రాంతంనుంచి తెచ్చి ఇక్కడ పెంచడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా పేరు చెబితే డింగోవైల్డ్ డాగ్ గుర్తుకువస్తుంది. వారి సంస్కృతిలో అవి ఓ విడదీయరాని భాగంగా మారిపోయాయి.

ఎస్.కె.కె.రవళి

Pages