S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం

ఎచ్చెర్ల/ఆమదాలవలస/జలుమూరు, జూన్ 3: రోహిణి కార్తెలు కారణంగా భానుడు భగభగలాడటంతో సిక్కోలు వాసులు నిన్నటివరకు విలవిలలాడిపోయారు. అయితే, శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జిల్లా అంతటా కురిసింది. లావేరు మండలంలో 68.2 మి.మీ ల వర్షం కురిసి అత్యధికంగా నమోదైంది. అలాగే ఇచ్ఛాపురంలో 66.8, అమదాలవలసలో 57.0, శ్రీకాకుళం 56.4, సరుబుజ్జిలి 53.8, కవిటి 50.4, మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 7గంటల నుంచి 10గంటల వరకు ఎడతెరిపిలేని వర్షంకురవడంతో జిల్లాలో 1093.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

వనరుల సద్వినియోగంతోనే అభివృద్ధి

నరసన్నపేట, జూన్ 3: జిల్లాలోగల వనరులను రాబోయే మూడేళ్లలో పూర్తిగా సద్వినియోగం చేసి అభివృద్ధి పథంలో జిల్లాను నడిపిస్తామని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏక పక్షంగా, అశాస్ర్తియంగా విభజన జరిగిన చర్చా కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జిల్లా వెనుకబడి ఉందన్నారు. ఎల్‌ఎన్ పేట మండలం చివరిస్థానంగా ఉండన్నారు. గతంలో జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించకపోవడమే ఈ పరిస్థితి ఉందన్నారు. కొవ్వాడ, భావనపాడు ప్రాజెక్టులు వస్తున్నాయని, జూన్ 2017 నాటికి వంశధార రెండో దశ పనులు పూర్తిఅవుతాయన్నారు.

చెక్‌పోస్టుపై ఎసిబి దాడి

ఇచ్ఛాపురం, జూన్ 3: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై ఎసిబి అధికారులు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో దాడి చేశారు. అయిదుగురు దళారులను పట్టుకుని వారి నుంచి 27,292 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కౌంటర్‌లో 210 రూపాయలు, వాణిజ్య పన్నుల శాఖ కౌంటర్‌లో 18,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దాడి అనంతరం ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు విలేఖర్లతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న దాడుల్లో భాగంగా ఈ చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

శ్రీకాకుళం, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా ఈ ఏడాదిలో మూడు రకాల ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు మెప్మా మిషన్ డైరెక్టర్ పి.చినతాతయ్య పేర్కొన్నారు. శుక్రవారం జెడ్‌పి సమావేశ మందిరంలో ఆరు పురపాలక ప్రాంతాలకు చెందిన బిఎం సీలు, ఏడిఎంసీలు, ఇపివోలు, సీవోలు, రిసోర్స్ పర్సన్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మహిళా సాధికారతలో భాగంగా ఆదాయ మార్గాలు పెంచడం, ఆరోగ్యంపై తగిన శిక్షణ ఇవ్వడం, మహిళల జీవనానికి భద్రత కల్పించడం వంటి కార్యక్రమాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

కొనసాగుతున్న ఆసెట్ కౌనె్సలింగ్

శ్రీకాకుళం(రూరల్), జూన్ 3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ, గాయిత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆసెట్ కౌనె్సలింగ్ మూడో రోజు కొనసాగింది. 413మంది విద్యార్థులు హాజరై వెబ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ కౌన్సిలింగ్‌కు ప్రాంతీయ కేంద్ర సమన్వయ అధికారి, ప్రిన్సిపల్ పులఖండం శ్రీనివాసరావు, కోర్సు కో ఆర్డినేటర్ హనుమంతుభాస్కర్ , కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ అప్పలనాయుడు, సమన్వయ కర్త శ్రీనివాసబాబు తదితరులు కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.

సర్వీస్ ప్రొవైడర్లకు ఆహ్వానం:జెసి

శ్రీకాకుళం(రూరల్), జూన్ 3: జాతీయ జనాభా రిజిష్టర్ డేటా ఎంట్రీ కోసం ఆసక్తికలిగిన సర్వీస్ ప్రొవైడర్లనుంచి కొటేషన్లను ఆహ్వానిస్తున్నామని జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 90 రోజులలో 26లక్షల రికార్డులను నమోదు చేయాలన్నారు. ప్రతీ ఎంట్రీకి రూ.4 చెల్లిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డేటా ఎంట్రీలో పూర్వఅనుభవం ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు తమ కొటేషన్లను జూన్ 7న మధ్యాహ్నం 3గంటలలోగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో సమర్పించవచ్చునన్నారు. సందేహాలకు పర్యవేక్షకులు, సీ సెక్షన్, కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళంలో సంప్రదించవచ్చునన్నారు.

నేడు ఇన్‌చార్జి మంత్రి రాక

శ్రీకాకుళం(రూరల్), జూన్ 3: జిల్లా ఇంచార్జ్ మంత్రి పరిటాల సునీత జిల్లాలో రెండు రోజుల పర్యటనకు రానున్నారు. ఈమేరకు శుక్రవారం ఆమె క్యాంపు కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల అయింది. 4న ఉదయం 10గంటలకు శ్రీకాకుళం చేరుకొని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి శ్రీకాకుళంలో బస చేస్తారని, 5న ఉదయం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పాలకొండకు బయలుదేరి వెళ్తారని చెప్పారు. అదే రోజు సాయంత్రం 5గంటలు పాలకొండలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారని ఆ ప్రకటనలో వివరించారు.

చెప్పులు విసరమనడం జగన్‌కు కొత్తేమీ కాదు

శ్రీకాకుళం(టౌన్), జూన్ 3: అభివృద్ధి కారకులపై చెప్పులు విసరమనడం జగన్మోహనరెడ్డికి కొత్తేమీ కాదని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఈ మేరకు ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

హైర్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది పర్యవేక్షణ ఉండాల్సిందే

శ్రీకాకుళం(టౌన్), జూన్ 3: రాష్టవ్య్రాప్తంగా ఉన్న అద్దెబస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది పర్యవేక్షణతో నిమిత్తం లేకుండా ప్రైవేట్ వారిపై ఆధారపడటం ద్వారా జవాబుదారీ తనం లేకుండా పోతుందని ఎపిఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ ఆర్.వి.ఇ.ఎస్.డి.ప్రసాదరావు హెచ్చరించారు. శుక్రవారం ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైర్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వలన ఆదాయం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని, అక్రమ రవాణాకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో సంస్థ ప్రతిష్ఠ పాడైపోతుందన్నారు.

వాస్తవాలు వక్రీకరిస్తున్న జగన్: విప్

పొందూరు, జూన్ 3: నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, దేశంలోనే ఆంధ్రాను ఆదర్శరాష్ట్రంగా నిలపాలన్న తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందిస్తుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించడం విచారకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. ఆయన పొందూరులో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి వైసిపిని స్థాపించి ఆచరణ బద్దంకానిహామీలతో అమలు పరచలేని వాగ్దానాలతో పార్టీనాయకులను నిరంతరం మభ్యపరుస్తుండటంతో విసుగుచెందిన పార్టీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడంవాస్తవం కాదా అని ప్రశ్నించారు.

Pages