S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ విద్యాసంస్థల్లో ఇక అంతర్జాతీయస్థాయి సిలబస్

న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్ రూపకల్పనకు విదేశీ నిపుణుల సహకారం తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ సంకల్పించింది.

హేమా..నీకు తగునా!

న్యూఢిల్లీ, జూన్ 3: సొంత నియోజకవర్గం అల్లర్లతో అట్టుడికిపోతుంటే స్పందించడం మానేసి ఎప్పుడో షూ టింగ్‌లో పాల్గొన్న ఫొ టోలను ట్విట్టర్‌లో పో స్టుచేసి మధుర ఎంపీ, న టి హేమమాలిని తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. భూ ఆక్రమణల తొలగింపులో చెలరేగిన అల్లర్లలో మధుర నగర ఎస్‌పి, ఓ సిఐ మృతి చెందినట్టు వార్తలొచ్చాయి. ఘర్షణల్నో 24 మంది వరకూ చనిపోయినట్టు తెలిసింది. అయితే మధుర నియోజకవర్గ ఎంపీ, నటి హేమమాలిని ఇవేవీ పట్టించుకోకుండా తాను షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలు ట్విట్టర్‌లో పెట్టారు. హేమమాలిని తీరు బిజెపిని ఇబ్బందికి గురిచేసింది. అయితే సామాజిక మాద్యమాల్లో ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

-పఠాన్‌కోట్‌పై దాడి వ్యవహారం- పాక్‌కు ఎన్‌ఐఏ చీఫ్ క్లీన్‌చిట్‌పై దుమారం

న్యూఢిల్లీ, జూన్ 3: పఠాన్‌కోట్ దాడిని కొనసాగించడంలో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు సాయపడ్డం వెనుక పాక్ ప్రభుత్వం లేదా దాని ఏజన్సీకి హస్తం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ జాతీయ దర్యాప్తు ఏజన్సీ(ఎన్‌ఐఏ) చీఫ్ చేసినట్లుగా చెప్తున్న ప్రకటన భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొత్త వివాదానికి తెరదీసింది. కాగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ ఈ దాడిలో పాక్‌కు చెందిన వారి హస్తం ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమేని స్పష్టం చేసింది.

ఆధార్ అనుసంధానం కోసం పెన్షనర్లకు ప్రాధాన్యత ఇవ్వండి

న్యూఢిల్లీ, జూన్ 3: తమ బ్యాంక్ ఖాతాలతో ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకోవడానికి బ్యాంకులకు వచ్చే పెన్షనర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని బ్యాంకులు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ శుక్రవారం చెప్పారు. పెన్షనర్ల బ్యాం కు ఖాతాల్లో ఆధార్ నంబర్లు నమోదు చేయడానికి ఈ నెల 10వ తేదీ దాకా దేశవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేసే బ్యాంకుల్లో, వాటి శాఖల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై మిలిటెంట్ల దాడి

అనంత్‌నాగ్, జూన్ 3: జమ్మూకాశ్మీర్‌లోని బిజ్‌బెహారాలో శుక్రవారంనాడు ఆర్మీ కాన్వాయ్‌పై తీవ్రవాదులు తెగబడ్డారు.
ఈ దాడిలో ముగ్గురు బిఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. అలాగే ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. గొరిల్లా తరహాలాలో బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. 1ఏ హైవేను ఆనుకుని ఉన్న పట్టణంలో జవాన్లు, మిలిటెంట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం

చెన్నై, జూన్ 3: తమిళనాడులో శుక్రవారం నాటి ఘరో రోడ్డు ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఒక బస్సు, లారీ, కారు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కనీసం 30 మంది గాయపడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మెలుంమలైలో ఈ దారుణం చోటుచేసుకుంది. బెరిగైన నుంచి 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వేరుశెనగ లోడుతో వస్తున్న లారీని బలంగా ఢీకొంది. ఆ సమయంలో అదే మార్గంలో వస్తున్న కారును ఢీకొంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. ప్రాధమిక సమాచారం మేరకు అదుపుతప్పిన లారీ బస్సు, కారుపైకి దూసుకొచ్చింది.

వేగంగా విస్తరిస్తున్న విశ్వం!

వాషింగ్టన్, జూన్ 3: ఖగోళవేత్తలు గతంలో అంచనావేసిన దానికంటే విశ్వం చాలా వేగంగానే విస్తరిస్తోందని ఏకంగా ఐదు నుంచి తొమ్మిది శాతం మేర దీని విస్తృతి పెరుగుతునే వస్తోందని నాసా వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ అందించిన వివరాలను పరిశీలించిన నాసా శాస్తవ్రేత్తలు ఈ పరిణామాన్ని అనూహ్యమైనదిగానే పేర్కొంటున్నారు. దీని వల్ల శూన్య ఇంధనం, శూన్య పదార్ధం అలాగే రేడియేషన్ సహా ఏమాత్రం కాంతిని ప్రసరించని,.. విశ్వంలో 95శాతానికిపైగా ఉన్న మిస్టరీలను చేదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశ్వవిస్తరణ క్రమాన్ని అత్యంత కచ్చితంగా ఈ తాజా అధ్యయనంలో అంచనావేయగలిగారు.

ఏడాది చివరికల్లా బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణం పూర్తి

కోహిమా, జూన్ 3: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికల్లా పూర్తవుతుందని, ఆ తర్వాత ఇరువైపులనుంచి ఏ ఒక్కరు కూడా అక్రమంగా సరిహద్దులు దాటడానికి అనుమతించరని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డివి సదానంద గౌడ చెప్పారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి సంబంధించి గత ఆరున్నర దశాబ్దాల కాలంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇరువైపుల కూడా రాజ్యాంగ సవరణను సైతం చేయడం జరుగుతోందని శుక్రవారం ఇక్కడ రాజ్‌భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ సదానంద గౌడ చెప్పారు.

కాంగ్రెస్ నేతకు మినహాయంపా?

ఒక అభిమాని రామకోటి లాగ నరేంద్ర మోదీ పేరు షేర్వాణీ నిండా వచ్చేట్టు నేయించి దాన్ని మోదీకి బహుమతిగా ఇస్తే మోదీ దాన్ని ధరించి తర్వాత వేలంలో దాన్ని అమ్మేసి ఆ సొమ్ము మహిళా సంక్షేమానికి విరాళంగా ఇచ్చేశారు. ఆ షేర్వాణీ ఐదారు లక్షలు ఖర్చుతో తయారైంది. దాంతో అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ బాబా మోదీ ప్రభుత్వం సూటూ బూటుప్రభుత్వం అని ఎద్దేవా చేయడం మొదలుపెట్టాడు. ఈమధ్యనే నాసిక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత బంగారు నాణాలతో చొక్కా తయారుచేయించుకున్నాడు. దాని ఖరీదు కేవలంఒక కోటి రూపాయలు. అత్యంత ఖరీదైన చొక్కాగా అది గిన్నిస్ రికార్డు సాధించింది. మన రాహుల్ బాబా కిక్కురుమంటే ఒట్టు!

కసి దీక్ష...సంబురాలు

తెలుగు రాష్ట్రాల్లో గురువారం (2న) విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్ళు పూర్తయిన సంబురాలు, మరోవైపు రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం జరిగిపోయిందని బెజవాడలో కసి దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ రెండూ అధికారంలో ఉన్న పార్టీలే నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రోజంతా తెలంగాణలో అధికార పార్టీ నేతలు సంబురాల్లో మునిగి తేలారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రోజంతా బిజీ షెడ్యూలుతో గడిపారు. ఉదయమే ఆయన అసెంబ్లీ, కంట్రోలు రూంకు ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి

Pages