S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి క్యాబినెట్ భేటీ ప్రారంభం

విజయవాడ: ఎపి మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. ఈ నెల 2న జరిగే నవనిర్మాణ దీక్ష, రెండేళ్ల పాలన, కొత్తగా ఉద్యోగ నియామకాలు, వివిధ సంస్థలకు స్థలాల కేటాయింపు, రాజధాని నిర్మాణం, హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు, సంక్షేమ పథకాల అమలు తీరు, కొత్త పథకాలకు రూపకల్పన వంటి పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోందని సమాచారం.

దూసుకొచ్చిన వ్యాన్: ముగ్గురు మృతి

చిత్తూరు: అదుపు తప్పిన వ్యాన్ పాదచారులపై దూసుకుపోవడంతో ముగ్గురు మరణించిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో బుధవారం జరిగింది. మృతులను గౌరమ్మ, ఉదయ్, శ్రీనివాస్‌గా గుర్తించారు.

ముగ్గురు మహిళా మావోల లొంగుబాటు

విశాఖ: విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సమక్షంలో బుధవారం ఉదయం మహిళా మావోయిస్టులు కడబాల లక్ష్మి (సరిత), విజయ, కోనంగి రాములమ్మ (భరతక్క) లొంగిపోయారు. ఎపి, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల్లో వీరిపై పలు కేసులున్నాయి. లక్ష్మి, రాములమ్మలపై 4 లక్షల రివార్డు ఉంది. మరికొంత మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ తెలిపారు.

ఎస్‌ఐకి గాయాలు: కానిస్టేబుల్‌పై కేసు

విశాఖ: డ్యూటీ విషయమై ఎఆర్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ మధ్య వివాదం ఘర్షణకు దారితీసిన సంఘటన ఇక్కడ బుధవారం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఎస్‌ఐని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎమ్మార్వో ఆఫీసులో విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ వాసుపల్లి అమ్మోరును ‘డ్యూటీ వదిలి ఎక్కడికి వెళ్లావు’అని ఎస్‌ఐ భగవాన్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. తుపాకీతో కానిస్టేబుల్ కొట్టాడని ఎస్‌ఐ చెబుతుండగా, తన తుపాకీ లాక్కొని తలపై ఎస్‌ఐ గాయపరచుకున్నాడని కానిస్టేబుల్ వాదిస్తున్నాడు. ఎస్‌ఐ ఫిర్యాదుపై కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు.

స్టీల్‌ప్లాంట్‌కు నీటిని తరలించొద్దు: మాజీ మంత్రి దాడి

విశాఖ: అనకాపల్లి వద్ద శారదా నది నీటిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తరలిస్తే తాము సహించేది లేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హెచ్చరించారు. నీటి తరలింపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం ఆయన తుమ్మపాల వద్ద రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతుల ప్రయోజనాలను కాదని నీటిని తరలించాలనుకోవడం దారుణమన్నారు.

మూడేళ్లలోగా రైల్వే జోన్ సాధిస్తా: ఎంపీ హరిబాబు

విశాఖ: తన పదవీ కాలం (మరో మూడేళ్లలోగా) పూర్తయ్యేనాటికి విశాఖకు రైల్వే జోన్‌ను తప్పకుండా సాధిస్తానని స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు బుధవారం ఇక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎపి నుంచి రాజ్యసభకు పంపడానికి, రైల్వే జోన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సురేష్ ప్రభు వల్ల విశాఖ ప్రాంతానికి మేలు జరుగుతుందని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు.

తెరాసలో చేరిన టిడిపి ఎంపీ మల్లారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో టిడిపికి చెందిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి (మల్కాజిగిరి) బుధవారం ఉదయం తెరాసలో చేరారు. ఆయన తెరాస అధినేత, సిఎం కెసిఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. మల్లారెడ్డిని తెరాసలోకి ఆహ్వానిస్తున్నట్లు కెసిఆర్ అన్నారు. బంగారు తెలంగాణ తెరాస వల్ల సాధ్యమవుతుందని భావించి టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు.

కిటకిటలాడిన మద్ది క్షేత్రం

జంగారెడ్డిగూడెం, మే 31: హనుమజ్జయంతి, ఏకాదశి, మంగళవారం మూడూ కలసి రావడంతో మంగళవారం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విఐపిల తాకిడితో ఆలయం ఉక్కిరిబిక్కిరైంది. స్వయంభూ ఆంజనేయస్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారు జాము 4.30 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. వేకువజామున దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ), విజయలక్ష్మి దంపతులు, వారి కుమారుడు కార్తీక్‌వర్మ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు.

నకిలీల అడ్డా అకివీడు

ఆకివీడు, మే 31: ఏమో గుర్రం ఎగరావచ్చు... నువ్వే స్వారీ చేయావచ్చు...! అన్నాడో రచయిత. కాసులుంటే ఎంతటి పనైనా ఇట్టే జరిగిపోతోంది. గత కొన్నిరోజులుగా ఆకివీడు ప్రాంతంలో నకిలీల దందా కొనసాగుతుంది. 2006 సంవత్సరంలో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో ఆంధ్రాబ్యాంకులో రూ. 1.19 కోట్లు రుణాలు పొందిన వైనం వెలుగుచూసింది. ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తతంగమంతా బట్టబయలైంది. నకిలీ పాస్‌పుస్తకాలను తయారుచేసి తహసీల్దార్, విఆర్వోల సంతకాలతో 119 మంది వ్యక్తులు ఆంధ్రాబ్యాంకు నుంచి రుణాలు పొందారు. అయితే సర్వేనెంబర్లు వేరే యాజమానులకు చెందిన వారివి వేసి ఈ పుస్తకాలు పొందారు.

పింఛన్ పంపిణీలో జాప్యం

గజపతినగరం, మే 31: మీ- ఇంటికి పెద్ద కొడుకై ఆదుకుంటూ ఆపదలో అండగా ఉంటా.. ఆర్థిక ఇబ్బందు ల్లేకుండా చూస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నారు. అయితే ఆయన ప్రకటనలకు, ఆచరణలకు ఎక్కడ పొంతన కుదరడంలేదు. ప్రతి నెల ఒకటో తేదీ నాటికే ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి అందరికీ పూర్తిస్థాయిలో పింఛన్లు అందిస్తామని ఎన్నికల ముందు చెప్పినమాట నేడు ఆచరణ సాధ్యం కావటం లేదు. ప్రతీ నెల ఒకటవ తేదీ నాటికి పింఛన్లు పంపిణీకి కావాల్సిన మొత్తంలో ప్రభుత్వం కోత విధిస్తూ వాయిదాల పద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నది.

Pages