S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/25/2018 - 00:06

బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు భారతీయ స్వచ్ఛతను భగ్నం చేస్తుండడం వౌలిక సమస్య. ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- భారతీయతకు ‘గొడ్డలి’లా దాపురించి ఉంది. ప్రపంచీకరణ వల్ల భారత జాతీయ సాంస్కృతిక స్వచ్ఛత ‘కల్తీ’ అవుతోంది, భారతీయుల జీవన ‘విలాసం’- పాషన్- మారిపోతోంది, మారిపోయింది. భారతదేశపు భౌతిక స్వచ్ఛత అడుగంటిపోతుండడానికి ఇది దోహదం చేస్తోంది.

05/24/2018 - 00:05

ఓటమిని ‘విజయం’గా చిత్రీకరించి ఉత్సవాలు జరుపుతుండడం కర్నాటకలో ప్రస్తుతం నడుస్తున్న ‘కాండ’. పదహైదవ తేదీన కర్నాటక శాసనసభ ఫలితాలు వెలువడుతుండిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ ‘కాండ’ను ప్రారంభించింది. ఇరవై మూడవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిముషాలకు హెచ్.డి.కుమారస్వామి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడం పరాకాష్ఠ. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది.

05/22/2018 - 23:43

నోరు చక్కగా మాట్లాడుతోంది- అన్న వాస్తవానికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీని, సోమవారం గట్టిగా కౌగిలించుకొని, రష్యాలోని ‘సోచీ’ నగరంలో తొమ్మిది గంటలపాటు మన ప్రధానమంత్రితో కలసి రష్యా అధ్యక్షుడు వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం చిరునవ్వుల పువ్వుల పరిమళ విన్యాసాల ‘అనౌపచారిక’ ప్రదర్శనం. భారత, రష్యా దేశాలు దశాబ్దుల తరబడి గొప్ప మైత్రీ బంధంలో ముడిపడి ఉన్నాయి.

05/22/2018 - 00:25

కృష్ణ గంగానది నీటిపై తనకు లేని హక్కులను సాధించుకొనటానికి పాకిస్తాన్ ప్రభుత్వం పదే పదే అంతర్జాతీయ సంస్థలలో వివాదాలను దాఖలు చేస్తోంది. బ్రహ్మపుత్ర జలాలపై మనకు ఉన్న హక్కులను సాధించుకొనటానికి మన ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోంది, తటపటాయిస్తోంది. బ్రహ్మపుత్ర నదీ జలాలను అక్రమంగా జుర్రేయడానికై చైనా దశాబ్దికిపై రహస్యంగాను, బహిరంగంగాను యత్నిస్తోంది. టిబెట్‌లో బ్రహ్మపుత్రపై ఆనకట్టలను నిర్మిస్తోంది.

05/19/2018 - 00:49

మంద నుంచి కొంతమంది తప్పిపోయారన్నది జరుగుతున్న ప్రచారం. హైదరాబాద్‌లో ఆతిథ్యం పొందుతున్న కర్ణాటక శాసనసభ్యులలో కొందరు చల్లగా జారుకుని ఢిల్లీలో ప్రత్యక్షమయినట్టు శుక్రవారం కొన్ని దూరదర్శన స్రవంతుల - టి.వి.్ఛనల్స్-లో ప్రముఖంగా ప్రసారమయిన ‘‘అతి రహస్యం...’’ కర్నాటకకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ సభ్యులు హైదరాబాద్‌కు చేరినట్టు లేదని కొన్ని ‘స్రవంతుల’వారు ‘‘కనిపెట్టారు...’’!

05/18/2018 - 04:53

ఇజ్రాయిల్ రాజధాని ‘జరూసలం’ గురించి కొనసాగుతున్న జగడం మరోసారి తీవ్రరూపం కావడం పశ్చిమ ఆసియా కల్లోల చరిత్రలో నడుస్తున్న ఘట్టం. అమెరికా ప్రభుత్వం ఇజ్రాయిల్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని టెల్ అవీల్ నుంచి జరూసలం నగరానికి తరలించడం ప్రస్తుతం కల్లోలాలు చెలరేగడానికి కారణం. ప్రాచీన జరూసలం నగరం క్రీస్తునకు పూర్వం అనేక శతాబ్దుల పాటు పాలస్తీనా యూదులకు ఆరాధన కేంద్రం.

05/16/2018 - 23:22

సన్నగిల్లిపోతున్న సంకీర్ణ రాజకీయం మళ్లీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. విధానసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కర్నాటక ప్రాంతంలో నెలకొని ఉన్న విచిత్ర స్థితి ఇందుకు సరికొత్త నిదర్శనం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వలసినన్ని శాసనసభ స్థానాలను ఏ ఒక్క రాజకీయ పక్షం పొందలేకపోవడంతో ‘సాంకర్య వైపరీత్యం’ మరోసారి తొంగి చూస్తోంది!

05/15/2018 - 23:35

ప్రత్యర్థికి ‘అపశకునం’ కలిగించడం కోసం ఒక మహాశయుడు తన ముక్కును తానే కోసుకున్నాడన్నది విచిత్ర ఘటన. ఈ విచిత్ర ఘటన పునరావృత్తం అవుతుండడం కర్నాటకలో కొనసాగుతున్న రాజకీయ నటన.. విధానసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ‘లౌకిక జనతాదళ్’కు, ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికై’ కాంగ్రెస్ తన మద్దతును ప్రకటించడం ఈ రాజకీయ నటన..

05/15/2018 - 00:05

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర, శనివారాలలో జరిపిన నేపాల్ యాత్ర ఉభయ దేశాల సమాన సంస్కృతి పట్ల ధ్యాసను మరింతగా పెంపొందించడానికి దోహదం చేసింది. గత ఇరవై ఏళ్లకు పైగా నేపాల్ రాజకీయ రంగాన్ని చైనా ప్రభావితం చేస్తుండడం మోదీ పర్యటనకు విచిత్రమైన పూర్వరంగం. మనకు శత్రుదేశమైన చైనాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్న రాజకీయవేత్తలు నేపాల్ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తుండడం ఈ ‘పూర్వరంగం’.

05/12/2018 - 23:51

కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘హత్యారాజకీయాలపై’ చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ‘హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు, ఇప్పటికి 25 మంది భాజపా కార్యకర్తలను హతమార్చారు. జాతిపిత మహాత్మ గాంధీ ప్రవచించిన అహింసా సిద్ధాంతం ఏమయింది?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Pages