S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/05/2017 - 07:45

న్యాయవ్యవస్థను నవ్వులపాలు చేయడానికి క లకత్తా ఉన్నత న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ ప్రదర్శిస్తున్న ప్రహసనం ఎన్ని రోజులుపాటు కొనసాగుతుందన్నది అంతుపట్టని సందేహం! నిర్భయంగా, నిర్లజ్జగా అనేక నెలలపాటు సర్వోన్నత న్యాయస్థానాన్ని ధిక్కరిస్తున్న కర్ణన్ మొత్తం రా జ్యాంగ వ్యవస్థను వెక్కిరిస్తున్నాడు!

05/04/2017 - 07:02

హైదరాబాద్‌లో జూన్ రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మాతృభాషాభిమానులకు ఆపాత మధురం! జంటనగరాలలోని వందలాది పాఠశాలలలో చదువుతున్న తెలుగు విద్యార్థులలో అత్యధికులకు తెలుగు అక్షరాలు రాని విచిత్ర స్థితి ఏర్పడి ఉండడం తెలుగు కోసం పరితపిస్తున్న వారికి కలవరం కలిగిస్తున్న కఠోర వాస్తవం! ఈ స్థితిలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగిస్తున్న పరిణామం.

05/03/2017 - 04:08

అతగాడు మొదట జిహాదీ ఉగ్రవాది, ఆ తరువాతనే పాకిస్తానీ ప్రధాని.. పేరు నవాజ్ షరీఫ్, స్వభావం పైశాచిక తత్త్వం! నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పౌర ప్రభుత్వానికి 2013లో మళ్లీ అధినేత అయిన తరువాత ‘జిహాద్’ సిద్ధాంతాన్ని మరింత పాశవిక నిష్ఠతో అమలు జరుపుతున్నాడు. పాకిస్తాన్ సైనికులు సోమవారం ఇద్దరు భారతీయ సైనికులను హత్యచేసి మృతదేహాల తలలు నరకడం ఈ జిహాదీ బీభత్సకాండలో భాగం!

05/02/2017 - 00:40

‘వాల్‌మార్ట్’ సంస్థ తెలంగాణలో పది కొత్త దుకాణాలను ప్రారంభించనున్నదట. అందువల్ల అమెరికాకు చెందిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం వెళ్లగొట్టలేదన్నది ఇప్పటికి స్పష్టంగా నిర్ధారణ అయింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోను ఘరానా ‘చిల్లర’ దుకాణాలను నడిపిస్తున్న ‘వాల్‌మార్ట్’ అతి పెద్ద అంతర్జాతీయ ‘కిరాణా దుకాణాల సమాఖ్య’గా పేరు మోసింది. అతి పెద్ద అవినీతి సామ్రాజ్యంగా ఈ సంస్థ అవతరించడం సమాంతర విపరిణామం.

05/01/2017 - 01:03

మిరపకాయలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో సహనం కోల్పోయిన అన్నదాత కదనవదనుడయ్యాడు, కడుపు కృషీవలుడు కార్చిచ్చుగా మారాడు. ఈ దవాగ్ని ఖమ్మంలోని టోకు విపణి ప్రాంగణంలోకి దూకడం మిక్కిలి దురదృష్టకరం. హింసాకాండను నిరసించడం నాగరిక లక్షణం, ప్రభుత్వ విధి. అందువల్ల ఖమ్మం ‘మార్కెట్’లో ‘రైతులు’ మిరప కాయల పొగపెట్టడం ప్రభుత్వం అభిశంసనకు గురవుతోంది!

04/29/2017 - 00:46

‘కూర్చొని తింటూ ఉంటే కొండలైనా కరిగిపోతాయన్న’ది జీవన వ్యవహారం. హిమాలయ పర్వతశ్రేణి కరగిపోతుండడం వేడిమి వ్యవహారం! కాలుష్యాన్ని భోంచేస్తున్న ప్రకృతి దాన్ని జీర్ణించుకోలేక వేడిమిని వెళ్లగక్కుతోంది. ఈ వేడిమి హిమాలయ పర్వతశ్రేణిని కరగించి వేస్తూండడం దశాబ్దులుగా వేధిస్తున్న సమస్య. ‘హిమాలయ నగాధిరాజు’నే కరగించి వేస్తున్న వేడిమి జన జీవనాన్ని కదిలించి వేయడంలో, కల్లోల పరచడంలో ఆశ్చర్యం లేదు.

04/28/2017 - 00:27

చైనాను చూసి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందని వివిధ ముఖ్యమంత్రులు, రాజకీయవేత్తలు తరచు మనకు ఉద్బోధ చేస్తున్నారు. మన దేశాన్ని 1962లోను, అంతకు ముందు కూడా దురాక్రమించిన శత్రుదేశమైన చైనాను ప్రశంసించడం మన రాజకీయ వేత్తలకు మాత్రమే ప్రత్యేకం! మరే దేశంలోను ఈ వైచిత్రి లేదు! అయితే చైనాను ప్రశంసిస్తున్న ఈ రాజకీయ మహాజనులు నేర్చుకోదగిన మహా విషయం ఉంది.. మావోయిస్టు సాయుధులను చైనా ఉసిగొల్పుతోందన్నది ఈ మహావిషయం!

04/27/2017 - 04:04

వ్యవసాయం వల్ల లభించే ఆదాయంపై పన్ను వసూలు చేయాలని ‘నీతి ఆయోగ్’ కోరుతుండడం జాతీయ ఆర్థిక నీతికి దాపురించిన ‘ప్రపంచీకరణ’ ప్రభావ ఫలితం! వ్యవసాయ రంగం ‘ప్రపంచీకరణ’కు బలి కాకుండా నిరోధించాలన్న స్వదేశీయ ఉద్యమం ఒక వైపున నడుస్తోంది. మరో వైపున మన వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ‘ప్రపంచీకరణ’ శక్తుల కుతంత్రం కొనసాగుతూనే ఉంది.

04/26/2017 - 05:41

లోక్‌సభకు రాష్ట్రాల శాసనసభలకు ఒకే సమయంలో ఎన్నికలు జరిపించాలన్న ‘ఆదర్శం’ అనేక ఏళ్లుగా ప్రచారం అవుతోంది. ఆదివారం దేశ రాజధానిలోని రాష్టప్రతి భవనంలో జరిగిన ‘నీతిఅయోగ్’ సమావేశంలో ఈ ఆదర్శం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన ఈ ‘ఏకకాలంలో ఎన్నికల’ ఆదర్శాన్ని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడ బలపరచడంతో ‘్ధ్యస’ మరింత విస్తరించింది.

04/25/2017 - 07:02

పరస్పరం సంబంధం లేనట్టు కనిపిస్తున్న బీభత్స ఘటనలు ‘అంతర్జాతీయ ఉగ్రవాదం’లో భాగమన్నది వర్తమాన వాస్తవం. ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ తండాలు సైనిక స్థావరంపై దాడిచేసి దాదాపు నూట నలబయి మంది సైనికులను హత్య చేయడం సరికొత్త దుర్ఘటన! ఈ దుర్ఘటన గురించి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న తరుణంలోనే మరో పైశాచిక కాండ జరిగింది.

Pages