S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/27/2017 - 00:42

మియామీ, మార్చి 26: ఇక్కడ జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ప్రీ క్వార్టర్స్ చేరాడు. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించి, కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్‌ను అందుకొని, ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరిన అతను రెండో రౌండ్‌లో ఫ్రానె్స టిఫోను 7-6, 6-3 తేడాతో ఓడించి ముందంజ వేశాడు.

03/27/2017 - 00:40

హామిల్టన్, మార్చి 26: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 314 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆటకు వర్షం కారణంగా ఆటంకం కలగ్గా, 41 ఓవర్లు మాత్రమే బౌల్‌కాగా, దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 123 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి 89.2 ఓవర్లలో ఆలౌటైంది.

03/27/2017 - 00:40

మెల్బోర్న్, మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను సాధించిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ ఈ సీజన్‌లో బోణీ కొట్టాడు. ఈ సీజన్‌లో మొత్తం 20 రేసులు జరగనుండగా, వాటిలో మొదటిదైన ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీలో ప్రపంచ చాంపియన్, మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపుచ్చుకున్నాడు. 57 ల్యాప్స్‌ను ఒక గంట, 24.11 నిమిషాల్లో పూర్తి చేసిన వెటల్‌కు 25 పాయింట్లు లభించాయి.

03/27/2017 - 00:38

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 26: దేవధర్ ట్రోఫీ పోటీల్లో ఇండియా ‘బి’ జట్టు జోరు కొనసాగుతోంది. తొలిమ్యాచ్‌లో ఇండియా ‘ఎ’పై 23 పరుగుల ఆధిక్యతతో గెలుపొందిన ఇండియా ‘బి’ రెండో మ్యాచ్‌లో తమిళనాడు జట్టును 32 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్‌లోకి దూసుకువెళ్లింది. బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్న ఇండియా ‘బి’, ఈ మ్యాచ్‌లో కూడా అదే ఊపుతో 316 పరుగుల స్కోరును నమోదు చేసింది.

03/26/2017 - 08:16

నాలుకు వికెట్లు కూల్చిన స్పిన్నర్ కుల్దీప్
సెంచరీతో స్టీవెన్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్

03/26/2017 - 08:15

ధర్మశాల: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సీజన్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ 2007-08 సీజన్‌లో 78 వికెట్లు సాధించి, రికార్డు పుటల్లోకి ఎక్కగా, అశ్విన్ ఈ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూల్చడం ద్వారా 79వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకొని ఈ సీజన్‌లో (2016-17) ఆ రికార్డును అధిగమించాడు.

03/26/2017 - 08:13

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 25: పరుగుల వరద పారిన దేవధర్ ట్రోఫీ తొలిరోజు మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’పై, ఇండియా ‘బి’ 23 పరుగుల తేడాతో గెలిచింది. రెండు జట్లు ధాటిగా ఆడి 300 పరుగుల స్కోర్లను అధిగమించడంతో పోటీ రసవత్తరంగా సాగింది.

03/26/2017 - 08:13

ధర్మశాల: భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తాడు. భుజం గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయిన అతను మ్యాచ్ ఆరంభమైన సుమారు అరగంటలోనే మైదానంలోకి పరుగులు తీశాడు. సహచరులకు డ్రింక్స్‌ను అందించాడు. రాంచీలో జరిగిన మూడో టెస్టు మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ గాయపడిన విషయం తెలిసిందే. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగినప్పటికీ, అతను తనదైన శైలిలో ఆడలేకపోయాడు.

03/26/2017 - 08:12

ధర్మశాల: భారత దేశంలో పర్యటిస్తూ, ఒక సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన రెండో విదేశీ కెప్టెన్‌గా స్టీవెన్ స్మిత్ గుర్తింపు పొందాడు. 2012-13 సీజన్‌లో అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టర్ కుక్ మొదటిసారి ఒక సీజన్‌లో మూడు సెంచరీలు చేయగా, ఈ సీజన్‌లో స్మిత్ మూడో శతకాన్ని సాధించాడు.

03/25/2017 - 01:58

రాంచీ మాదిరిగానే ధర్మశాల కూడా ఒక టెస్టుకు మొట్టమొదటిసారి ఆతిథ్యమిస్తోంది. సహజంగా వనే్డ, లేదా టి-20 ఫార్మాట్స్‌లో మొదటి సెషన్‌కు, రెండో సెషన్‌కు తేడా ఉంటుంది. పిచ్ తీరు మారిపోతుంది. ఇక టెస్టుల గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఐదు రోజుల ఆటలో ఏ సమయంలో ఎవరికి సహకరిస్తుందో ఊహించడం కష్టం. ఈ వేదికపై ఆడుతున్న తొలి టెస్టు ఇదే కావడంతో, పిచ్ తీరుతెన్నులపై ఇరు జట్లు అంచనా వేయలేకపోతున్నాయి.

Pages