S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/01/2018 - 23:44

కర్నాటక శాసనసభ ఎన్నికల్లో ‘పతాక’ రాజకీయాలు ప్రచారం అవుతుండడం విచ్ఛిన్న భావాలకు నిదర్శనం! పతాకం జాతికి ప్రతీక, జాతీయ ధ్వజం జాతి సర్వ సమగ్ర అస్తిత్వానికి సనాతన- శాశ్వత- చిహ్నం! ఒక జాతికి ఒకే పతాకం ఉండడం యుగయుగాల సంప్రదాయం. ఈ సంప్రదాయం బ్రిటన్ విముక్త భారత్‌లో భంగపడింది, భంగపడుతోంది!

04/30/2018 - 23:55

సరికొత్త అనుసంధానం సర్వసమగ్రంగా విస్తరించింది. ఈ అనుసంధానం విద్యుత్ వలయం, శక్తితరంగాల నిలయం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి మణిపూర్ వరకు విద్యుత్ తంత్రులు విస్తరించడం ఈ అనుసంధానం. దేశంలోని దాదాపు ఐదు లక్షల తొంబయి ఎనిమిది వేల పల్లెలను, వేల పట్టణాలను, వందల నగరాలను, వనసీమలను, దుర్గమ గిరిసీమలను పరస్పరం ఒకే ‘తీగె’పైకి తేవడం ఈ అనుసంధానం.

04/29/2018 - 00:08

హైదరాబాద్‌లో గత వారం జరిగిన సిపిఎం జాతీయ మహాసభలను చూచి కేంద్రంలోని భాజపా సర్కారు నిలువెల్లా వణికిపోయిందట! ఈ విషయాన్ని ఏ సాధారణ కార్యకర్తో కాదు.. సాక్షాత్తూ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నాయకుడు బీవీ రాఘవులు వెల్లడించారు. మహాసభలు ముగిసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రెండు మూడు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు.

04/27/2018 - 23:32

ఆహా, ఓహో..’ అన్న మైత్రీ భాషణ విన్యాసాల మధ్య అసలు సమస్యలు స్ఫురించకపోవడం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరుపుతున్న చైనా పర్యటనలో శుక్రవారం ప్రస్ఫుటించిన మహా విషయం.

04/26/2018 - 23:03

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించడం ‘సమా ఖ్య కూటమి’ వల్ల సంభవించిన విప్లవ పరిణామం. సమాఖ్య కూటమి ఏర్పడవలసి ఉంది. కానీ జాతీయ స్థాయిలో మళ్లీ ‘మిశ్రమ రాజకీయ’ శకాన్ని స్థాపించడానికై ‘వలసిన’ నాయకత్వం కోసం మాత్రం పోటీ ఆరంభమైంది.

04/26/2018 - 03:55

ఆశారామ్ బాపు అనే లైంగిక బీభత్సకారుడికి యావజ్జీవ కారాగృహవాస దండన లభించడం ‘్ధర్మాచార్యుల’ వేషంలో జనవంచనకు ఒడిగడుతున్న దుర్మార్గులకు మరో గుణపాఠం. పదహారేళ్ల బాలికను తన లైంగిక బీభత్సకాండకు బలిచేసిన కామపిశాచి ఈ ఆశారామ్- నరరూప రాక్షసుడు! దుర్మార్గులుగా చెలామణి అవుతున్న దుర్మార్గులను సమాజం నిరసిస్తోంది, అసహ్యించుకొంటోంది, అభిశంసిస్తోంది, శిక్షిస్తోంది!

04/25/2018 - 04:00

మేఘాలయలో ఇరవై ఏడేళ్లుగా అమలులో ఉన్న ‘సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టా’న్ని ఉపసంహరించుకొనడం ఈశాన్య ప్రాంతాలలో శాంతిభద్రతలు మెరుగుపడుతుండడానికి చిహ్నం కావచ్చు. జనంలో జాతీయతా నిష్ఠ పెరగడం ఇలా శాంతిభద్రతలు మెరుగుపడడానికి కారణం కావచ్చు! 2000వ సంవత్సరంతో పోల్చినప్పుడు ఈశాన్య ప్రాంతంలో విద్రోహ ఘటనలు, దేశ వ్యతిరేక బీభత్స ఘటనలు ప్రస్తుతం ఎనబయి ఐదు శాతం తగ్గిపోయాయన్నది ఆధికారిక ధ్రువీకరణ.

04/23/2018 - 23:43

మన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల ఇరవై ఏడవ, ఇరవై ఎనిమిదవ తేదీల్లో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరుపనుండడం ‘కుహనా పారవశ్యంతో కుతికెలు నిండిన’ వారికి మరో గొప్ప చర్చనీయాంశం!

04/21/2018 - 00:01

సముద్రాలలో నెలకొని ఉన్న చిన్న దేశాల ఆర్థిక సౌష్టవాన్ని పరిరక్షించడం, పర్యావరణాన్ని సంరక్షించడం ‘కామన్‌వెల్త్’ దేశాల ప్రధాన కార్యక్రమం కావాలన్నది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదన.

04/19/2018 - 23:34

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం రాజకీ య సౌలభ్యం మాత్రమే, ప్రజాస్వామ్య స్వభావం కాదు. పదే పదే ఎన్నికలు జరగడం వల్ల పాలకుల దృష్టి ‘పాలన’ పైనుంచి ‘ప్రచారం’ వైపు మరలడం అనివార్యం. ‘పాలన కుంటుపడుతోంది. ప్రగతి వేగం మందకొడి తనానికి గురవుతోంది’ అన్నది తరచూ వినబడుతున్న వాదం. ఇందులో యథార్థం లేకపోలేదు. కానీ ‘ఏకకాలం ఎన్నికల’ కోరిక వెనుక దీనికి మించిన మరో అంశం దాగి ఉంది. అదీ రాజకీయ సౌలభ్యం.

Pages