S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి నియోజకవర్గానికి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

శామీర్‌పేట, జూన్ 3: ప్రతి నియోజకవర్గానికి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కొల్తూరు, తుర్కపల్లి గ్రామ శివారులోని జీనోమ్ వ్యాలీ పరిసర ప్రాంతంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాన్ని నాయిని నర్సింహ్మరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల జరిగే నష్టం అంచనా వేయలేమని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

‘బడి బాట’ పట్టాలి!

హైదరాబాద్, జూన్ 3: చదువుకునే ఈడొచ్చినా..బడి బయటున్న పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించేలా తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖకు చెందిన అధికారులు కూడా చిత్తశుద్ధితో కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ‘బడి బాట’ కార్యక్రమంలో సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 13 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభ కానున్నందున, ఈనెల 12వ తేదీలోపు అన్ని హబిటేషన్స్ విస్త్రృతంగా పర్యటించి బడి ఈడున్న పిల్లలందర్నీ తప్పకుండా బడిలో చేర్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

చేప ప్రసాదం పంపిణీపై సమీక్ష

హైదరాబాద్, జూన్ 3: మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిని సోదరులు ఉచితంగా అందజేసే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ ఉదయం నుంచి తొమ్మిదో తేదీ సాయంత్రం వరకు పంపిణీ చేయనున్న చేప ప్రసాదం కార్యక్రమానికి సంబంధించి వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

గాలి..వాన

హైదరాబాద్, జూన్ 3: మహానగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం మరోసారి బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షానికి బలమైన గాలులు కూడా తోడుకావటంతో మరో సారి నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు.

బల్దియాకు 100 డేస్ ‘ప్లాన్’ భయం

హైదరాబాద్, జూన్ 3: మహానగర పాలక సంస్థ నుంచి జంటనగరవాసులకు మెరుగైన సేవలందించేందుకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు రూపకల్పన చేసిన వందరోజుల యాక్షన్ ప్లాన్ కింద చేపట్టాల్సిన పనులపై ప్రస్తుతం జిహెచ్‌ఎంసి అధికారులు హడావుడి చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు మరో మూడు,నాలుగు రోజుల్లో నగరానికి చేరుకోనున్నారు.

‘హూ కిల్డ్ స్వామి లక్ష్మానంద’ పుస్తకావిష్కరణ

చార్మినార్, జూన్ 3: హూకిల్డ్ స్వామి లక్ష్మానంద పుస్తకావిష్కరణను ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరగోపాల్ మాట్లాడుతూ ఒడిసాలో 2008లో కంధమల్‌లో స్వామి లక్ష్మానంద హత్య జరిగిన తరువాత క్రిస్టియన్లపై ప్రతికారదాడులు జరిగాయని అన్నారు. ఈ హత్యాకాండలో వందలమంది క్రిస్టియన్లు బలైపోయారని అన్నారు. ఈ నేపథ్యంలో తానే ఆల్‌లైన్ పిటిషన్ వేసి ఖైదీల విడుదల కోసం ప్రయత్నం చేశానని గుర్తుచేశారు. ఈ సమావేశంలో రచయిత ఆంటోఅక్కర మాట్లాడుతూ కంధమల్‌లో క్రిస్టియన్లపై దాడులు, మహిళలు, చర్చిలపై దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.

ఎస్‌ఆర్‌డిపికి గ్రహణం

హైదరాబాద్, జూన్ 3: జంటనగరవాసులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన విభాగాధిపతులకు తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) ప్రాజెక్టు పనులకు ఆదిలోనే అనేక రకాలుగా అడ్డంకులేర్పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఈ నెల మొదటి వారంలోనే కెబిఆర్ పార్కు మల్టీలేవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు పనులను చేజిక్కించుకున్న సంస్థలు సిద్ధంగా ఉన్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి.

పత్తి వేయాలా? వద్దా?

వికారాబాద్, జూన్ 3: ఈ ఏడాది రైతులు పత్తి పంట సాగును తగ్గించాలని ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ప్రభుత్వం కోరుతుండగా, పత్తి విత్తనాలు కంపెనీలు రైతులను సందిగ్ధంలో పడేసే విధంగా పత్తిపంట సాగుచేస్తేనే లాభాలు అంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇటు ప్రభుత్వం, అటు పత్తి విత్తన కంపెనీల ప్రచారంతో రైతులు సందిగ్ధంలో పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, పత్తి పంట సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్న తరుణంలో ప్రభుత్వం రైతుల మేలును కోరి ఈసారి పత్తి పంట సాగు చేయరాదని ప్రత్యామ్నాయంగా సోయాబీన్, పప్పుదినుసుల పంటలు సాగు చేయాలని అవగాహన కల్పించింది.

ప్రతి పాఠశాలలో 5 శాతం ఎన్‌రోల్‌మెంట్ తప్పనిసరి: కడియం

శామీర్‌పేట, జూన్ 3: మానవ వనరుల అభివృద్ధి శీర్షికలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచే దిశలో ప్రతి పాఠశాలలో 5 శాతం ఎన్‌రోల్‌మెంట్ తప్పనిసరి చేసే విధంగా జిల్లా కల్టెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌తో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలతో బడిబాట కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ముదురుతున్న జిల్లాల పంచాయతీ

మహబూబ్‌నగర్, జూన్ 3: ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అంకురార్పణ చేస్తానని అధికారికంగా ప్రకటన చేయడంతో అప్పటి నుండి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త జిల్లాల పంచాయతీ మొదలైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానంలో, జిల్లా మంత్రులు, అదికారయంత్రాంగం సైతం వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలను కొత్త జిల్లాలుగా చేయాలని యోచిస్తూ ఇటివల ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.

Pages