S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్య వివాహానికి బ్రేక్

ఏటూరునాగారం, జూన్ 2: మండల కేంద్రంలోని మానసపల్లి ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం రాత్రి వివాహాన్ని అడ్డుకున్నారు. వివరాలలోకి వెళితే...మండలంలోని మానసపల్లికి చెందిన కుమ్మరి సారయ్య కుమార్తెకు మండలంలోని బుట్టాయిగూడెంకు చెందిన జనగాం బక్కయ్య కుమారుడు ఆనంద్‌తో ఈ నెల 1న వివాహం చేసేందుకు నిశ్ఛయించి, రాత్రి 11:06నిలకు ముహూర్తం నిర్ణయించారు. కాగా మండల కేంద్రంలోని శివాలయంలో వివాహం జరుగుతోందనే సమాచారం మేరకు ఎస్సై మోతె నరేష్ సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ నిర్వహించారు.

వడదెబ్బతో ఒకరు మృతి

ములుగు, జూన్ 2: మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లికి చెందిన పసపుల పోషయ్య (78) వడదెబ్బకు గురై గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోషయ్య 12గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లి అక్కడే అస్వస్థతకు గురయ్యాడని, ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఇంటికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే మృతిచెందినట్లు గ్రామస్థులు వివరించారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆత్మకూరు, జూన్ 2: అప్పుల బాధలు తాళలేక రైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆత్మకూరు మండలంలోని దామెర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం ప్రకారం దామెర గ్రామానికి చెందిన నడిగట్టు కొమురయ్య (65) తన నాలుగెకరాల భూమిని అప్పులు చేసి సాగు చేశాడు. ఆశినంత దిగుబడి రాక అప్పులు ఇటీవల అధికం కావడంతో అవి ఎలా తీర్చాలోతోచక తీవ్ర మనస్తాపానికి గురైన కొమురయ్య గురువారం తెల్లవారుఝామున ఇంట్లో క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు. మృతుని బంధువులు గమనించి చికిత్స కోసం ఎంజి ఎంకు తరలిస్తుండగా కొమురయ్య మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య లక్ష్మి ఉంది.

దళితులను నమ్మించి దగా చేసిన కెసిఆర్

వరంగల్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని గురువారం హన్మకొండలో ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10 గంటలకే అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. అంతకుముందే పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, నిరసన చేసుకునేందుకు వారికి ఉదయం 11:30 గంటలకు అనుమతి దొరికింది. దీంతో సరిగ్గా 11:30గంటలకు మందకృష్ణ మాదిగ అక్కడకు చేరుకొని వారి కార్యకర్తలతో కలిసి విగ్రహం వద్దకు నిరసన ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

ఉద్యమ ద్రోహులకు అందలం..ఉద్యమకారులకు అవమానం

వరంగల్, జూన్ 2: తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా పని చేసిన వారినే ముఖ్యమంత్రి కెసిఆర్ అందలమెక్కిస్తూ ఉద్యమకారులను అవమాన పరుస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యతిరేకులు ఉద్యమకాలంలో రాళ్లు, తుపాకులతో దాడులు చేసి నేడు ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారన్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన టిడిపి, వైఎస్సార్‌సిపిల నుండి వచ్చిన వారిని ముఖ్యమంత్రి కెసిఆర్ అందలమెక్కిస్తున్నాడని విమర్శించారు.

బంగారు తెలంగాణలో భాగస్వాములవుదాం

వరంగల్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల సందర్భంగా హన్మకొండలోని జె ఎన్ ఎస్ గ్రౌండ్‌లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి జ్యోతిప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ మొదటి దశలో 415.83 కోట్ల రూపాయల నిధులతో 1075 చెరువుల పునరుద్ధరణ చేపట్టి 888 చెరువు పనులు పరిపూర్ణంగా పూర్తి చేశామన్నారు.

ఓరుగల్లు అభివృద్ధిపై సిఎం ప్రత్యేక దృష్టి

వరంగల్, జూన్ 2: రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ముందుగా ఆయన జాతీయ జెండా ఎగురవేసి ఆ తరువాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అనంతరం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

రాష్ట్భ్రావృథ్ధి దేశానికే ఆదర్శం

సంగారెడ్డి, జూన్ 2: దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో వినూత్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ ఫరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.

ముంపు బాధితులకు ప్రభుత్వం అండ

దుబ్బాక, జూన్ 2: మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఎలాంటి నష్టం జరుగదని, దేశంలోనే ఎవరికీ ఇవ్వని పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని, అనవసరంగా రెచ్చగొట్టేవారిని నమ్మొద్దని అంచనాల కమిటీ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక గాంధీ విగ్రహం వద్ద జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్నసాగర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి ఎకరానికి 5.80నుంచి 6లక్షల వరకు పరిహారం ఇచ్చి అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు.

ఎంపిడిఓకు హరీష్‌రావు ప్రశంస

మెదక్ రూరల్, జూన్ 2:రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ మండల అవార్డును ఎంపిడిఓ రాంబాబు మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా గురువారం అందుకున్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి టి.హరీష్‌రావు చేతులమీదుగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమక్షంలో ప్రశంసాపత్రం, 51 వేల 116 రూపాయల చెక్కు, షీల్డును అందుకున్నట్లు తెలిపారు. మెదక్ మండలంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారిగా చురుకైన పాత్రపోషిస్తు ఇతర శాఖల అధికారులను సమన్వయంచేయడంతో సాధ్యమవుతున్నట్లు ఎంపిడిఓ రాంబాబు తెలిపారు.

Pages