S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్ర నిర్మాణానికి కంకణబద్ధులు కావాలి

తెనాలి, జూన్ 3: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని తమవంతుగా సహకారం అందించాలని తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ సూచించారు. శుక్రవారం నవనిర్మాణ దీక్ష రెండవ రోజున మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలను ఓర్చి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలిజెప్పాలనే సంకల్పంతో నిరంతరంగా అభివృద్ధి కోసం పటుపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడుకు ప్రజలు తమ పూర్తి సహకారం అందించాలని విఙ్ఞప్తి చేశారు. అటువంటి ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకులు అసభ్యపదజాలంతో ప్రజలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

అభివృద్ధికి కలిసి కృషి చేయండి

ఖమ్మం, జూన్ 3: జిల్లాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి కృషి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాకు చెందిన మధిర జడ్పీటిసితో పాటు ముగ్గురు ఎంపిపిలు, పలువురు సర్పంచ్‌లు, ఇతర పార్టీలకు చెందిన ప్రధాన నేతలు కెసిఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అభివృద్ధికి సహకరిస్తామన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన పాలేరు ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని, దానిని భవిష్యత్తు ఎన్నికలకు మార్గదర్శకంగా ఉండేలా చూడాలని అన్నారు.

చినుకు పడుతున్నా చేరని విత్తనాలు

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 3: ప్రతి సంవత్సరం మాదిరిగానే జిల్లాలో రైతులకు ఈ సంవత్సరం కూడా విత్తనాలు తలనొప్పులు తేనున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు జిల్లా సాధార విస్తీర్ణ సాగు అంచనా వేసి లెక్కలు కట్టి ప్రభుత్వానికి విత్తన అవసర నివేదికలు పంపించింది. కాని నేటికి జిల్లాకు పూర్తి స్థాయిలో విత్తనాలు చేరలేదు. పచ్చిరొట్ట విత్తనాలు 10వేల క్వింటాళ్ళ మేర జిల్లాకు అవసరం ఉన్నా వచ్చింది మాత్రం 5 వేల క్వింటాళ్ళు మాత్రమే. పత్తికి ప్రత్యామ్నాయ పంటగా భావిస్తున్న సోయాబీన్ విత్తనాలు కేజి కూడా జిల్లాకు చేరలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తెరపైకి ‘అంబేద్కర్ ఆదివాసీ జిల్లా’

భద్రాచలం టౌన్, జూన్ 3: ప్రత్యేక జిల్లా ఉద్యమాలతో ఎగిసిపడుతున్న భద్రాద్రిలో మరో నూతన పోరు మొదలైంది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలంను కేంద్రంగా ఉంచి జిల్లా ఏర్పాటు చేయాలని అటు గిరిజనులు.. భద్రాచలం కేంద్రంగానే ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని ఇటు ఆదివాసీలు ఉద్యమం చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వీటికి భిన్నంగా ఆదివాసీ సంఘాలు భద్రాచలం కేంద్రంగా ‘అంబేద్కర్ ఆదివాసీ జిల్లా’ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని, ఈ క్రమంలో అంబేద్కర్‌ను గుర్తిస్తూ భద్రాచలం కేంద్రంగా అంబేద్కర్ ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని వారు నూతన గళం వినిపించడం విశేషం.

ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలి

ఖానాపురం హవేలి, జూన్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కెజి తరగతులు, సమాంతరంగా ఇంగ్లీష్ మీడియాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న విధంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించాలన్నారు. తక్షణమే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, గుణాత్మక విద్యను విద్యార్థులకు అందించాలన్నారు.

స్మార్ట్‌సిటీకి అర్హత సాధిస్తాం

ఖమ్మం(ఖిల్లా), జూన్ 3: కేంద్రం ప్రకటిస్తున్న స్మార్ట్‌సిటిల జాబితాలో ఖమ్మం నగరం చేరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని ఖమ్మం మేయర్ పాపాలాల్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్‌ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వం అవార్డు నివ్వడం తమకు మరింత బాధ్యత పెంచిందని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి, కూడళ్ళు, డివైడర్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తి చేశామని, వచ్చే ఏడాది ఆవిర్భావ దినోత్సవాల నాటికి ప్రతి ఇంటికి నల్లా, మరుగుదొడ్డి ఉండేలా చూసి ఓడిఎఫ్ నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

అశృనయనాల మధ్య సంగం అంత్యక్రియలు

ఖమ్మం రూరల్, జూన్ 3: మండలంలోని గూడూరుపాడు గ్రామంలో టిఆర్‌ఎస్, సిపిఐ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన సత్తి సంగం (60) అంత్యక్రియలు శుక్రవారం అశృనయనాల మధ్య జరిగాయి. టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి బుడాన్ బేగ్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, మండల నాయకులు మద్ది మల్లారెడ్డి, రామ్మూర్తినాయక్, జెడ్పీటిసి భారతి, బెల్లం వేణు తదితరులు సంగం భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. ఆయన ఆశయం కోసం కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం అంత్యక్రియలను ప్రశాంతంగా నిర్వహించారు.

కలెక్టర్‌ను కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే

ఖానాపురం హవేలి, జూన్ 3: కొత్తగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు శుక్రవారం కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా పాత కొత్తగూడెంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు శ్రీకారం చుట్టామన్నారు. అందుకు కావాల్సిన పాఠశాల నిర్మాణానికి నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించామన్నారు. శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.

అంధకారంలో రామదాసు ధ్యాన మందిరం

నేలకొండపల్లి, జూన్ 3: ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో వెలుగుతుంటే.. మరోపక్క ప్రముఖ వాగ్గేయకారుడు కంచర్ల గోపన్న (్భక్తరామదాసు) ధ్యాన మందిరం చిమ్మచీకట్లో మగ్గుతోంది. భద్రాచలం దేవస్థానం దత్తత తీసుకున్న నేలకొండపల్లి భక్తరామదాసు ధ్యాన మందిరంపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ భద్రాచలం దేవాలయం పాలకులు చెప్తున్న మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. గతంలో రావాల్సిన బకాయిలను నేటికి అందలేదు.

అహోబిలం దేవస్థానం ఇఓ ఇల్లు, కార్యాలయంపై దాడి

ఆళ్లగడ్డ, జూన్ 3: అహోబిలం దేవస్థానం పరిపాలనాధికారి రంగరాజు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టడంతో కిటికీలు, ప్రధానద్వారం పాక్షికంగా కాలిపోయాయి. వివిరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు దేవస్ధాన ఇఓ కార్యాలయానికి వెళ్లారు. అయితే కార్యాలయంలో ఎఓ రంగరాజు కోసం వెతికారు. చుట్టుపక్కల ప్రదేశాల్లో వెతికినప్పటికీ ఆయన కనిపించకపోవడంతో ఆవేశంతో వున్న దుండగులు, ఇఓ కార్యాలయంలో వున్న కిటికీ అద్దం పగులగొట్టి, కంప్యూటర్, ప్రింటర్, ఫైల్స్ కింద పడవేశారు.

Pages