S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి తాళం

విజయనగరం (్ఫర్టు), జూన్ 3: అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల నేపథ్యంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఉద్యోగులలో గుబులు రేగుతోంది. ప్రతినిత్యం రద్దీగా ఉండే విభాగం గదికి శుక్రవారం తాళాలు వేశారు. గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు చేయడంతో ఆ విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. దీంతో ఈ విభాగంలో కీలకమైన రికార్డులు ఉండటంతో తగిన భద్రత కోసం గదికి తాళాలు వేసినట్లు తెలిసింది.

హేతుబద్ధీకరణ కింద 411 టీచర్ పోస్టులకు కోత

నెల్లిమర్ల, జూన్ 3: హేతుబద్ధీకరణ కింద జిల్లాలో సుమారు 411 ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోయి నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం స్థానిక మహాత్మా జ్యోతిలాల్ పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో కొత్తగా డి ఎస్సీకి ఎంపికైన ఎస్.జె.టి ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రేషన్‌లైజేషన్ వలన 411 ఉద్యోగాలు కోల్పోయినట్లు చెప్పారు. పిల్లలు తక్కువగా ఉండడం 116 పాఠశాలలను మూసివేసినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేయాలని అన్నారు. ప్రాథమిక స్థాయిలో ప్రతి ఏడాది విద్యార్థులు తగ్గుతున్నారని అన్నారు.

జోరుగా నువ్వు సాగు

వేపాడ, జూన్ 3: మండలంలో రైతులు నువ్వు గొప్పులలో నిమగ్నమయ్యారు. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు విస్తారంగా ఖరీఫ్ సాగు చేపట్టారు. అదను కుదరడంతో నువ్వుమొక్కలు నాటారు. అయితే నువ్వు మొక్కలతోపాటు కలుపుమొక్కలు విస్తారంగా పుట్టడంతో వాటి నివారణలో నిమగ్నమై ఉన్నారు. పూటకు వందరూపాయలు కూలీ చెల్లించి మరీ గొప్పులు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది ప్రస్తుతానికి నువ్వుచేలు బాగానే ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మండలంలో గుడివాడ, వల్లంపూడి, సామలాపల్లి, జాకేరు, కరకవలస తదితర గ్రామాలలో రైతులు నువ్వుగొప్పులలో నిమగ్నమై ఉన్నారు.

మూఢనమ్మకాలు నిర్మూలించాలి

శృంగవరపుకోట, జూన్ 3: మూఢనమ్మకాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత నాస్తిక్ సమాజం మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శీరాపుశ్రీనివాసరావు గురువారం రాత్రి విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఏడాది జనవరి 12న మక్కువ మండలం సిబిల్లి పెద్దవలస పంచాయితీ పరిధిలో కొత్తకాముడివలస గ్రామంలోచేతబడి నెపంతో గొల్లూరు పండు, సీతమ్మను కొట్టిచంపి మృతదేహాలను గెడ్డ ఒడ్డున దహనం చేసారని పేర్కొన్నారు. గుప్త నిధుల కోసం నరబలులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. తక్షణమే భూతవైద్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

వరి విత్తనాలు సిద్ధం

కొత్తవలస, జూన్ 3: మండలానికి వరి విత్తనాలు వచ్చాయి. ప్రభుత్వం నుండి లైసెన్సు పొందిన మోదిమాంబ ఆగ్రో ఏజెన్సీ 17.5 టన్నుల విత్తనాలు వచ్చాయని ఏజెన్సీ యజమాని నాయుడు తెలిపారు. పది టన్నుటు స్వర్ణ, ఐదు టన్నులు 1001, 2.5టన్నులు సాంబామసూరి విత్తనాలు వచ్చాయని చెప్పారు. మరో రెండు రోజులలో మరిన్ని విత్తనాలు వస్తాయని తెలిపారు. వ్యవసాయాధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు కావలసిన విత్తనాలను సిద్ధం చేసామని వారం రోజులలో మొత్తం సరుకు ఏజెన్సీకి వస్తుందని చెప్పారు. విత్తన రేట్లు రెండు రోజులలో వెల్లడిస్తామని తెలిపారు. రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకోవాలని కోరారు.

కమ్ముకున్న మేఘాలు

విజయనగరం, జూన్ 3: రోహిణి ఎండలతో ఠారెత్తిపోతున్న విజయనగరం జిల్లా ప్రజలు శుక్రవారం వాతావరణ చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమయి కొద్దిసేపు తుంపర వర్షం కురిసింది. ఆ తరువాత వర్షం ఆగిపోయినా చల్లగాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అడపాతడపా ఉరుములు, మెరుపులతో రోజంతా వాతావరణ చల్లగా మారింది. 10రోజుల నుంచి రోహిణి ఎండలతో విజయనగరం జిల్లాప్రజలు వేసవి తాపాన్ని భరించలేక అల్లాడిపోయారు. గడచిన నాలుగురోజుల నుంచి అయితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఎండతీవ్రతతో జనాలు ఇళ్ల నుంచి ఉదయం పూటే బయటకు రావాలంటే భయపడవలసి వచ్చింది.

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

కొత్తవలస, జూన్ 3: పేదలను ఆదుకోవడానికే ప్రభుత్వం ఉందని, అందుకు అహర్నిశలు పనిచేస్తున్నామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శుక్రమారం మండలంలోని శుక్రవారం ఉత్తరాపల్లి గ్రామంలో వెన్నుముఖ వ్యాధితో బాధపడుతున్న సూదికొండ జానకి అనే బాలికకు సి ఎం రిలీవ్ ఫండ్ నుండి 1.5లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆచెక్‌ను జానకికి అందజేసారు. రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు తెచ్చిన ఎమ్మెల్యే లలితకుమారేనని కోళ్ల శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గా ఉమేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

నవనిర్మాణ దీక్షకు స్పందన నిల్

విజయనగరం, జూన్ 3: రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్ష కార్యక్రమం పూర్తిగా విఫలమైందని, ప్రజలు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపడంలేదని వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, యడ్ల రమణమూర్తి, గౌరీశంకర్, అవనాపువిజయ్ చెప్పారు. శుక్రవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా నవనిర్మాణ దీక్షల విషయంలో ప్రజల నుంచి స్పందన కొరవడిందని చెప్పారు.

పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ పల్స్ సర్వే

విజయనగరం, జూన్ 3: జిల్లాల్లో ఆర్థిక, సామాజిక గణన వివరాలు సేకరించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించాలని నిర్ణయించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచి రెండు పట్టణాలు, రెండుగ్రామాలను ఎన్యుమరేషన్ బ్లాకులుగా ఎంపికచేసి ఆర్థిక, సామాజిక గణన వివరాలు సేకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు.

భక్తిశ్రద్ధలతో ‘శ్రీచక్ర పూజలు’

విజయనగరం(పూల్‌బాగ్),జూన్ 3: ఉత్తరాంధ్రప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేషపూజలు నిర్వహించారు. రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడిలో శ్రీచక్రపూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. వేదపండితులు శంభర శంకరం ఆధ్వర్యంలో ఈ పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా వేకువజామున అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమపూజలను అభిషేక, అర్చనలను జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజా పర్యవేక్షణలో పూజాకార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీచక్రపూజల్లోపాల్గొని పూజలు జరిపారు.

Pages