S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్‌షాక్‌తో కానిస్టేబుల్ మృతి

శ్రీకాకుళం: ఇక్కడికి సమీపంలోని ఎచ్చెర్ల పోలీస్ శిక్షణ కేంద్రంలో బుధవారం ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగ తగిలి ఆదినారాయణ అనే ఎఆర్ కానిస్టేబుల్ మరణించాడు. ఇదే ఘటనలో గాయపడిన మరో కానిస్టేబుల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. కానిస్టేబుల్ మరణంతో ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్‌లో విషాదం అలముకుంది.

భారీ జాతీయజెండా ఆవిష్కరణకు సన్నాహాలు పూర్తి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా నగరంలోని సంజీవయ్య పార్కులో గురువారం సిఎం కెసిఆర్ భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే సంజీవయ్య పార్కులో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపడుతూ సందర్శకులను అనుమతించడం లేదు.

పుల్గావ్‌ ఘటనపై కేంద్రానిదే బాధ్యత : శివసేన

ముంబయి: మహరాష్ట్రలోని పుల్గావ్‌లో ఆర్మీ ఆయుధాగారంలో అగ్నిప్రమాదం వల్ల జరిగిన ప్రాణ నష్టానికి కేంద్రానిదే బాధ్యత అని శివసేన ప్రభుత్వంపై మండిపడింది. దీని వెనుక విద్రోహ చర్య ఉందనే అనుమానాలు వస్తున్నాయని వెల్లడించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశంపై కేంద్రం బాధ్యతారహితంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని శివసేన తమ పత్రిక సామ్నాలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు సహా 18 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

కేంద్ర మంత్రి ఉమాభారతికి కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌ : కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేలకుండా ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవద్దని, కృష్ణా యాజమాన్య బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని కేంద్ర మంత్రి ఉమాభారతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్ర వాటా కోసం ఇప్పటికే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించామని.. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తే రాష్ట్ర ప్రయోజనలకు భంగం కలుగుతుందని, ముసాయిదా నోటిఫికేషన్‌ విభజన చట్టానికి అనుగుణంగా లేదని కేసీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పగ్గాలు ఇక రాహుల్‌కే..?

దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ త్వరలోనే అధిష్ఠిస్తారన్న ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇటీవల వరుస ఓటములతో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కొత్తతరానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌కు అధ్యక్ష పదవిని అప్పగించాలని సోనియా భావిస్తున్నారు. తాజాగా అయిదు రాష్ట్రాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో పార్టీకి శస్తచ్రికిత్స అవసరమని దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు.

8న ఒంగోలులో మహాసంకల్ప సభ

విజయవాడ: ఈ నెల 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమం పూర్తయ్యాక 8వ తేదీన ఒంగోలులో మహాసంకల్ప సభను నిర్వహించాలని ఎపి క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతను బుధవారం ఇక్కడ జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీలోగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని, 20 నుంచి 30వ తేదీలోగా పల్స్ సర్వే జరపాలని, ఈనెల 27లోగా హైదరాబాద్‌లోని ఎపి ఉద్యోగులంతా అమరావతికి తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

నవనిర్మాణ దీక్షలో అందరూ భాగస్వాములే

విజయవాడ: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిన సందర్భంగా చేపట్టే నవ నిర్మాణ దీక్షలో అన్ని వర్గాల వారూ భాగస్వామ్యం కావాలని ఎపి సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకూ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకూ సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం దీక్ష వహించాలన్నారు. విభజన సమస్యలు, రెండేళ్లలో సాధించిన ప్రగతి, చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటి విషయాలపై సదస్సుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

మరో 15 ఏళ్లు మోదీయే ప్రధాని: పాశ్వాన్

జమ్ము: నరేంద్ర మోదీ మరో 15 ఏళ్లపాటు ప్రధానిగా కొనసాగుతారని, ఈ విషయంలో కాంగ్రెస్ వారికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బుధవారం జమ్ములో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మోదీ ప్రధానిలా కాకుండా ఈ దేశానికి చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ పాశ్వాన్ ఈ విధంగా స్పందించారు. మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుందన్నారు.

బాలీవుడ్ హాస్య నటుడు రజాక్ కన్నుమూత

ముంబయి: బాలీవుడ్ హాస్య నటుడు రజాక్ ఖాన్ బుధవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బాద్‌షా, హాలో బ్రదర్, హెరాఫెరీ, హాసీనా మాన్ జాయేగీ, జోరు కా గులామ్ వంటి 90కిపైగా సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అమ్మానాన్నలపై చిన్నారుల ఫిర్యాదు!

విజయవాడ: తమను బడికి పంపడానికి బదులు పనుల్లోకి వెళ్లాలంటూ తల్లిదండ్రులు వేధిస్తున్నారని ఇద్దరు చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో చిన్నారులైన సిద్ధు (13), రేష్మి (8) తమ తల్లిదండ్రులపైనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది. బాగా చదువుకొనాలని ఆశ పడుతున్న వీరు బంధువుల సాయంతో పోలీసులను ఆశ్రయించారు.

Pages