S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/05/2018 - 23:38

మన చట్టసభల తీరు నానాటికి రాజుగారి గుర్రం గాడిదగా మారింది. వీధి బడులు పెంకుటిళ్లు, రేకుల షెడ్లలో నిర్వహించే రోజుల్లో వర్షం వస్తే పైకప్పులు సరిగా లేనందున పిల్లలకు సెలవు ఇచ్చేవారు. అందుకే వానాకాలం చదువులని పేరు వచ్చింది. నేటి ప్రజా ప్రతినిధులు కూడా చట్టసభల్లో హాజరు వేయించుకోవటం, ఏదో ఒక వంకతో గోల చెయ్యటం, సభలను వాయిదా వేయటం రివాజైంది. ఎవరైనా విమర్శిస్తే సభాహక్కులకు భంగం అంటారు.

04/05/2018 - 23:27

నల్లజింకల హంతకుడు, హిందీ చలనచిత్ర నటుడు సల్మాన్ ఖాన్‌కు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్షను విధించడం సహజ న్యాయసూత్రాలకు సంభవించిన విజయం, ప్రకృతి గాయాలకు ఉపశమనం! సల్మాన్ ఖాన్ వంటి నటులు చలనచిత్రాల్లో ఉదాత్తమైన పాత్రలను పోషించడం, నిజ జీవితంలో నికృష్టమైన కలాపాలకు పాల్పడడం దశాబ్దుల క్రితం నాటి చరిత్ర. ఉదాత్తమైన ఇతివృత్తాలతో చలనచిత్రాలు నిర్మాణం జరిగినప్పటి చరిత్ర.

04/04/2018 - 23:26

పచ్చి మామిడికాయలను బంగారపువనె్నల మామిడి పండ్లుగా భ్రమింపచేసే రసాయన ప్రక్రియ మళ్లీ మొదలైపోయింది. వసంత ఋతువు- చైత్ర వైశాఖ మాసాలు- సహజ ప్రాకృతిక పరిమళాలకు నెలవు-అన్నది పాత కథ, పాత పడిపోయిన భారతీయత! వసంత ఋతువురసాయన విషాల వాసనల ‘కల్పతరువు’గా మారడం నడుస్తున్న కథ, కల్తీని పెంపొందిస్తున్న ప్రపంచీకరణ కథ! ఈ ‘రసాల ఫలం’- మామిడి పండు మాత్రమే కాదు, ఏ పండు కూడ సహజంగా పండిపోవడం లేదు, చెట్టున పండడం లేనే లేదు.

04/04/2018 - 00:20

యాత్రికులు రాళ్లదెబ్బలకు గురికావడం వర్తమాన ఘట్టం! జమ్మూ కశ్మీర్‌లో కురుస్తున్న ‘రాళ్లవాన’కు జనం అలవాటై పోయారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ దుండగులు దశాబ్దుల తరబడి కశ్మీర్ రాజధాని శ్రీనగరం వీధులలోను, ‘లోయ’ ప్రాంతంలోని ఇతర పట్టణాలలోను ధైర్యంగా నిలబడి రాళ్లురువ్వుతుండడం ఏళ్లతరబడి ఆవిష్కృతవౌతున్న వికృత దృశ్యం. దుండగులు ఒకప్పుడు హిందువులను బీభత్సకాండకు బలి చేశారు.

04/03/2018 - 02:10

పెట్రోలు, డీజిల్ నూనెల ధరలు భగ్గుమని పైకెగసి భగభగలాడుతుండడానికి కారణం మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి ‘అంతర్జాతీయ అనుసంధాన’ విధానాన్ని మోదీ ప్రధాన మంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో అమలు జరుపుతుండడం. మన్‌మోహన్ ప్రభుత్వం దేశీయ ఇంధనం విపణిని ‘అంతర్జాతీయ విపణి’తో అనుసంధానం చేయడానికి పూర్వం కూడ పెట్రోలు, డీజిల్ నూనెలు ధరలు పెరిగాయి.

03/30/2018 - 00:18

సహకారం ‘సంఘర్షణ’గా మారుతుండడం రాజకీయ పక్షాల ‘సమాఖ్య కూటమి’- ఫెడరల్ ఫ్రంట్-కి విచిత్రమైన నేపథ్యం. ఈ ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు పేరుతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమై ఉన్న ‘జాతీయ రాజకీయ పక్షాల’ అధినేతలు గొప్ప హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడికి, ఆర్భాటానికి మాధ్యమాలలో- ప్రధానంగా దృశ్య మాధ్యమాలలో జరిగిపోతున్న ప్రచారం అంతా ఇంతా కాదు.

03/29/2018 - 02:16

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప రాజకీయ అవకాశ వాదానికి జీవన రూపం. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నది దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ప్రచారం. ఈ ప్రచారాన్ని ఆయనే స్వయంగా ప్రారంభించాడు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బలపరిచాడు.

03/28/2018 - 00:13

రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మరో ‘నెపోలియన్’ వలె చరిత్ర ప్రసిద్ధికెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం రష్యాకు, పడమటి దేశాలకు మధ్య నడుస్తున్న ‘దౌత్యవేత్తల బహిష్కరణ’ ప్రహసనం పుతిన్ ఇలా ఉవ్విళ్లూరడానికి సరికొత్త ప్రేరకం. పదునాలుగవ తేదీన బ్రిటన్ ప్రభుత్వం ఇరవై ముగ్గురు రష్యా దౌత్యవేత్తలను తమ దేశం నుండి బహిష్కరించడం ఆరంభం..

03/27/2018 - 01:15

లిచినా ఓడినా ఒకే రీతిలో స్పందించడమే క్రీడాస్ఫూర్తి. ‘పెద్దమనుషుల ఆట’ క్రికెట్‌లో దీనికే పెద్దపీట. కానీ, క్రీడాస్ఫూర్తిని మంటగలిపి, గెలడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కవచ్చన్న సరికొత్త సిద్ధాంతం క్రికెట్‌ను భ్రష్టుపట్టిస్తున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన సంఘటనే ఇందుకు నిదర్శనం.

03/24/2018 - 00:23

మన దేశంలో బీభత్స కలాపాలను నిర్వహించడానికై సిక్కు యువకులను పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతుండడం ఆశ్చర్యకరం కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం ‘బీభత్స వ్యవస్థ’- టెర్రరిస్ట్ రిజీమ్- అన్న వాస్తవానికి ఇది మరొక ధ్రువీకరణ మాత్రమే! మన దేశంలోకి చొరబడి మన ప్రజలను హత్యచేస్తున్న వివిధ బీభత్స‘తండా’లకు వౌలిక ‘స్ఫూర్తి’ కేంద్రం పాకిస్తానీ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’- ఐఎస్‌ఐ-!

Pages