S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రోధరలు తగ్గించండి: జయలలిత

చెన్నై: వరసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజల సమస్యలపై లేఖలు సంధించడం ప్రారంభించారు. తాజాగా పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు.

పోలీస్ స్టేషన్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో కొందరు అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన గోపి అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనను పోలీసులు అకారణంగా కొట్టారని మనస్తాపం చెందిన గోపి పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.

విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళి అర్పించేందుకు ఓయు విద్యార్థులు తలపెట్టిన బైక్ ర్యాలీని బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. నవ తెలంగాణ విద్యార్థి సంఘం నేతృత్వంలో ఓయు ఆర్ట్సు కాలేజీ నుంచి గన్‌పార్కు వరకూ ర్యాలీ జరపాలని విద్యార్థులు భావించారు. ర్యాలీ ఎన్‌సిసి గేటు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నిబంధనలను ఉల్లంఘించారని కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 21 పెంపు

దిల్లీ: రాయితీ లేని వంటగ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్‌పై 21 రూపాయలు అదనంగా పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 527.50 రూపాయల నుంచి 548.50 రూపాయలకు పెరిగింది. ఈ ధర వివిధ పట్టణాల్లో వివిధ రకాలుగా ఉంటుంది.

మంత్రి పుల్లారావుసహా ఆరుగురిపై ఎన్‌బిడబ్ల్యు

గుంటూరు: 2014లో సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా రైల్‌రోకో కేసుకు సంబంధించి ఎపి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, టిడిపి ఎమ్మెల్యే ఆలపాటి రాజా,మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, ఈశ్వరరావు, వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డిలపై రైల్వే కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లను బుధవారం జారీ చేసింది. వరసగా మూడు వాయిదాలకు హాజరుకానందున వీరిపై ఈ వారంట్లను జారీ చేసి, కేసు విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.

అంతర్రాష్ట్ర బెట్టింగ్ ముఠా అరెస్టు

అనంతపురం: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్‌లు నిర్వహించిన అంతర్రాష్ట్ర ముఠాలోని 25 మందిని ధర్మవరంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 తులాల బంగారు నగలు, సుమారు 4 లక్షల నగదు, 4 ఎల్‌ఇడి టీవీలు, 82 సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను బుధవారం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

ఆయుధాగారంలో మృతుల సంఖ్య 18

ముంబయి: మహారాష్టల్రోని వార్ధా జిల్లా పుల్గావ్ వద్ద ఆర్మీ ఆయుధాగారంలో అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. సోమవారం రాత్రి మంటలు వ్యాపించడతో 16 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం సంఘటన ప్రాంతంలో మరో రెండు మృతదేహాలు లభించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు 16 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో చుట్టుపక్కల ఇళ్లనుంచి వెళ్లిపోయినవారు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.

నేడు టిడిపిలోకి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

విజయవాడ: వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ రెడ్డి బుధవారం సాయంత్రం ఇక్కడ టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకుంటారు. గిద్దలూరు నుంచి కార్యకర్తలు, అభిమానులతో ఆయన విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు.

మానేరు డ్యామ్‌లో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

కరీంనగర్: స్నానం చేద్దామని వచ్చి మానేరు జలాశయంలో మునిగి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బుధవారం ప్రాణాలు కోల్పోయారు. జ్యోతినగర్‌కు చెందిన వరుణ్, సునంద్ జలాశయంలో స్నానం చేస్తూ కనిపించకుండా పోయారు. కాసేపటికి స్థానికుల సహాయంతో జలాశయంలో గాలించగా ఇద్దరి మృతదేహాలను లభించాయి. సునంద్ హైదరాబాద్‌లో, వరుణ్ కరీంనగర్‌లో ఇంటర్ చదువుతూ సెలవులకు జ్యోతినగర్ వచ్చారు.

నవ నిర్మాణ దీక్షలు కాలక్షేపానికే: సిపిఎం

నెల్లూరు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అంశాలను గాలికొదిలేసి ఎపి సిఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని సిపిఎం నేత మధు విమర్శించారు. జనం దృష్టిని మరలించేందుకు చేపడుతున్న నవ నిర్మాణ దీక్షలను తమ పార్టీ వ్యితిరేకిస్తోందన్నారు. కాలక్షేపానికి తప్ప ఇలాంటి దీక్షల వల్ల జనానికి ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Pages