S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై నేడు పార్లమెంటరీ బృందం కీలక భేటీ

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై శనివారం హైదరాబాద్‌లో పార్లమెంటరీ బృందం కీలక సమావేశం జరుగుతుంది. ప్రాజెక్టుల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. పార్లమెంటు సభ్యులు హుకుం సింగ్ అధ్యక్షతన ఏర్పడిన 17 మంది సభ్యుల కమిటీ హైదరాబాద్‌కు రానుంది. మాదాపూర్‌లోని నోవాటెల్‌లో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పార్లమెంటు సభ్యుల బృందం వివిధ అంశాలపై చర్చిస్తుంది. సత్వర సాగునీటి పారుదల ప్రయోజనాల పథకం (ఎఐబిపి) కింద చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. ఎఐబిపి కింద 1996-97లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులలో తెలంగాణలో 16 ఉన్నాయి.

జనగామకు యాదాద్రే దిక్కు

వరంగల్, జూన్ 3: జిల్లా అవుతుందనుకున్న జనగామ చివరకు కొత్తగా ఏర్పాటు కానున్న యాదాద్రిలోనే కలవనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రభుత్వం కూడా జనగామకు బదులు మహబూబాబాద్‌ను జిల్లాగా చేసేందుకు మొగ్గుచూపుతోంది. వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలని ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్‌ఘన్‌పూర్, ఆలేరు నియోజకవర్గాలను జనగామలో కలిపి జనగామను జిల్లాగా చేయాలని భావించారు. అయితే మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. పెద్ద ఎత్తున రైల్‌రోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధం చేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

ఆశీర్వదించండి

తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్న నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
.......................

పెన్షన్ రాలేదని
మాజీ సర్పంచ్ ఆత్మహత్య

కష్టపడుతున్న ననే్న చెప్పులతో కొట్టమంటాడా?

విజయవాడ, జూన్ 3: రోజుకు 18 గంటలు కష్టపతున్న తనను చెప్పులతో కొట్టమని చెప్పే ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన దురదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో జగన్ పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై సిఎం తీవ్రంగా స్పందించారు. నగరంలో జరిగిన నవనిర్మాణ దీక్ష రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ 200 రోజులు తిరిగినా, రెండు సీట్లు కూడా ప్రతిపక్షానికి వచ్చే అవకాశమే లేదని అన్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని అన్నారు. కొంతమంది డబ్బులు సంపాదించినా ఆనందంగా ఉండరని, జైలుకు వెళ్లినా బుద్ధి రావడం లేదని జగన్ ఉద్దేశించి అన్నారు.

దిష్టిబొమ్మ దగ్ధం ఘటనలో విషాదం

విజయవాడ (కార్పొరేటర్), జూన్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. స్థానిక రమేష్ హాస్పటల్ సెంటర్లోని జాతీయ రహదారిపై టిడిపి శ్రేణులు 8వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు నేతృత్వంలో వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించగా ఊహించని విధంగా కార్పొరేటర్ జాస్తి దిష్టిబొమ్మ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు.

ఆమె చనిపోతూ.. 8 మందికి ఊపిరి

నెల్లూరు, జూన్ 3: తాను చనిపోతూ ఎనిమిది మందికి పునర్జన్మను ప్రసాదించింది ఆ మాతృమూర్తి. మూడు పదులు నిండని వయసులో మరణానికి చేరువవుతూ అవయవదానం చేయడం ద్వారా మరణానికి చేరువలో ఉండే అభాగ్యులకు ప్రాణదానం చేసింది. రాష్ట్రంలోనే తొలిసారి ఇతర అవయవాలతో పాటు ఊపిరితిత్తులను సైతం ఈ ప్రక్రియలో సేకరించడం గమనార్హం. ఈ మహత్తర అవయవదాన ప్రక్రియకు కర్త ఆ మాతృమూర్తి కాగా, కర్మ ఆమె చనిపోయిన మరికొందరిలో బతికుంటుందని భావించిన ఆమె భర్త, క్రియకు వేదికగా నెల్లూరులోని బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి నిలిచింది.

ఉద్రిక్తతల నడుమ జగన్ భరోసా యాత్ర

అనంతపురం, జూన్ 3 : అనంతపురం జిల్లాలో వైకాపా అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడవ రోజైన శుక్రవారం ఉద్రిక్తతల నడుమ సాగింది. ఈ యాత్రలో భాగంగా జగన్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించడం వివాదమైంది. దీంతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎదురుదాడులకు దిగడంతో పరిస్థితి వేడెక్కింది. జిల్లా వ్యాప్తంగా టిడిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టి జగన్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో రైతు భరోసా యాత్ర సాగింది.

మైత్రీ బంధంలో కొత్త శకం

హైదరాబాద్, జూన్ 3: భారత్- అమెరికాలు సహజ మిత్ర దేశాలని, ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, పర్యటనల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన శకం ప్రారంభమైందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, ఇక్కడ అద్భుతమైన వాణిజ్య అవకాశాలున్నాయని పిలుపునిచ్చారు. అమెరికాలో ఉన్న భారత్ ఐటి ఉద్యోగులకు వీసా నిబంధనలను సరళతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఇక్కడ ఇండో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సును ప్రారంభించారు.

రాజ్యసభకు అంతా ఏకగ్రీవం

హైదరాబాద్, జూన్ 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఆరుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆరుగురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఆంధ్రాలో నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి నుండి సురేష్‌ప్రభు, టిడిపి నుండి సుజనా చౌదరి, టిజి వెంకటేష్, వైకాపా నుండి విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయసాయి రెడ్డి మినహా మిగిలిన వారికి ఎన్నికైనట్టు పేర్కొంటూ ధ్రువపత్రాలను అందజేశారు. విజయసాయిరెడ్డి ఈ నెల 6న తన ఎన్నిక ధ్రువపత్రాన్ని స్వీకరించనున్నారు.

ననె్నవరూ శాసించలేరు

ప్ర: గత 35 ఏళ్ల నుంచి మంత్రి, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, జాతీయ రాజకీయాల్లో కీలకనేతగా పనిచేశారు కదా? అయినా ఇంకా ఈ వయసులో అలసిపోకుండా ఎలా ఉండగలుగుతున్నారు?
జ: ముందు మనసు నిర్మలంగా ఉండాలి. అత్యాశ ఉండకూడదు. మనం ప్రజల కోసం పనిచేస్తున్నామన్న భావనే నాకు ఆక్సిజన్. అదే నన్ను నిరంతరం నడిపిస్తుంది. నేను తినే తిండి చాలా తక్కువ. మామూలు బెడ్ మీదనే పడుకుంటా. ఎలాంటి అవినీతి అక్రమాలు చేయకపోతే హాయిగా నిద్రపడుతుంది.
ప్ర: కానీ మిగిలిన వారు కూడా మీలాగే పనిచేయాలనుకోవడం ఎంత వరకు సబబు?

మార్తి సుబ్రహ్మణ్యం

Pages