S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

02/27/2017 - 00:20

అమెరికాలోని కెన్‌సాస్ రాష్ట్రంలో ఓలిత్ నగరంలో పనిచేస్తుండిన కూచిభొట్ల శ్రీనివాస్ అనే భారతీయుడిని ఒక శే్వత వర్ణ దురహంకారి కాల్చి చంపడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఉసిగొల్పే విధానాలకు నిదర్శనం.

02/25/2017 - 00:07

మన వ్యవసాయ రంగంలోని అసంతులనానికి, అస్థిరత్వానికి ఇది మరో నిదర్శనం. అంతర్గత వైరుధ్యాలు పదే పదే ప్రస్ఫుటిస్తున్నాయి. దేశంలో 2016-2017 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నది ఆధికారిక నిర్థారణ. ఆంధ్రప్రదేశ్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోను దుర్భిక్షం వల్ల రైతులు, వ్యవసాయ శ్రామికులు సొంత ఊళ్లను వదలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నది సమాంతర నిర్థారణ!

02/24/2017 - 00:42

ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో ఎవరు విజయం సాధించగలరన్నదానికి మహారా ష్ట్ర నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు పూర్వ సూచికలు! మిగిలిన రాజకీయ పక్షాల సంగతి ఎలా ఉన్నప్పటికీ భారతీయ జనతాపార్టీ వారు మాత్రం దీన్ని విశ్వసిస్తున్నారు. మహారాష్ట్ర నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికలలో భాజపాకు లభించిన విజయాలు ఇందుకు ప్రాతిపదిక!

02/23/2017 - 05:26

మన దేశంలో మానవ అధికారాలకు భంగం వాటిల్లుతోందని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’-అంతర్జాతీయ మానవీయ సంస్థ-బుధవారం ప్రకటిండం మన దేశానికి వ్యతిరేకంగా అమలు జరుగుతున్న కుట్రలో భాగం! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు, విదేశాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థలు-నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్-ఎన్‌జిఓస్- పాశ్చాత్య దేశాల మతం మార్పిడి ముఠాలు, వీటి వెనుక ఉన్న సంపన్న దేశాల ప్రభుత్వాలు ఈ కుట్రను కొనసాగిస్తున్నాయి.

02/22/2017 - 00:37

మన ఎన్నికలు జరుగుతున్న తీరు మన ప్రజల సమష్టి నైతిక నిష్ఠకు సూచికలు. ఈ వాస్తవాన్ని ఆధికారికంగా ధ్రువపరచలేక పోవచ్చు. అక్షరాస్యత పెరగడం వల్ల, ఉన్నత విద్యావంతుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమష్టి నైతిక నిష్ఠ మెరుగుపడుతుందా? మరింత దిగజారిపోయిందా? అన్న మీమాంసకు సైతం మన ఎన్నికలు కాలం నిలబెడుతున్న కొలమానాలు!

02/21/2017 - 00:53

దక్షిణాసియా ప్రాంతంలో భారత్‌కు ఉన్న తిరుగులేని స్థానానికి ఇండోర్‌లో జరిగిన పార్లమెంట్ స్పీకర్ల సదస్సే నిదర్శనం. ఈ ప్రాంతంలోని దేశాల్లో అన్ని విధాలుగా అగ్రగామిగానే కాకుండా భిన్న రంగాల్లో ప్రగతి సమతూకాన్ని సాధించి అందరికీ ఆదర్శనీయమైన దేశంగానూ భారత్ కొనసాగుతోందని చెప్పడానికి దృష్టాంతాలెన్నో.. ఇతర దేశాలకు మార్గ నిర్దేశన చేసే దేశాలకు స్ఫూర్తిదాయక రీతిలో వ్యవహరించగలిగే శక్తియుక్తులు ఉండాలి.

02/20/2017 - 07:16

నిప్పుకు చెదలు పట్టడం అసంభమైన వ్యవహారం. నిప్పు పవిత్రతకు చిహ్నం, అగ్ని పంచభూతాలలో ఒకటి. భారతీయ న్యాయవ్యవస్థ నిప్పు వంటిదన్నది ప్రజల విశ్వాసం. నేరప్రవృత్తిని కాల్చి సామాజిక సౌశీల్యాన్ని నిరంతరం పరిరక్షించి పెంపొందిస్తున్న రాజ్యాంగ విభాగం న్యాయ వ్యవస్థ. న్యాయవ్యవస్థకు ‘అక్రమ ప్రవర్తన’ అన్న చెదలు అంటదు, అంటరాదు.

02/17/2017 - 23:55

ధైర్యం పుంజుకున్న జిహాదీల మిత్రులు, పాకిస్తాన్ తొత్తులు జమ్మూ కశ్మీర్‌లో భద్రతాదళాలపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు శుక్రవారం ప్రసార మాధ్యమాలలో మరోసారి ఆవిష్కృతమయ్యాయి. ఇలా ఈ దేశద్రోహులు ధైర్యం పుంజుకొనడానికి కారణం కశ్మీర్‌లోయ ప్రాంతంలోని కొందరు రాజకీయ వేత్తలు, వారికి మద్దతుగా చేస్తున్న ప్రకటనలు!

02/16/2017 - 01:23

భారతీయ శాస్త్ర విజ్ఞానం అంతరిక్షంలో అనంతంగా విస్తరిస్తుండడం ధ్రువ సమాంతర ఉపగ్రహ ప్రయోగ విజయానికి చారిత్రక నేపథ్యం! అంతరిక్ష విజ్ఞాన ప్రస్థాన పథంలో సహస్రాబ్దులపాటు అగ్రగామిగా ఉండిన మన దేశం గత కొన్ని శతాబ్దాలుగా వెనుకబడిపోయింది! మళ్లీ మన దేశం అంతరిక్ష పరిశోధన పథంలో ‘కథాకథిత’ అగ్రరాజ్యాలతో పోటీపడుతుండడం బుధవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిముషాలకు ఆవిష్కృతమైన అద్భుతం.

02/15/2017 - 01:20

ఇంత త్వరగా శశికళ రంగు తేలిపోవడం తమిళ రాజకీయాలలో కొనసాగుతున్న వేగ పరిణామక్రమానికి పరాకాష్ఠ. మంగళవారం ఉదయం వరకూ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి తీరుతానని గర్జించిన వి.కె.శశికళా నటరాజన్ మధ్యాహ్నం తిరగకముందే కోరలు ఊడిన తోడేలు వలె కూలబడిపోవడం ఊహించడానికి వీలుకాని సంఘటనా పరంపరలో సరికొత్త ఘట్టం!

Pages