S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండులా కదిలిన శోభాయాత్ర

కరీంనగర్, మే 31: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర ఘనంగా జరిగింది. హిందు సమాజాన్ని జాగృతం చేయడంతోపాటు ఏకతాటిపైకి తెచ్చేందుకు చేపట్టిన ఈ యాత్రలో హిందువులు దండులా కదిలిరాగా, అందరి ప్రశంసలు చూరగొంది. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సైతం కరీంనగర్ నగరానికి తరలివచ్చి శోభయాత్రలో పాల్గొనడం విశేషం. హిందూ ఏక్తా యాత్ర సందర్భంగా కరీంనగర్‌లోని ప్రముఖ కూడళ్ళు, రహదారులన్ని కాషాయ తోరణాలతో నిండిపోయాయి. యాత్ర సందర్భంగా హనుమాన్, సీతారాముల విగ్రహాలను రథంపై పెట్టి నగరంలో ఊరేగింపు నిర్వహించారు.

ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరసనల హోరు

తొగుట, మే 31: మల్లన్నసాగర్ భూనిర్వాసిత గ్రామమైన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో గ్రామస్థులంతా పంచాయతీ కార్యాలయం ముందు మంగళవారం బైఠాయించి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. 2013 చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్త్తూ రిలే దీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి గ్రామ చావిడి వద్ద ఆట, పాటలతో నిరసనలు తెలిపి వంటావార్పు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచే చౌరస్తా వద్దకు చేరుకున్న మహిళలు, వృద్ధులు కంటతడి పెడుతూ తమ బతుకులు చిందరవందర చేసే ప్రాజెక్టు నిర్మించొద్దని, భూములు అప్పగించేది లేదన్నారు.

చేనేత కార్మికుడి ఆత్మహత్య

రామన్నపేట, మే 31: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ పి.శీనయ్య తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన దొంత అంజయ్య (61) చేనేత వృత్తిని జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో సొంతిల్లు కూడా లేని అంజయ్య చేనేత వృత్తినే నమ్ముకుని ఇద్దరు కుమార్తెల వివాహాలు చేశాడు. ఇద్దరు కుమారులను చదివిస్తున్నాడు. చేనేత వృత్తితో కుటుంబ అవసరాలు తీరకపోవడంతో పాటు కుమార్తెల వివాహాలకోసం, కొడుకుల చదువుల కోసం అప్పులు చేశాడు.

రైతన్నల విత్తన పాట్లు

చౌటుప్పల్, మే 31: సబ్సిడీ విత్తనాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సింగిల్‌విండో కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు వచ్చిన గంటలోనే ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వం పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం కల్పించడంతో రైతుల దృష్టి పప్పు్ధన్యాల పంటల సాగుపై పడింది. అందుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పడంతో సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు.

రైతులు, ప్రజలకు బాబు చేసింది ‘మహాదగా’

తిరుపతి, మే 31: పేదరికం తన కులం మతం అని 35వ మహానాడు వేధికగా చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ నాయకులు మార్టిన్, డిసిసి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి నేతృత్వంలో భిక్షాటన చేసి పొందిన 3500 వేల రూపాయల నగదును డిడి రూపంలో నిరుపేద బాబుకు అని రాసి పంపారు. మహానాడులో బాబు చెప్పిన మాటలన్నీ సత్యదూరాలని ప్రజలకు తెలియజేసేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఎన్టీ ఆర్ సర్కిల్ వద్ద రైతులు, చేనేత రైతులు, ప్రజలతో భిక్షాటనచేశారు.

అదుపులోనే శాంతిభద్రతలు

హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్‌శర్మ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే మావోల ప్రాబల్యం పెరుగుతోందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని అపోహలను దరిచేరనీయకుండా పోలీస్ యంత్రాంగం మావోల ప్రాబల్యం గల ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసి వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలిగిందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను సంస్కరించిందని, పోలీసు శాఖకు కావలసినవన్నీ సమకూర్చగలిగిందన్నారు.

మూతబడిన పాలకేంద్రాలు తెరిచేదెన్నడు..?

కడప, మే 31: జిల్లాలో పాడిపరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు పాడి పరిశ్రమపై ప్రోత్సాహం లేక రోజు రోజుకూ పశుసంపద క్షీణిస్తోంది. కొన్ని ప్రాంతాలలో గేదెలు, ఆవులు అధికంగా ఉన్నా వాటికి అతి కష్టం మీద మేతను సమకూర్చి అరకొర పాలను పశువుల ద్వారా తీసుకొని వాటిని అమ్మకాలు చేసుకోవడానికి దళారులతో రైతులు దగా పడుతున్నారు. జిల్లాలో ఎంతో ఘనచరిత్ర ఉన్న ప్రొద్దుటూరు, రాజంపేట, పెద్ద పెద్ద పాలకేంద్రాలే మూతపడ్డాయి. ఏపీ డైరీ అధికారులు డీ ఆర్‌డీ ఏ ద్వారా 21 ప్రాంతాలలో బీ ఎంసీ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారు.

సిఎం ఫాంహౌస్‌ను సందర్శించిన డిజిపి

జగదేవ్‌పూర్,మే 31: మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గల సిఎం కెసిఆర్ ఫాంహౌస్‌ను డిజిపి అకుల్‌సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి మంగళవారం సందర్శించారు.పలు మార్లు సిఎం కె.చంద్రశేఖర్‌రావు తన వ్యవసాయ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ చేపట్టవల్సిన రక్షణ చర్యల గురించి పర్యవేక్షించారు. ఫాంహౌస్ పరిసర ప్రాంతంలో పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు. ఫాంహౌస్‌పై ప్రత్యేక నిఘా పెంచి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

మిషన్ కాకతీయపై షికాగో వర్శిటీ అధ్యయనం

హైదరాబాద్, మే 31:మిషన్ కాకతీయపై అధ్యయనం చేసేందుకు షికాగో యూనివర్సిటీ ముందుకు వచ్చింది. మిషన్ కాకతీయ పథకం అమలు తీరు, దాని ప్రభావాన్ని యూనివర్శిటీ అధ్యయనం చేస్తుంది. షికాగో యూనివర్శిటీతో ఎంఓయు ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) కమీషనర్ డాక్టర్ జి మల్సూర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిషన్ కాకతీయపై రెండేళ్ల పాటు యూనివర్సిటీ ఆఫ్ షికాగో అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయన బృందానికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో వసతితో పాటు అవసరం అయిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎంసిహెచ్‌ఆర్‌డి డైరెక్టర్ జనరల్‌ను కోరింది.

కోమటిరెడ్డి కాంగ్రెస్‌ను వీడితేనే మంచిది

హైదరాబాద్, మే 31: నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీని వీడితే పార్టీకిగానీ, జిల్లాకు గానీ నష్టమేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. కోమటిరెడ్డి పార్టీలో ఉంటేనే నష్టమని అన్నారు. జిల్లాలోని పార్టీ ముఖ్యులకు ఫోన్లు చేసి తన వెంట రావాల్సిందిగా కోరుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. కాగా కోమటిరెడ్డి వెంట వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.

Pages