S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/18/2018 - 23:41

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం అసాధ్యమన్నది ‘్భరత న్యాయ వ్యవహారాల మండలి’ వారి విచిత్ర ప్రతిపాదనల సారాంశం! మధ్యంతరంగా ఎన్నికలను జరపడాన్ని నిరోధించడానికి వీలుగా ఈ ‘మండలి’ చేసిన ప్రతిపాదనలు మరిన్ని మధ్యంతర విన్యాసాలకు దారితీయగలవు. అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలను ‘మండలి’ వారు రూపొందించడం మరో విచిత్రం! ‘మండలి’ వారు బహుశా గమనించని మరో విచిత్రం ఉంది.

04/17/2018 - 23:45

మక్కా మసీదు పేలుడు దుర్ఘటనకు సంబంధించి అభియోగంలో అసీమానంద స్వామి, మరో నలుగురు నిందితులు నిర్దోషులన్న నిజం నిగ్గుతేలడం సత్యానికి సంభవించిన విజయం, తరతరాల జాతీయ స్వభావానికి సంభవించిన విజయం.

04/17/2018 - 00:00

కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభు త్వం ‘కార్మికరాజ్య బీమా సంస్థ’ (ఇ.ఎస్.ఐ.కార్పొరేషన్)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పలు ఆసుపత్రుల్లో ప్రభుత్వరంగ, ప్రభుత్వేతర కర్మాగారాల్లోని కార్మికులకు వైద్యసేవలందించాలి. ప్రతి కార్మికుడి వేతనం నుండి వందకు రూపాయి డెబ్బయి అయిదు పైసలు, యాజమాన్యం నాలుగు రూపాయల డెబ్బయి అయిదు పైసలు వెరసి ఆరురూపాయల ఏభై పైసలు సంస్థకు జమ అవుతుంటాయి.

04/16/2018 - 23:52

మినీ ఒలింపిక్స్’ కామనె్వల్త్ క్రీడలకు తెరపడింది. భారత క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ విజయ కేతనాన్ని ఎగురవేయగలని భారత క్రీడాబృందం నిరూపించింది. పతకాల పట్టికలో మూడో స్థానానికే ఇంతగా మురిసిపోవాలా? అదే అత్యుత్తమమని కేరింతలు కొట్టాలా? ఏదో ఘన కార్యాన్ని సాధించామని భుజాలు చరచుకోవాలా? నిజమే..

04/14/2018 - 00:09

ఉత్తరప్రదేశ్‌లో ‘ఒక మహిళను లైంగిక బీభత్సానికి గురిచేసిన’ శాసనసభ్యుడు వికృత ప్రతీక మాత్రమే! విదేశీయులు మననెత్తికెత్తిపోయిన విద్యావిధానం విబుధ దైత్యులను తయారుచేసింది, చేస్తోంది. ఈ విబుధ దైత్యులు భౌతిక బీభత్సకారులు, బౌద్ధిక బీభత్సకారులు, లైంగిక బీభత్సకారులు, అసాంఘిక కలాపాలకు పాల్పడుతున్నవారు. అన్ని రంగాల్లోనూ ఈ విబుధ దౌత్యులు చొరబడి ఉండడం నడుస్తున్న చరిత్ర.

04/13/2018 - 00:45

తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీర ప్రాంగణంలో గురువారం ప్రారంభమైన ‘రక్షణ ప్రదర్శిని’- డిఫెన్స్ ఎక్స్‌పో- మన భద్రతా పటిమకు అద్దం. ప్రధాని నరేంద్ర మోదీ శుభారంభం కావించిన ఈ నాలుగు రోజుల ప్రదర్శనం పెరుగుతున్న మన సమర పాటవానికి, రక్షణ పటిమకు మరో సాక్ష్యం. నాలుగేళ్లలో మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపు కావడం ఈ ప్రదర్శినికి సముచితమైన పూర్వరంగం.

04/11/2018 - 23:33

ప్రపంచీకరణ వ్యవస్థ నియమ నిబంధనలను సంపన్న దేశాల ప్రభుత్వాలు బాహాటంగా ఉల్లంఘిస్తుండడం ‘అంతర్జాతీయ ఇంధన సమాఖ్య’ మంత్రుల స్థాయి సమావేశానికి విచిత్ర నేపథ్యం. డెబ్బయి రెండు దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ మంత్రుల స్థాయి సమావేశం బుధవారం ఢిల్లీలో జరుగుతున్న సమయంలోనే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య సమరం తీవ్ర స్థాయికి చేరడం సమాంతర పరిణామం!

04/10/2018 - 23:58

యాబయి ఆరు ఆవులు అకాల మరణం పాలు కావడం హృదయ విదారకమైన దుర్ఘటన. ఒకచోట ఈ గోవుల మృతకళేబరాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దారుణ దృశ్యం ఆవిష్కృతం కావడానికి కారణం వ్యవసాయం విష రసాయనగ్రస్తమై ఉండడం. క్రిమిసంహారక రసాయనాలు నిండిన గడ్డిని మేసిన ఆవులు తక్షణం ప్రాణాలను కోల్పోవడం కృత్రిమ వ్యవసాయం కల్పిస్తున్న వైపరీత్యాలకు పరాకాష్ఠ.

04/10/2018 - 00:12

కృష్ణజింకల హత్య ప్రతీక మాత్రమే.. దేశమంతటా వన్యప్రాణుల హననం విచ్చలవిడిగా కొనసాగుతుండడం వాస్తవ వైపరీత్యం. విదేశాల్లో సైతం వన చర జంతు జాతులను, పక్షులను నాగరికతను అభినయిస్తున్న అనాగరికులు పొట్టనపెట్టుకుంటూ ఉండడం దశాబ్దులుగా ఆవిష్కృతవౌతున్న మానవ క్రౌర్యానికి వికృతమైన నిదర్శనం.

04/06/2018 - 23:18

శుక్రవారం ముగిసిన రెండవ విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లోను రాజ్యాంగ ప్రక్రియ స్తంభించింది, సభల వెలుపల పార్లమెంట్ భవన ప్రాంగణంలోను, సమీపంలోను బోలెడంత రాజకీయ ప్రక్రియ ఊపందుకుంది. సభల వెలుపల ‘రాజకీయం’ ఇలా ఊపందుకొనడానికి వీలుగా పూర్వ నిర్దేశిత పథకం ప్రకారమే సభల లోపల ‘రాజ్యాం గా’న్ని కుదేలుమనిపించారన్నది సామాన్య ప్రజలకు కలిగిన- ఏర్పడిపోయిన- అభిప్రాయం.

Pages