S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీలోని శత్రువులను దరికి రానీయకండి!

మనిషికి మొదటి శత్రువు కోపం. పగ, ద్వేషం, అసూయ, ఇతరులను ఆమోదించలేని లక్షణం - ఇవన్నీ మిగిలిన శత్రువులు.
ఇందులో పగ, ప్రతీకారం అనేవి అనాగరిక ఉన్మాదాలు. మనిషిని మృగంగా మార్చేస్తాయి. దురాశ మనిషిని రాక్షసుడిగా, నేరస్థుడిగా చేస్తుంది.
మనిషికి ప్రశాంతతను చేకూర్చే దివ్యౌషధాలు ఆప్యాయత, అనురాగాలు వంటి ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు.
డబ్బును కొలమానంగా చేసుకునే నైజం మనిషిలోని నైతిక శక్తిని నాశనం చేస్తుంది. మనిషి పతనానికి పునాదులుగా నిలిచేవి కక్షలు.

-సి.వి.సర్వేశ్వరశర్మ

ప్రేమ పాట

కొన్నాళ్లు సినిమాలో హీరో హీరోయిన్లు ఉన్నచోట నుంచి కదలకుండా చేతులు మాత్రం కదిలిస్తూ యుగళ గీతం, అందునా ప్రేమ పాట పాడేవారు. ముఖంలో భావాలు మాత్రం కనిపించేవి. ఆ తరువాత తెలుగు సినిమా నాయకా నాయికలు ప్రేమ పాట పాడాలంటే మైసూరు బృందావన్ గార్డెన్స్ వెళ్లకుండా కుదిరేది కాదు. అక్కడికి పోవడానికి వీలుగాకపోతే చెట్లు, గట్లు పట్టుకుని పరిగెత్తుతూ పాడుకునేవారు. ఆ పద్ధతీ పోయింది. ‘ఐ లవ్ యూ’ చెపుతావా లేక తన్నులు తింటావా? అటొక డజను, ఇటొక డజను హంగుదారులను వెంట వేసుకుని హీరో హీరోయిన్లు కుప్పిగంతులు వేస్తూ పాడుకునే రోజులు వచ్చాయి. వాళ్లు పాడుతున్న పాట తెలుగేమో తెలుసుకోవాలంటే బాగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది.

కె.బి. గోపాలం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

డి.వెంకట్రావు, ఉయ్యూరు
పది లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం జరుగుతోందని తెలిసి కూడా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకటో ధృతరాష్ట్రుడయ్యారు. ఇప్పటికీ మండుతున్న ఆ బొగ్గు సెగ తగులుతూనే ఉంది. అలాగే ఏ.పికి ప్రత్యేక హోదాపై తన కేంద్ర మంత్రులే తలో మాట మాట్లాడుతున్నారని తెలిసి కూడా ప్రస్తుత ప్రధాని మోదీ రెండో ధృతరాష్ట్రుడయ్యారు.
పోలిక బాగాలేదు.

హోదా ఎపిసోడ్‌లో చంద్రబాబుది శకుని పాత్రా? దుర్యోధన పాత్రా?
ఆయనా ధృతరాష్ట్రుడి టైపే.

పెర్సిబ్రిగ్మన్

ఇతను అమెరికన్ భౌతిక శాస్తవ్రేత్త. ఎంత కఠినమైన వస్తువైనా ముక్కలు చేయగల యంత్రాలను కనుగొని కొత్త ప్రపంచానికి దారులు తెరిచాడు. వందేళ్ల క్రితం కొన్ని వేల రెట్లు వత్తిడి గల యంత్రాలను ఎవరూ ఊహించలేదు. 1940కల్లా బ్రిగ్నమ్ 100 రెట్ల వత్తిడిగల యంత్రాలను రూపొందించాడు. దీనితో భూమి లోపలి పదార్థాల ప్రవర్తనపై శాస్తవ్రేత్తలు అధ్యయనం చేయడానికి మార్గం ఏర్పడింది. కృత్రిమ వజ్రాల తయారీకి మార్గాలు తెరుచుకున్నాయి.

-నాయక్

వెనుకటి రోజులు రావాలి

ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా చక్కని కవర్‌స్టోరీని అందించారు. కుటుంబ దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శం అంటూ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎలా కలసిమెలసి ఉండేది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల ప్రయోజనాలు, సమస్యలు, రాన్రాను చిన్న కుటుంబాలు ఏర్పడటంవల్ల తలెత్తుతున్న సమస్యలను క్లుప్తంగా అర్థవంతంగా వివరించినందుకు ధన్యవాదాలు. ఉమ్మడి కుటుంబంలో అందరూ కలసిమెలసి ఉండటంవల్ల ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కారం అవుతుంది. పిల్లలకు తాత నాయనమ్మల ఆప్యాయతలు లభిస్తాయి.

ఎలా వుందీ వారం? జూన్ 5 నుండి 11 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
నిర్ణయాత్మక ధోరణితో పనులు పూర్తి చేస్తారు. అన్నింటా సమన్వయం అవసరం. ఉద్యోగులు, వ్యాపారస్థులు, విద్యార్థులకు అవకాశాలు మెరుగవుతాయి. తొందరపాటు నిర్ణయాలు అనర్థకమని గ్రహిస్తారు. కొత్త పనులను వాయిదా వేయాల్సి రావచ్చు. అవసరాలకు తగిన ఏర్పాట్లు ముందుగా చేసుకోవటం ఉత్తమం. విషయాలు వెంటనే కార్యరూపం దాల్చకపోయినా కలత చెందవద్దు. వాహన ప్రమాదాలను నివారించుకోవాలి. బంధుమిత్రుల సహకారం అందుతుంది.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855

చాహల్ ప్రతిభ

* యుజువేంద్ర చాహల్ ఒక్కడే ఈసారి ఐపిఎల్‌లో రాణించిన స్పిన్నర్. అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. నిరుడు 23 వికెట్లు పడగొట్టిన అతను ఈసారి 21 వికెట్లు సాధించాడు. అతనిని మినహాయిస్తే, భారత జాతీయ జట్టుకు ఎంపికకాని బౌలర్లు ఎవరూ ఇప్పటి వరకూ ఐపిఎల్‌లో 20కి పైగా వికెట్లను పడగొట్టలేదు. టీమిండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్న చాహల్ రెండుసార్లు 20కి మించి వికెట్లు కూల్చడం విశేషం. కాగా, పవర్ ప్లేలో ధవళ్ కులకర్ణి 14 వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్ చరిత్రలో పవర్ ప్లే సమయంలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది.

- సత్య

ఇరుకు

నగరాల్లో స్వంత ఇల్లు అనేది ఓ కలగా మిగిలిపోయింది. నగరం మధ్య స్వంత ఇల్లు దుర్లభం. స్వంతంగా వున్న ఇళ్లు అన్నీ అపార్ట్‌మెంట్లుగా మారిపోతున్నాయి. నగరానికి ఆమడ దూరంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి.
నగరం దగ్గర్లో వున్న గ్రామాలని నగరం మింగేసి ఎకరాలు ఎకరాలని గేటెడ్ విల్లాలుగా మారుస్తున్న పరిస్థితి. రోడ్డు పడిందంటే చాలు దాని చుట్టూ గృహాలు వస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు మెరుస్తున్నాయి. అది రింగ్ రోడ్ కావొచ్చు. మామూలు రోడ్డు కావొచ్చు. దేశంలో రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారం మరేదీ కన్పించడంలేదు.

ఆత్మవిశ్వాసం

చాలా రోజుల క్రితం మాట. అప్పుడు హైదరాబాద్‌లో ఏడవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. అది ఓ ప్రత్యేక కోర్సు. ఆహార కల్తీ చేసే వ్యక్తుల నేరస్తుల కేసులని విచారించే కోర్టు. ఆహారం కల్తీ నిరోధక చట్టం అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. అది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఆ కోర్టులో ఓ రెండు సంవత్సరాలు పని చేసిన తరువాత ఆ చట్టం మీద మంచి అవగాహన ఏర్పడింది. మిత్రులతో మాట్లాడినప్పుడు ఆ చట్టంలోని ప్రత్యేకమైన విషయాలని అలవోకగా చెప్పేవాణ్ని. నాకు ఆ చట్టం మీద కాస్త మంచి అవగాహన ఉందని చాలామందికి తెలిసింది. చివరికి ప్రాసిక్యూటర్లకి ఓ క్లాస్ తీసుకోమని పోలీస్ అకాడెమీ నుంచి ఫోన్ వచ్చింది.

-జింబో 94404 83001

కెప్టెన్ల టోర్నమెంట్!

ఈసారి ఐపిఎల్ కెప్టెన్ల టోర్నీగా మారిపోయింది. దాదాపుగా అన్ని జట్ల కెప్టెన్లు ఈ టోర్నీలో అద్భుతంగా రాణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు సాధించి ఒక రికార్డును, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులను నమోదు చేసి అధిగమించి మరో రికార్డును నెలకొల్పాడు. తొమ్మిదో ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. కాగా, రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన అసాధారణ ప్రతిభతో ఏకంగా జట్టుకు టైటిల్‌నే సాధించిపెట్టాడు. బ్యాట్స్‌మెన్‌కు స్వర్గ్ధామంగా మారిన ఈ ఐపిఎల్ స్పిన్నర్లకు మాత్రం చుక్కలు చూపెట్టింది.

Pages