S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీటి అరుపు దెయ్యంలా ఉంటుంది!

చూడటానికి అసహ్యంగా కన్పించే ఈ టాస్మేనియన్ డెవిల్స్‌కు వాటి అరుపువల్లే ఆ పేరు వచ్చింది. తీవ్రమైన స్వరంతో, భయంగొలిపేలా అరిచే ఈ జంతువుల పళ్లు చాలా బలంగా ఉంటాయి. లోహపు ఫలకాన్నికూడా కొరికేంత శక్తి వీటికి ఉంది. బతికున్న జంతువులనూ పట్టి పీక్కుతినే ఇవి వెంట్రుకలనూ వదలకుండా ఆరగించేస్తాయి. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా దీవుల్లో మాత్రమే కన్పించే ఇవి కొవ్వును తోకల్లో నిల్వ చేసుకుంటాయి. వీటి తోకలు సుష్టుగా ఉంటే అవి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. తోకలు సన్నగా ఉంటే అవి రోగాలతో బాధపడుతున్నట్లు తెలిసిపోతుంది. వీటికి సులువుగా రోగాలు అంటుకుంటాయి. వీటి ప్రధాన శత్రువు డింగోవైల్డ్ డాగ్.

ఎస్.కె.కె.రవళి

ఖతార్ చేరుకున్న మోదీ

దోహా:ఐదుదేశాల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ఆఫ్గానిస్తాన్ లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోదీ రాత్రికి ఖతార్ చేరుకున్నారు. దోహా విమానాశ్రయంలో మోదీకి ఘనస్వాగతం లభించింది. హైడ్రోకార్బన్ సహా పలు రంగాల్లో ఖతార్‌తో పలు ఒప్పందాలు ఈ పర్యటన సందర్భంగా కుదరనున్నాయి.

ఖడ్సేపై విచారణకు ఆదేశం

ముంబై:మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. భూదందా, దావూద్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఖడ్సే మంత్రి పదవిని వదులుకోవల్సి వచ్చింది.

నా హీరో మీరే..

ముంబై:‘నా చిన్ననాటి రియల్ హీరో మీరే...ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుస్తాననుకున్నా...ఆ పని చేయలేకపోయా’నంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిఖ్యాత బాక్సింగ్ యోధుడు మహమ్మద్ అలీకి ఈ విధంగా సచిన్ నివాళి అర్పించారు. ట్విట్టర్‌లో తన బాధను ఇలా తెలియచేశాడు.

సుంకేశులకు వరద

మహబూబ్‌నగర్:ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సుంకేశుల జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ప్రస్తుతం 1400 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.34 టిఎంసీల నీరుండగా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసీలు.

వైకాపా-టిడిపి కార్యకర్తల ఘర్షణ

అనంతపురం:అనంతపురం జిల్లా కథిరిలో వైకాపా అధినేత జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో గందరగోళం ఏర్పడింది. జగన్ ర్యాలీలో పాల్గొనగా వైకాపా, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరుపక్షాలూ పరస్పరం చెప్పులు విసురుకున్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన విమర్శలతో ఆగ్రహంతో ఉన్న టిడిపి కార్యకర్తలు వైకాపా కార్యకర్తలతో తలపడ్డారు. దీంతో జగన్ ర్యాలీలోంచి తప్పుకుని కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

అమెరికాలో దారుణం

అరిజోనా:అరిజోనాలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లల్ని కత్తితోపొడిచి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. రెండునెలల పసికందుతోసహా, 3, 5 సంవత్సరాల పిల్లల్ని కత్తితో పొడిచి ఓ గదిలో పడేసిన ఆమె ముందున్న హాలులో తన కడుపులో కత్తితో పొడుచుకుని ప్రాణాలు తీసుకుంది.

ఆఫ్గాన్‌తో చెరిగిపోని మైత్రీబంధం : మోదీ

కాబూల్:ఆఫ్గానిస్తాన్‌తో మైత్రీబంధం విడదీయలేనిదని, ఇరుదేశాలమధ్య సంబంధాల్లో సంధ్యాసమయం ఉండదని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తన ఐదురోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోదీ శనివారం ఆఫ్గానిస్తాన్ చేరుకున్నారు. మరో మిత్రదేశం ఇరాన్‌కు దగ్గరగా ఉండే ఆఫ్గాన్ నగరం హీరత్‌లో భారత్ సహకారంతో నిర్మించిన డ్యామ్‌ను ఆయన ప్రారంభించారు. 1700 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ డ్యామ్‌కు గతంలో సల్మా అని పిలిచేవారు. కాగా ఇవాళ్టినుంచి దీనికి ‘ఇండో-ఆఫ్గాన్ ఫ్రెడ్‌షిప్ డ్యామ్’గా పిలుస్తారు. ఆఫ్గాన్ నుంచి ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.

ఏపి పీజి ఈసెట్ ఫలితాలు విడుదల

విజయవాడ:ఏపీ పిజిఈసెట్-16 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నతవిద్యామండలి చైర్మన్ వేణుగోపాల రెడ్డి ఫలితాలు విడుదల చేశారు.

Pages