S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడుగుపడి యువకుడి మృతి

ఆమదాలవలస, జూన్ 3: మండలంలోగల పెద్దజొన్నవలస గ్రామంలో శుక్రవారం కోట రాజబాబు(18) అనే యువకుడిపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం గ్రామంలో అనారోగ్యంతో 90 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందడంతో దహన సంస్కరణలో పాల్గొన్న రాజబాబు కోనాం చెరువులో స్నానం చేసి తిరిగి ఇంటికివస్తుండగా మార్గం మధ్యలో పిడుగుపాటుకు గురయ్యాడు. స్థానికులు ఈ సంఘటన చూసిన వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ రాజబాబు మృతిచెందినట్టు వైద్యాధికారులు తెలిపారు. మృతుడు తల్లిదండ్రులు రమణ, భారతిలు వలస కూలీలు కావడంతో చెన్నైలో ఉంటున్నారు. మృతుడు, తన తమ్ముడు గ్రామంలో ఉంటున్నారు.

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, జూన్ 3: రానున్న కృష్ణా పుష్కరాలకు విశాఖ నుంచి తగినన్ని రైళ్ళు నిర్వహించాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ నిర్ణయించింది. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల మాదిరి ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి 12 రోజులపాటు జరగనున్న కృష్ణా పుష్కరాలకు కాస్తంత ముందుగానే భక్తులకు రైళ్ల సదుపాయం కల్పించాలని డివిజన్ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాయగడ తదితర ప్రాంతాల నుంచి కృష్ణా పుష్కరాలకు వెళ్ళాలంటే విశాఖ మీదుగా నడిచే రైళ్ళపైనే ఆధారపడాలి.

రాష్ట్భ్రావృద్ధే ధ్యేయం

విశాఖపట్నం, జూన్ 3: రాష్ట్భ్రావృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగుతోందని, విభజన కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగుతామని బిసి సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఎయు ప్లాటినం జూబ్లీహాలులో ‘అశాస్ర్తియ, ఏకపక్షంగా రాష్ట్ర విభజన-ప్రభావం’ అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన సందర్భంగా రాష్ట్రానికి దక్కాల్సిన స్థిర,చరాస్తుల పంపకంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

జివిఎంసి ముట్టడి

జగదాంబ, జూన్ 3: ప్రభుత్వం ఇచ్చిన జీవో 279ని రద్దు చేయాలని కోరుతూ మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు జివిఎంసి కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు జి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఈ జీవోనిచ్చి పారిశుద్ధ్య కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తోందన్నారు.

రాష్ట్భ్రావృద్ధికి ఉద్యోగులు కసితో పని చేయాలి

విశాఖపట్నం, జూన్ 3: ఆంధ్ర రాష్ట్భ్రావృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు కసితో పని చేయాలని విశాఖపట్నం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎయు ప్లాటినం జూబ్లీ సెనేట్ హాలులో ‘అశాస్ర్తియ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం, తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు కడుతున్నందున రాష్ట్రంలో రైతులు పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

లావణ్య మృతిపై లోతైన దర్యాప్తు జరగాలి

విశాఖపట్నం, జూన్ 3: ఇటీవల అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లావణ్య మృతిపై పోలీసులు మరింత లోతైన విచారణ జరిపించాలని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అతిథిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సంఘటనపై పోలీసులు నిష్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. అలాగే ఇప్పటి వరకూ పోలీసులు జరిపిన విచారణపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివరాలు వెల్లడించాలన్నారు. ఒక మహిళగా లావణ్య మృతిపై తాను స్పందించానని ఆమె పేర్కొన్నారు.

లక్ష్మీపురం భూములపై ల్యాండ్ మాఫియా కన్ను

విశాఖపట్నం, జూన్ 3: వారసులు ఎవరో తెలీని భూమికి నకిలీ వారసులు పుట్టుకొచ్చేశారు. రూ. 75 కోట్ల విలువైన భూములు కాజేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. విశాఖ నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న భూ దందాకు ఇదే నిదర్శనం. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌పై భూకబ్జా కేసుతో పలు ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ నగర పరిధిలో అత్యంత విలువైన భూమికి సంబంధించి కొంతకాలంగా జరుగుతున్న తంతు మాజీ ఎమ్మెల్యేపై కేసుతో బయటపడింది. పెందుర్తి మండలం లక్ష్మీపురం గ్రామం సర్వే నెంబర్ 81/1లో 11.63 ఎకరాల భూమి తిరుమలరాజు నారాయణ మూర్తి పేరిట రికార్డుల్లో నమోదై ఉంది.

అంతా ఆర్భాటమే..

విజయనగరం, జూన్ 3: రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా విభజన తరువాత ఏర్పడిన ఇబ్బందులపై జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన చర్చాగోష్ఠులకు ప్రజలనుంచి స్పందన లేకుండా పోయింది. జిల్లాకేంద్రంలో ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో నిర్వహించిన చర్చాగోష్ఠికి ఎమ్మెల్యే మీసాల గీత, కొందరు అధికారులు, కొందరు టిడిపి నాయకులు, అరకొర ప్రజలు మాత్రమే హాజరవగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో జరిగిన చర్చా గోష్ఠులలో మొక్కుబడి హాజరు మాత్రమే కనిపించింది.

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ధ్యేయం

గరివిడి, జూన్ 3: ఆంధ్ర ప్రదేశ్‌ను శరవేగంగా అభివృద్ధి చేసి అగ్రగామి రాష్ట్రంగా నిలపడమే నవనిర్మాణ దీక్ష ధ్యేయమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. ఆర్‌డి ఓ శ్రీనివాసమూర్తి అధ్యక్షతన చీపురుపల్లిలో శుక్రవారం సాయంత్రం నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజలకు తీరని అన్యాయం చేసినా, ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును ఎన్నుకున్నారని అన్నారు.

జిల్లాలో మావోల కదలికలు తగ్గుముఖం

మక్కువ, జూన్ 3: జిల్లాలో మావోల కదలికలు తగ్గుముఖంపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎల్. కాళిదాసు వెంకట రంగారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మక్కువ పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు స్టేషన్ పరిసరాలు, సిఆర్‌పిఎఫ్ పరిసర ప్రాంతాలు పరిశీలించి అనంతరం స్టేషన్‌లో క్రైం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆత్మీయ నేస్తం అనే బాక్సును ప్రతీ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు.

Pages