S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

రామగిరి/గోరంట్ల, జూన్ 3 : జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గోరంట్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాందలో వెంకటేశ్వర్లు (56)తోపాటు ఏడాది బాలుడు మృతి చెందాడు. అలాగే రామగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాందలో బాలు(36), లక్ష్మయ్య(40) మృతి చెందారు. స్థానికులు, ఆయా పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామగిరి మండలంలోని చెర్లోపల్లి సమీపంలో గల ఆర్‌డిటి చెక్‌డ్యాం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

రాష్ట్భ్రావృద్ధికి శ్రమిస్తున్న చంద్రబాబు

కనగానపల్లి, జూన్ 3:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ రాజధాని లేకుండా అడ్డగోలుగా విభజించారని, అయినప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినపుడు రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా ఏ మాత్రం చెదరకుండా రాష్ట్భ్రావృద్ధి కోసం పట్టువదలని విక్రమార్కుడులా ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం దగ్గర నవ నిర్మాణ దీక్షలో భాగంగా శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు.

అడ్డగోలుగా రాష్ట్ర విభజన

బొమ్మనహాల్, జూన్ 3 : అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కష్టాలు తెచ్చిపెట్టిందని చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి కష్టాల్లో ఉన్న సమయంలో ప్రజలు సమర్థుడైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. అప్పటి నుంచి నిద్రహారాలు మాని అహర్నిశలు అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్నలు చూరగొంటున్న చంద్రబాబును చూసి ఓర్వలేకనే జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

పరిహారం ఇవ్వరు.. భూమిలోకి పోనివ్వరు...

నంబులపూలకుంట, జూన్ 3: సోలార్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్‌కు భూములు కోల్పోయిన సాగు రైతులందరికి పరిహారం వెంటనే ఇవ్వాలంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, డివిజన్ కార్యదర్శి వేమయ్య యాదవ్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఎన్‌టిపిసి పవర్‌గ్రిడ్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సిపిఐ నాయకులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రజలకు అందించాల్సిన పరిహారం ఇవ్వకుండానే పనులు చేపట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా కూడా ఇంతవరకు 101 పట్టాదారు రైతులకు, 1156 మంది సాగుదారులకు పరిహారం పంపిణీ కాలేదన్నారు. మొదటగా సిపిఐ నాయకులు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి నుంచి ర్యాలీ నిర్వహించారు.

గాలిమరల ఏర్పాటును అడ్డుకున్న టిడిపి నాయకులు

నార్పల, జూన్ 3:నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లోని కొండల్లో ఇప్పటికే రూ.650 కోట్లతో గాలిమరల పనులు జరుగుతున్నాయి. గాలి మరల పనులను శుక్రవారం నార్పల మండల పరిధిలోని బొందలవాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు ఆలం వెంకటరమణ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలిమరలు ఏర్పాటు చేస్తున్న కంపెనీ వారు ఆయా మండలాల్లోని రైతుల భూములకు సరైన విలువ కట్టకుండా దౌర్జన్యంగా భూములు లాక్కున్నారని తెలిపారు.

జగన్‌కు నైతిక విలువలు లేవు

గుంతకల్లు, జూన్ 3 : వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు నైతిక విలువలు లేకనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అధికారం కోసం నోటి దురుసుగా మాట్లాడటం మంచిది కాదన్నారు. రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సమర్థవంతంగా వాటిని అధిగమించి రాష్ట్భ్రావృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబుపై బురదచల్లడం మంచిది కాదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తెలిసి, ప్రజలను ఆకర్షించే విధంగా ప్రవర్తించాలని హితవు పలికారు.

జిల్లాపై సిఎం ప్రత్యేక దృష్టి

సోమందేపల్లి, జూన్ 3 : వర్షాభావంతో తల్లడిల్లుతున్న అనంతపురం జిల్లాను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే బికె పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ కుటిల రాజకీయంతో రాష్ట్రం విడిపోయి కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాలను గట్టెక్కించేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు.

ఆత్మకూరు జంటహత్యల కేసు ఛేదింపు

అనంతపురం సిటీ, జూన్ 3:జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రంలో జరిగిన జంట హత్యల కేసును ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. జంట హత్యలకు సంబందించిన వివరాలను అనంతపురం డియస్పీ మల్లికార్జున వర్మ డియస్పీ కార్యాలయంలో విలేఖర్లకు వెల్లడించారు. డబ్బును రెండింతలు చేస్తామనే ఆశా చూపి డబ్బును కాజేసేందుకు హత్యలు చేశారని తెలిపారు. ఆత్మకూరుకు చెందిన ఏకిల సతీష్(38), జంగం బసవరాజు(33)లను మే 20న స్థానికంగా హత్య చేసిన కేసులో నిందితులైన కర్నాటక పావగడలోని అచ్చెమహళ్ళి రామప్పకుమారులు మల్లయ్య అలియాస్ పేకాట మల్లయ్య, సారాయి నారాయణప్ప అలియాస్ బెస్త శివప్రకాష్‌లను అరెస్టు చేశామని తెలిపారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

పెద్దవడుగూరు, జూన్ 3 : మండల పరిధిలోని మిడుతూరు గ్రామ సమీపంలో పెద్దవడుగూరు గ్రామానికి చెందిన చాకలి రంగడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రంగడు బుధవారం అనారోగ్యంతో బాధపడుతూ మందులు తెచ్చుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి శుక్రవారం శవమై కనిపించాడని విలపించారు. రంగడు మృతి పట్ల అనుమానంగా ఉందని, విచారణ చేసి న్యాయం చేయాలని కుమారుడు రామాంజినేయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఎంపిఇఓ మృతి

కుందుర్పి, జూన్ 3 : మండల పరిధిలోని కర్నాటక సరిహద్దులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసాపురం ఎంపిఇఓ లక్ష్మీనారాయణ(36) మృతి చెందాడు. బంధువులు, మిత్రులు తెలిపిన వివరాల మేరకు కుందుర్పి మండలంలో ఎంపిఇఓలుగా పనిచేస్తున్న రవి, రఘుతో కలిసి లక్ష్మీనారాయణ గురువారం రాత్రి కుందుర్పి నుంచి నాగేపల్లి గేటుకు వెళ్తుండగా నాగేపల్లి, శిగలపల్లి మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో లక్ష్మీనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. రఘు, రవికి తీవ్ర గాయలు కావడంతో స్థానికులు కర్నాటకలోని చిత్రదుర్గ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Pages