S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహ్మద్ అలీకి తీవ్ర అస్వస్థత?

ఫీనిక్స్ (అమెరికా), జూన్ 3: దీర్ఘ కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అలనాటి బాక్సింగ్ వీరుడు, ప్రపంచ హెవీ వెయిట్ మాజీ చాంపియన్ మహ్మద్ అలీ (74) అమెరికాలోని ఫీనిక్స్ ప్రాంతంలో మరోసారి ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన గతంలో కంటే మరింత తీవ్రస్థాయిలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోందని అలీ పరిస్థితి గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. 1980వ దశకం నుంచి అలీ పార్కిన్సన్స్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

ఇండోనేషియా ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ

జకార్తా, జూన్ 3: త్వరలో ఒలింపిక్ క్రీడలకు వెళ్లబోతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఆమె స్పెయిన్‌కు చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో పాటు గతంలో మూడుసార్లు ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిళ్లను కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్ 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో కరోలినా డిఫెన్స్‌ను చేధించడంలో విఫలమైంది.

బడి ఫీజుల నిర్ణయాధికారం పాలకమండళ్లకే జీవో జారీ

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలో స్కూలు ఫీజులను కట్టడి చేస్తామని, స్కూళ్ల బరితెగింపునకు ముకుతాడు వేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించిన కొద్ది గంటలకే స్కూలు ఫీజుల నిర్ధారణ అధికారం పాలకమండళ్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఇఓలకు మెమోలు పంపించారు. ఇదే జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు తమ ఇష్టారాజ్యంగా ఫీజులను ఖరారు చేసే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎఎండి పరిశోధనల్లో విద్యాసంస్థలకు చోటు

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విఎల్‌ఎస్‌ఐ అకాడమీలో భాగస్వామి అయ్యేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎఎండి సంసిద్థత వ్యక్తం చేసింది. ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎఎండిలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రూత్ కాటర్‌తో సమావేశం అయ్యారు.

తరలింపు వాయిదా వేయండి

హైదరాబాద్, జూన్ 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్‌ను కోరారు. ప్రభుత్వం జూన్ చివరి నాటికి అమరావతి తరలివెళ్లాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిందే తప్ప పూర్తి వివరాలు తమకు ఇవ్వలేదని, దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇస్తే బావుంటుందని వారు సిఎస్‌కు విజ్ఞప్తి చేశారు. అమరావతి వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఉద్యోగులను పంపించాలని, అందరినీ పంపాలని కోరడం సబబుకాదని పేర్కొన్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి లైన్ క్లియర్

హైదరాబాద్, జూన్ 3: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించనున్న అంతర్జాతీయ విమనాశ్రయానికి అవరోధాలు తొలిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ, హడ్కో, స్పెషల్‌పర్పస్ వెహికల్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంపెనీ ఉమ్మడిగా ఎంఓయూను ఖరారు చేశాయి. దీని వల్ల హడ్కో ఈ విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం రూ. 650 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తుంది. మొదటి దశలో 2400 ఎకరాల భూమిని సేకరించేందుకు ఈ నిధులను ఖర్చుపెట్టనున్నారు. వచ్చే 15 రోజుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సంస్థకు ఈ నిధులను మంజూరు చేస్తారు. విజయనగరం జిల్లా కలెక్టర్ వద్ద ఈ నిధులను డిపాజిట్ చేస్తారు.

ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు!

వాషింగ్టన్, జూన్ 3: సెకండ్ హ్యాండ్‌లో ఓ ఫ్రిజ్‌ను కొన్న అమెరికా మహిళకు ముచ్చెమటలు పట్టాయి. సమీపంలోని ఓ గ్యారేజీలో కేవలం 30 డాలర్లకే ఈ సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్‌ను ఆనందంగా కొనేసింది. ఈ గ్యారేజ్ తన పొరుగున ఉన్న వారిదే కావడంతో చాల నమ్మకంతోనే దాన్ని కొన్నానని ఉత్తరకరోలీనాకు చెందిన మహిళ వెల్లడించిది. తీరా ఇంటికెళ్లి చూస్తే అందులో మానవ దేహానికి సంబంధించిన భాగాలు ఉన్నాయంటూ విస్మయకర స్వరంతో తెలిపింది. వెంటనే ఈ విషయాన్ని స్థానిక చానల్‌కు తెలిపింది. అయితే తమకు ఫ్రిజ్ అమ్మిన పొరుగునున్న వ్యక్తి వెంటనే దీన్ని తెరవద్దని ఇదో టైమ్‌క్యాప్సుల్ అని చెప్పడంతో తాను దాన్ని తెరవలేదని పేర్కొంది.

ఉగ్రవాదంపై పాక్ ఉదాసీనత

వాషింగ్టన్, జూన్ 3: భారత్‌పై దాడులకు పాల్పడిన లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా తప్పుపట్టింది. దీంతో ఉగ్రవాద సంస్థలు రిక్రూట్‌మెంట్‌లు, నిధుల సేకరణ నిరాటంకంగా కొనసాగుతోందని పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ వార్షిక నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. పాకిస్తాన్ మిలటరీ, భద్రతా దళాలు ఉగ్రవాదాన్న అణచివేయడానికి తీసుకున్న చర్యలను నివేదికలో వివరించింది. పాకిస్తాన్‌లోనే తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్తాన్(టిటిపి) నిత్యం దాడులకు పాల్పడుతోంది. ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమవుతోందని యుఎస్ తెలిపింది.

ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించలేదా?

హైదరాబాద్, జూన్ 3: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిలపడిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు నిలదీసే సమయం వచ్చిందని, అందుకే తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారని, అందులో తప్పుపట్టేందుకు ఏమీ లేదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేసిన చంద్రబాబు ఆయనపైన వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మతిమరుపువ్యాధితో బాధపడుతున్నారని, నవ నిర్మాణ దీక్షలు ఎందుకని అడిగారు.

సారథిలేని దేవాదాయం

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుగగా, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ (ఎండోమెంట్స్) నిర్లిప్తతగా కొనసాగుతోంది. సారథి లేని ఈ శాఖ నిర్వీర్యంగా కొనసాగుతోంది. భద్రాచలం, యాదాద్రి, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, మఠాలకు కేంద్ర స్థానమైన దేవాదాయ కమిషనరేట్ విషయంలో నిర్లిప్తతగా ఉంటున్నారు.

Pages