S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ విద్యకు 20లక్షల సహాయం

హైదరాబాద్, మే 31: విదేశాల్లో విద్యను అభ్యసించే ఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని పెంచింది. అంబేద్కర్ ఓవర్సిస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఇప్పటి వరకు ఒక్కో విద్యార్థికి పది లక్షల రూపాయల సహాయం అందించే వారు. దానిని రెట్టింపు చేశారు. 20లక్షల రూపాయల సహాయం అందిస్తారు. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మంగళవారం సంతకం చేశారు.

సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కాలేజీకి ఏ గ్రేడ్

హైదరాబాద్, మే 31: సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైనె్సస్ (ఎసిడిఎస్)కు యుజిసి ఆధీనంలోని ది నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది. నేక్ సంస్థ ప్రతినిధులు తొలిసారి ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైనె్సస్‌ను సందర్శించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం సంస్థను సందర్శించిందని అధికారులు చెప్పారు. విద్యాసంబంధమైన, జ్ఞాన సంబంధమైన, సహపాఠ్యప్రణాళికలను కూడా పరిశీలించిన ఈ బృందం 3.06 క్యుమిలేటెడ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్‌తో ఏ గ్రేడ్ ఇచ్చిందని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.

మూతబడిన పాలకేంద్రాలు తెరిచేదెన్నడు..?

కడప, మే 31: జిల్లాలో పాడిపరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు పాడి పరిశ్రమపై ప్రోత్సాహం లేక రోజు రోజుకూ పశుసంపద క్షీణిస్తోంది. కొన్ని ప్రాంతాలలో గేదెలు, ఆవులు అధికంగా ఉన్నా వాటికి అతి కష్టం మీద మేతను సమకూర్చి అరకొర పాలను పశువుల ద్వారా తీసుకొని వాటిని అమ్మకాలు చేసుకోవడానికి దళారులతో రైతులు దగా పడుతున్నారు. జిల్లాలో ఎంతో ఘనచరిత్ర ఉన్న ప్రొద్దుటూరు, రాజంపేట, పెద్ద పెద్ద పాలకేంద్రాలే మూతపడ్డాయి. ఏపీ డైరీ అధికారులు డీ ఆర్‌డీ ఏ ద్వారా 21 ప్రాంతాలలో బీ ఎంసీ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారు.

ఐసెట్ టాపర్ గాజుల వరుణ్

హైదరాబాద్, మే 31: తెలంగాణ ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ -2016 ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వైస్ చాన్సలర్ టి చిరంజీవులు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఐసెట్ కన్వీనర్ కె ఓం ప్రకాష్, ఉన్నత విద్యామండలి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 19న నిర్వహించిన ఐసెట్ ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేసినట్టు చిరంజీవులు చెప్పారు. మొదటి ర్యాంకు కరీంనగర్ జిల్లాకు చెందిన గాజుల వరుణ్ దక్కించుకోగా, రెండో ర్యాంకు వివేక్ విశ్వనాథన్ అయ్యర్ (మహారాష్ట్ర) దక్కించుకున్నాడు.

త్వరలోనే ‘అమ్మఒడి’

హైదరాబాద్, మే 31 : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తల్లీబిడ్డలను ఆసుపత్రుల నుండి ఇళ్లకు పంపించేందుకు ‘అమ్మఒడి’ పేరుతో ఒకరకమైన వాహనం, పేదలు ఎవరైనా ఆసుపత్రుల్లో మరణిస్తే ఆ శవాలను వారి వారి ఇళ్లకు తరలించేందుకు ‘ఫ్రీ హార్సే సర్వీస్’ పేరుతో మరోరకమైన వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. రాష్ట్ర సచివాలయంలో ఈ రెండు రకాల వాహనాలను వైద్యశాఖ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతి అయిన తర్వాత తల్లీ, బిడ్డలను వారి ఇళ్లకు చేర్చేందుకు అమ్మఒడి పేరుతో 102 నెంబర్ (108 తరహాలో) కలిగిన వాహనాలను రూపొందించారు. తొలిదశలో 40 వాహనాలు సిద్ధం చేశారు.

నకిలీ డీడీల కేసులో కందికుంట, షాకీర్‌కు జైలు

అనంతపురం, మే 31 : సుమారు 18 ఏళ్ల క్రితం సంచలనం రేపిన నకిలీ డిడిల కేసులో కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్‌కు సిబిఐ కోర్టు ఐదేళ్ల శిక్షతోపాటు రూ.6 లక్షల చొప్పున జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నకిలీ డిడిల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారన్న అభియోగాల నేపథ్యంలో బెంగళూరులో సిబిఐ అధికారులు వీరిని అరెస్టు చేశా రు. అనంతరం వీరు బెయిల్‌పై వచ్చారు. కాగా నకిలీ డిడిల కేసుకు సంబంధించి మహమ్మద్ షాకీర్, కందికుంట కోర్టు ఖర్చులు భరించే విషయంలో విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది.

నలిగిన ‘నాలుగు’

హైదరాబాద్, మే 31: నాలుగో అభ్యర్థి బరిలో ఉంటారా? లేరా? ఒకవేళ ఉంటే క్యాంపుల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో ఎలా ఓట్లు వేయిస్తారు? ఇదీ మంగళవారం ఉదయం వరకూ టిడిపి, వైసీపీ నేతలను ఉత్కంఠ పరిచిన అంశం. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థి పోటీపై టిడిపి నాయకత్వం సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకూ ఉత్కంఠను కొనసాగించి, చివరకు ముగ్గురితోనే కథ ముగించింది.

రోగులకు మెరుగైన సేవలు అందించండి

మచిలీపట్నం, మే 31: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు విభాగాలను తనిఖీ చేసిన ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వంటశాలను పరిశుభ్రంగా ఉంచి రోగులకు రుచికరమైన ఆహారం అందించాలని ఆస్పత్రి ఉద్యోగులను ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలో ప్లేషిఫ్టింగ్ గ్రాంట్ కింద చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు.

ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

పార్వతీపురం, మే 31: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీ సమీపాన గల ఉజిడితల్లి వీధిలో ఐదేళ్ల మైనర్ బాలికపై పక్కనే ఉన్న జనతావీధికి చెందిన 55 ఏళ్ల అన్నాబత్తుల బాబూరావు కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. చాలారోజుల నుంచి ఇలా లైంగిక వేధింపులకు గురవుతున్నా అవగాహన లేని ఆ అమ్మాయి చివరకు తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే వ్యక్తి గతంలో కూడా వివేకానంద కాలనీలోని 14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేయగా అప్పట్లో ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడని పార్వతీపురం పట్టణ పోలీసులు తెలిపారు.

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిపై ఎసిబి దాడి

మచిలీపట్నం, మే 31: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిపై ఎసిబి అధికారుల దాడి కలకలం సృష్టించింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ రూ.10వేలు లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖాధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిపై జరిగిన ఎసిబి అధికారుల దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన మునే్నటి శివ కోటేశ్వరరావు జిల్లాలోని నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, మైలవరం ఏరియా ఆస్పత్రుల శానిటేషన్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Pages