S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో చేతికి ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్

న్యూఢిల్లీ, జూన్ 3: హౌజింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సికి చెందిన జీవిత బీమాయేతర సంస్థ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో.. ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్‌ను సొంతం చేసుకుంటోంది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ కొనుగోలులో 551 కోట్ల రూపాయలకు ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్.. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హస్తగతమవనుంది. ‘బీమా వ్యాపారంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగంలో ఏకీకరణలు అనివార్యం. ఈ లావాదేవీ ఇందుకు ఆరంభం.’ అని హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్ దీపక్ పరేఖ్ ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ బోర్డు ఈ కొనుగోలుకు అంగీకరించిందని కూడా చెప్పారు. అంతేగాక హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్ కలయిక..

కొత్తగా 10 వేల ఎల్‌పిజి పంపిణీదారులు

న్యూఢిల్లీ, జూన్ 3: వంటగ్యాస్ (ఎల్‌పిజి) వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కొత్తగా 10 వేల మంది పంపిణీదారులను నియమించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఎల్‌పిజి పంపిణీదారులున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌పిజి పంపిణీదారుల సంఖ్య సుమారు 26 వేలకు చేరనుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ‘2016 సంవత్సరాన్ని ఎల్‌పిజి వినియోగదారుల ఏడాదిగా మేము ప్రకటించాం.

తెలంగాణలో జోరుగా వాణిజ్య పన్ను చెల్లింపులు

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరాని (2015-16)కి సంబంధించి అత్యధికంగా వాణిజ్య పన్ను చెల్లించిన సంస్థల జాబితాను వాణిజ్య పన్నుల శాఖ శుక్రవారం విడుదల చేసింది. అత్యధిక పన్ను చెల్లించిన జాబితాలో తయారీ రంగం నుంచి ఐటిసి లిమిటెడ్, హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్, హిందుస్తాన్ కోకకోలా బేవరెజస్, ఏషియన్ పేయంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ఉన్నాయి. రిటైల్ విభాగంలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వరుణ్ మోటర్స్, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్, అశోక్ లీలాండ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉన్నాయి. నిర్మాణ రంగం నుంచి మేగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టి ఉన్నాయి.

అమెరికాలో 25 లక్షల కార్ల రీకాల్

న్యూయార్క్, జూన్ 3: అమెరికాలో మరోసారి భారీగా కార్ల రీకాల్‌కు ఆటోరంగ సంస్థలు పిలుపునిచ్చాయి. దాదాపు 25 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఆరు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. ఎయిర్ బ్యాగుల్లో లోపాల కారణంగానే ఈ రీకాల్‌కు దిగుతున్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. రీకాల్ చేస్తున్న కార్లలో జనరల్ మోటార్స్‌కు చెందిన 19 లక్షల ఎస్‌యువిలు, ఫోక్స్‌వాగన్‌కు చెందినవి 2 లక్షల 17 వేలు, మెర్సిడెస్ బెంజ్ కార్లు 2 లక్షలు, బిఎమ్‌డబ్ల్యు కార్లు 92 వేలు, జాగ్వార్ లాండ్‌రోవర్‌కు చెందినవి 54 వేలు, దైమ్లర్ వాహనాలు 5,100 ఉన్నాయి.

ఆటుపోట్ల మధ్య కాస్త అటుఇటుగా..

ముంబయి, జూన్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఎక్కడివక్కడే ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో చివరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ అతి స్వల్పంగా 0.11 పాయింట్లు తగ్గి 26,792.07 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం స్వల్పంగా 1.85 పాయింట్లు పెరిగి 8,220.80 వద్ద నిలిచింది. వచ్చేవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులపట్ల ఆచితూచి వ్యవహరించారని మార్కెట్ విశే్లషకులు ట్రేడింగ్ సరళిపై స్పందించారు.

ప్రథమార్ధంలో మరింత బలహీనం

ముంబయి, జూన్ 3: గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో బ్యాంకుల ఆర్థిక ఫలితాలు ఎంత పేలవంగా నమోదయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వరంగ బ్యాంకులైతే నష్టాల్లో సరికొత్త రికార్డులు సృష్టించాయి. కొన్నైతే వేల కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించాయి. దీనంతటికీ కారణం మొండి బకాయిలే (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ). ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లోనూ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు ఇంతకంటే దారుణంగా ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

రూ. 4,460 కోట్లు ఢమాల్

న్యూఢిల్లీ, జూన్ 3: మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది బ్యాంకర్ల పరిస్థితి. ఇప్పటికే విజయ్ మాల్యా వంటి బడా కార్పొరేట్ల మొండి బకాయిలతో తలబొప్పి కట్టించుకున్న బ్యాంకులకు ఇప్పుడు జేపీ గ్రూప్ సంస్థలు మరింత తలపోటులా మారాయి. 4,460 కోట్ల రూపాయల రుణాలు, చెల్లింపులపై ఈ సంస్థలు విఫలమయ్యాయి మరి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల విలువ 2,905.6 కోట్ల రూపాయలుగా ఉంటే, ఇతరత్రా వడ్డీ చెల్లింపులు 1,558.93 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

గ్రామీణ వైద్యమే కీలకం

సిమ్లా, జూన్ 3:దేశ జనాభాలో 75శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నందున వారికి సమగ్ర రీతిలో వైద్య సేవలను అందించడం ఓ పెద్ద సవాలేనని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దీని దృష్ట్యా ప్రజలందరికీ నాణ్యతాయుతమైన, సమానత్వంతో కూడిన వైద్య సదుపాయాలను కల్పించే దిశగా బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ఇక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవ స్నాతకోత్సవానికి అధ్యక్షతన వహించిన రాష్టప్రతి ‘వైద్య సంరక్షణ ప్రజల వౌలిక అవసరం. వైద్య సేవా రంగాన్ని మరింతగా బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాలకు దీన్ని విస్తరించాలి’అని స్పష్టం చేశారు.

ఉన్నత విద్యకు పది స్టార్టప్స్

న్యూఢిల్లీ, జూన్ 3: యువ పారిశ్రామికవేత్తల్లో శక్తి, ఉత్సాహాన్ని నింపేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పది ఉన్నత విద్యా ‘స్టార్ట్ అప్స్’లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. స్మృతి ఇరానీ శుక్రవారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి డిజిటల్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తున్న కొత్త మోడల్ డిగ్రీ కాలేజీల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యా రంగంలో పదిస్టార్డ్‌అప్స్‌లను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

నేడు విదేశీ పర్యటనకు మోదీ

న్యూఢిల్లీ, జూన్ 3: భారత దేశ విదేశాంగ సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి అమెరికా, మెక్సికో, ఖతర్, స్విట్జర్లాండ్, అఫ్గానిస్తాన్‌లలో పర్యటించనున్నా రు. 48 సభ్య దేశాలు కలిగిన అణు సరఫరా దేశాల కూటమిలో (ఎన్‌ఎస్‌జి) భారత్‌కు సభ్యత్వం కల్పించే విషయంలో మెక్సికో, స్విట్జర్లాండ్‌ల మద్దతును ఈ సందర్భంగా కోరబోతున్నారు. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం రావాలంటే ఈ రెండు దేశాల మద్దతు అత్యంత కీలకం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో జరిపే చర్చల్లో కూడా ఎన్‌ఎస్‌జి సభ్యత్వ అంశం ప్రస్తావనకు రాబోతోంది.

Pages