S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకనకదుర్గమ్మకు హారం బహూకరణ

ఇంద్రకీలాద్రి, జూన్ 3: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మండ నాయికి శ్రీకనకదుర్గమ్మకు శుక్రవారం ఒక భక్తురాలు సుమారు 3లక్షల, 26వేలు విలువ చేసే ఒక హారాన్ని సమర్పించారు. అమ్మవారికి ఉన్న ఆభరణాల జాబితాలోనికి శుక్రవారం ఈహారం కొత్తగా వచ్చి చేరింది. హైదరాబాద్‌కు చెందిన కె పద్మవతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవటానికి కుటుంబ సమేతంగా వచ్చారు. అమ్మవారి దర్శనం తర్వాత ఈహారాన్ని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడికి అందచేసారు.

కట్టుబట్టలతో వచ్చాం..

పాయకాపురం, జూన్ 3: రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో హైదరాబాదు నుండి ఆంధ్రా వాళ్లు రావాల్సి వచ్చిందనీ, ప్రస్తుతం అభివృద్ధే లక్ష్యంగా దేశంలోని అన్ని రాష్ట్రాలను తలదనే్న విధంగా ఆంధ్రప్రదేశ్‌ను ముందుంచాలని ముఖ్యమంత్రి ఎంతో శ్రమిస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక 55వ డివిజన్ నందమూరి నగర్‌లో రూ.3కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించిన 1000 కెఎల్ కెపాసిటీ మంచినీటి రిజర్వాయర్‌ను ఎంపి కేశినేని శుక్రవారం ఉదయం ప్రారంభించారు.

జక్కంపూడి కాలనీలో తీవ్ర ఉద్రిక్తత

ఇంద్రకీలాద్రి, జూన్ 3: జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని పండిత్ నెహ్రూ బస్టాండ్ వద్ద గల రాజీవ్‌గాంధీ పూల మార్కెట్ పక్కన 5నెలల క్రితం ఇళ్లు కాలిపోగా ఆ సమయంలో అక్కడ దాదాపు 400మంది నిర్వాసితులకు అధికారులు జక్కంపూడి కాలనీలో ఇళ్లు కేటాయించారు. స్లిప్పులపై నెంబర్లు వేసి మరీ ఆయా ప్లాట్‌లోనే ఉండాలన్నారు. అయితే శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో పెద్దసంఖ్యలో పోలీసు బలగాలతో కాలనీలోకి చేరుకున్న విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ఆ రోజున ఇళ్లు కేటాయించిన వారిలో 292 మంది బోగస్ అని తేలిందని, వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని కోరారు.

ప్రయాణికులకు వినోదాల విందే

పాతబస్తీ, జూన్ 3: ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తుందని ప్రయాణికులు ఏ విషయంలోనూ అసౌకర్యానికి గురి కారాదనే ధ్యేయంతో తాము రాజీలేని నిర్ణయాలు తీసుకున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ సాంబశివరావు అన్నారు. ఆర్టీసీలో ఇటీవల వచ్చిన విప్లవాత్మక మార్పుల గూర్చి ఈ విలేఖరి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన శుక్రవారం సమాధానంగా తమ అభివృద్ధి గూర్చి వివరించారు. రూ.10 కోట్ల వ్యయంతో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కార్పొరేట్ కార్యాలయాలను జూన్ 6న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.

జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

ఇంద్రకీలాద్రి, జూన్ 3: వైయస్ జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నంలో 8వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

అమరావతికి వచ్చి తీరాల్సిందే

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 3: అన్యాయంగా రాష్ట్రాన్ని అరగంటలో తలుపులు మూసి విభజించటం జరిగిందని, విభజనను మనం కోరుకోకపోయినప్పటికీ అనివార్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఏ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన అశాస్ర్తియ విభజన రాష్ట్రంపై దాని ప్రభావం, విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చిందని, వాటిని కసిగా తీసుకుని పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

వేలాడుతున్న తీగలను వెంటనే తొలగించండి

హైదరాబాద్, జూన్ 3: మహానగరంలో విద్యుత్ స్తంభాలపై, బహిరంగ ప్రదేశాల్లో వేలాడుతూ ప్రజల పాలిట ప్రాణంతకంగా మారిన కేబుళ్లను వెంటనే తొలగించాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల నగరంలో స్తంభించిన పెనుగాలుల వల్ల భారీ స్థాయిలో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవటం, కూలటం వల్ల వాటికి ఉన్న కేబుల్ వైర్ల తొలగింపులో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో శుక్రవారం నాడు కేబుల్ కంపెనీల ప్రతినిధులతో మేయర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

స్ట్రీట్ వెండర్స్ వివరాలను నమోదు చేసుకోవాలి

జీడిమెట్ల, జూన్ 3: తోపుడు బండ్ల వ్యాపారస్థులు వివరాలను నమోదు చేసుకోవాలని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఇన్‌చార్జి ఉపకమిషనర్ మమత అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో స్ట్రీట్ వెండర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మమత మాట్లాడుతూ వెండింగ్ జోన్స్ ఏర్పాటు కొరకు సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఈ సర్వేలో తోపుడు బండ్ల వ్యాపారస్థులంతా వివరాలను నమోదు చేసుకుని సహకరించాలని కోరారు.

డి.పోచంపల్లి సమస్యలను పరిష్కరిస్తా

జీడిమెట్ల, జూన్ 3: దొమ్మరపోచంపల్లి సమస్యలను పరిష్కరిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ గ్రామంలో వివేక్ నివాసంలో గ్రామ సర్పంచ్ రాముగౌడ్, వార్డు సభ్యులు కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. రాముగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. మురుగునీటి ప్రవాహంతో రోగాల బారిన ప్రజలు పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేస్తానని అన్నారు.

‘త్రి శక్తం’ గ్రంథావిష్కరణ

కాచిగూడ, జూన్ 3: ప్రముఖ కవి డా.వడ్డేపల్లి కృష్ణ రచించిన ‘త్రి శక్తం’ గ్రంథావిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి.రమణచారి పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతాసారాంశం సంక్షిప్తంగా సామాన్యులను అర్థమయ్యే విధంగా వడ్డేపల్లి కృష్ణ ఎంతో గొప్పగా రచించారని పేర్కోన్నారు. డా.చంద్రారెడ్డి ఆంగ్ల రచనకు తెలుగుఅనువాదం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. భారతీయ సంస్కృతిలో పవిత్రమైన గ్రంథం గీతాసారాంశం అని అన్నారు.

Pages