S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/13/2017 - 06:56

ఇస్లాం మతస్థులకు విద్యా సంస్థలలో, ఉద్యోగాలలో ఆరక్షణల-రిజర్వేషన్స్-ను కల్పించి తీరనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం భీషణ ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తుండడం ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియపై జరుగుతున్న దౌర్జన్యం. మత ప్రాతిపదికపై ఆరక్షణలు కల్పించడం చెల్లదని ఉన్నత న్యాయస్థానం ఇదివరకే అనేకసార్లు స్పష్టం చేసింది. మతం పేరుతో ఆరక్షణలను కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పులు చెప్పింది.

04/12/2017 - 01:09

మన దేశానికి చెందిన కులభూషణ్ జాదవ్ అన్న విశ్రాంత నౌకాదళ అధికారికి పాకిస్తాన్‌లోని సె నిక ‘న్యాయస్థానం’ మరణ దండన విధించడం దౌత్య బీభత్సకాండకు సరికొత్త నిదర్శనం! పాకిస్తాన్ ‘ప్రభుత్వాలు’ చేస్తున్న అసత్య ప్రచారానికి ఇది పరాకాష్ఠ. పాకిస్తాన్‌లోని పౌర ప్రభుత్వం, సైనిక ప్రభుత్వం రెండూ సమాంతరంగా అబద్ధాల కోట కట్టడం జాదవ్ అపహరణకు, హత్యా ప్రయత్నానికి ప్రాతిపదిక.

04/11/2017 - 00:39

‘దీపం పెట్టిన తరువాత దిగనేయడమంటే’ బహుశా ఇదే.. గోరక్షణ పట్ల దేశప్రజల సడలని నిష్ఠ ప్రస్ఫుటిస్తున్న సమయంలోనే గోరక్షకులను అప్రతిష్ఠ పాలు చేయడానికి ‘షడ్యంత్రం’ నడిచిపోతోంది. ఈ షడ్యంత్రపు వలలో ప్రఖర జాతీయతావాదులు సైతం చిక్కుకొని పోతుండడమే సామాన్య ప్రజలకు అంతుపట్టని విచిత్రమైన ప్రహేళిక..

04/10/2017 - 00:46

ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేయడం అనివార్యమన్నది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘నూతన నియమావళి’లోని ప్రధాన ఇతివృత్తం! బాధ్యతను విస్మరించే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనడానికి ‘ని యమావళి’లో వీలు కల్పించారు. దీనివల్ల స్వచ్ఛంద సేవ పేరుతో ప్రభుత్వ నిధులను, ప్రజల విరాళాలను ‘్భంచేస్తున్న’ అక్రమ సంస్థల ‘ఆట’ కట్టుబడిపోగలదు.

04/08/2017 - 07:06

అయోధ్య రామజన్మభూమి ప్రాంగణంలోని ‘బా బరీ కట్టడం’ కూల్చివేతకు సంబంధించిన అభియోగాలను ‘కలసికట్టు’గా ఒకే న్యాయస్థానంలో విచారించాలని సర్వోన్నత న్యాయస్థానం వారు ప్రతిపాదించడం విచిత్రమైన పరిణామం! ఈ ప్రతిపాదన త్వ రలో తీర్పు రూపంలో వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

04/07/2017 - 07:10

స్వతంత్ర టిబెట్ చివరి అధినేత, ధర్మాచార్యుడు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించ డం పట్ల చైనా ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యకరం కాదు. క్రీస్తుశకం 1950వ దశకంలో మన ఉత్తర సరిహద్దుల్లోని స్వతంత్ర దేశమైన ‘టిబెట్’ను ఎలాంటి శ్రమలేకుండా కాజేసిన చైనా, మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా ఆక్రమించడానికి శ్రమిస్తోంది.

04/06/2017 - 08:22

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్, రామ్‌బాణ్ జిల్లాల మధ్య నిర్మించిన సొరంగ మార్గం గుండా వాహనాల రాకపోకలు ప్రారంభం కావడం కశ్మీర్ చరిత్రలో వినూతన అధ్యాయం, జాతీయ సమైక్య ప్రస్థాన పథంలో మరో ప్రగతి పదం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేసిన ఈ తొమ్మిదిన్నర కిలోమీటర్ల సొరంగ మార్గం-రోడ్ టన్నల్- అతి పెద్దది మాత్రమే కాక అత్యంత అధునాతనమైనది.

04/05/2017 - 01:28

నోయిడా ప్రాంతంలో ఆఫ్రికన్లపై దాడులు జరగడం చెదరు మదురు ఘటనలలో ఒకటి. కానీ ఈ దాడులను వర్ణ దురహంకారానికి ప్రతీకగా చిత్రీకరించడానికి ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలు కొన్ని యత్నిస్తుండడం అనభిజ్ఞతకు నిదర్శనం. ఈ ‘అనభిజ్ఞత’- ఇగ్నోరెన్స్- కారణంగానే ఆఫ్రికా దేశాల ప్రభుత్వాల ప్రతినిధులు భారతీయుల స్వభావాన్ని వక్రీకరిస్తున్నారు.

04/04/2017 - 00:17

జాతీయ, ప్రాంతీయ రహదారులకు ఇరువైపులా కంపుకొట్టిన మద్యం దుకాణాలు మూతపడడం స్వచ్ఛ భారత పునర్ నిర్మాణానికి దోహదం చేయగల పరిణామం! ప్రభుత్వాలు చేయలేని పనిని సర్వోన్నత న్యాయస్థానం చేసి చూపించడం న్యాయ వ్యవస్థ ‘క్రియాశీలత’-జుడీషియల్ యాక్టివిజమ్-కు సరికొత్త సాక్ష్యం!

04/03/2017 - 00:18

గుజరాత్ శాసనసభ తాజాగా ఆమోదించిన ‘పశుగణ పరిరక్షణ సవరణ బిల్లు’ విజ్ఞత విస్తరిస్తోందనడానికి నిదర్శనం. ఆవును హత్యచేసే నేరస్థులకు పదునాలుగేళ్ల కారాగృహ నిర్బంధ శిక్షను విధించడానికి ఈ బిల్లు వీలుకల్పిస్తోంది! క్రీస్తుశకం 2011వ సంవత్సరంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన ‘పశుగణ పరిరక్షణ’ సవరణ చట్టం ప్రకారం గోవును వధించే నేరస్థులకు మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్షను విధించడానికి వీలుంది.

Pages