S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి రాజకీయ పార్టీ కాదు..పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ

కర్నూలు సిటీ, జూన్ 3 : ఎన్‌టిఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా పేరు మార్చారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కర్నూలు నగరంలో శుక్రవారం జిల్లా పరిషత్ నుంచి చేపట్టిన ‘గడప గడపకూ సిపిఐ’ కార్యక్రమంలో రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. టిడిపి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి సిఎం చంద్రబాబు సిఇఓ అయితే ఎండిగా సుజనాచౌదరి, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌గా టిజి.వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ సేల్స్‌మెన్‌గా నారాయణ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(పిఆర్‌ఓ)గా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

జగన్‌పై సుమోటో కేసు పెట్టాలి

ఆదోనిటౌన్, జూన్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రజాస్వామ్య విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసు పెట్టి వెంటనే అరెస్టుచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ లింగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదని, కేవలం రాజకీయ జ్ఞానం లేకుండా అజ్ఞానిగా ఉన్న జగన్ మతిస్థిమితం కోల్పోయి సిఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. నేర స్వభావం కలిగి ఉన్న జగన్ ఒక అహంకారి అని అన్నారు.

రూ. 55కోట్లతో మూడు క్లస్టర్ విశ్వవిద్యాలయాలు

కర్నూలు, జూన్ 3:నగరంలోని కెవిఆర్, సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రూ. 55కోట్లతో మూడు క్లస్టర్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. నగరంలో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో రూసా నిధులతో ఏర్పాటు చేసే క్లస్టర్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి వీలవుతుందని తెలిపారు. జిల్లాలో ఏ కళాశాలలోనైనా ర్యాగింగ్ జరిగితే విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు.

మోదీ పాలనలో అభివృద్ధి దిశగా భారత్

జఆత్మకూరు, జూన్ 3:మోదీ పాలనలో దేశం బాగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాణి పేర్కొన్నారు. పట్టణ శివారులో నిర్మించిన ఆదర్శ డిగ్రీ కళాశాలను శుక్రవారం ఢిల్లీలోని శాస్ర్తీ భవన్ నుంచి మంత్రి స్మృతి ఇరాణి డిజిటల్ లాంచ్ ద్వారా ప్రారంభించారు. ఆత్మకూరుతో పాటు మహబుబ్‌నగర్, కాశ్మీర్, ఛత్తీస్‌ఘడ్, అమృత్‌సర్, సిక్కింలలో నిర్మించిన ఆదర్శ డిగ్రీ కళాశాలలను ఆమె డిజిటల్ లాంచ్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆమె డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తితో డిజిటల్ వీడియో ద్వారా మాట్లాడారు. అలాగే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఏపిపై చిన్నచూపు తగదు

ఆత్మకూరు, జూన్ 3:నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నారన్న అనుమానం కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆత్మకూరులో ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెఇ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు కెఇకి పూర్ణకుంభంతో స్వాగతం పలిపారు. ఆ తరువాత కెఇ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కెఇ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీసిన తరువాత నవ్యంధ్రప్రదేశ్ చాలా సమస్యలు ఎదుర్కొంటుందని, అయితే కేంద్రం తగిన విధంగా స్పందంచలేదన్న అనుమానం వ్యక్తం చేశారు.

ముంపు బాధితులకు ఉద్యోగాలివ్వాలి

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 3:శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురైన బాధితులకు జీఓ నెం 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు అవుట్‌సోర్సిరింగ్ లష్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ఎస్ కూడలిలోని జలమండలి కార్యాలయంలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ చిట్టిబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మల్లయ్య, మోక్షమయ్య మాట్లాడుతూ శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. 30 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ. 200 కోట్లతో నగరాభివృద్ధి

కర్నూలు సిటీ, జూన్ 3:కర్నూలు నగరం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, రూ. 200 కోట్లతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఎస్వీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఎమ్మెల్యే ఎస్వీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో కొత్త ఈద్గా అభివృద్ధికి రూ. 35లక్షలు, పాత ఈద్గాలోని మసీదుపై ఒక ఫ్లోర్ నిర్మాణానికి రూ. 35లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హజ్ హౌస్ నిర్మాణం కోసం రూ. 3కోట్లు కేటాయించిందని, ఆ నిధులతో రంజాన్ మాసంలో ముస్లింలకు రంజాన్ తోఫా కింద రూ.

దేశం గర్వించేలా అమరావతి నిర్మాణం

నందికొట్కూరు, జూన్ 3:ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవంతో దేశం గర్వించే స్థాయిలో నూతన రాజధాని అమరావతిని నిర్మిం చి తీరుతారని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తెలిపారు. పట్టణంలోని జైకిసాన్ పార్కులో శుక్రవారం చేపట్టిన నవనిర్మాణ దీక్షలో రాజశేఖర్ మాట్లాడారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు పుట్టగతులు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజాసంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందన్నారు.

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

క్రిష్ణగిరి, జూన్ 3:మండల పరిధిలోని ఎరుకలచెరువు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్డే మధు(16) మృతిచెందాడు. దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన మధు, ధనుంజయ, నాయుడు ముగ్గురూ స్నేహితులు. వారు క్రిష్ణగిరిలో జరుగుతున్న క్రికెట్ పోటీలను చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. అయితే వారు ఆగవేలి గ్రామం దాటిన తర్వాత ఒక మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. ఈ సంఘటనలో మధు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నాన్నకు ప్రేమతో..

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్దదిక్కుగా పేరున్న దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు ప్రజల మధ్య ఉన్న కాలంలో ఇచ్ఛాపురం నుంచి అనకాపల్లి వరకూ జాతీయ రహదారి పక్కన ఏ బస్‌షెల్టర్ చూసినా కింజరాపు ఎర్రన్నాయుడు బస్‌స్టాప్‌లే.. అన్నీ ఆయన స్వతహాగా ప్రయాణికులకు కోసం నిర్మించినవే... ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన హఠాన్మరణం తర్వాత ఎర్రన్న పేరుతో నిమ్మాడ నుంచి న్యూఢిల్లీ వరకూ పలు ప్రాజెక్టులు, పథకాలు, ప్రైవేటు సంస్థలు ప్రేమతో... ఆయనకు నాలుగేళ్ళుగా ఘన నివాళులు అర్పించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే ఎన్.జి.రంగా, గౌతు లచ్చన్నల చరిత్ర వెంటనే గుర్తుకువస్తుంది!

Pages