S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/18/2017 - 01:13

రాంచీ, మార్చి 17: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ వికెట్‌ను సాధించలేకపోయినా, అటు ప్రేక్షకులను, ఇటు కామెంటేటర్లను ఆకర్షించాడు. 20 ఓవర్లు బౌల్ చేసిన అతను 70 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే, తన చిత్రవిచిత్ర హావ భావాలతో అందరి దృష్టిలో పడ్డాడు.

03/18/2017 - 01:11

ఇండియన్ వెల్స్, మార్చి 17: ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ దూకుడుకు ఎలెనా వెస్నినా బ్రేక్ వేసింది. క్వార్టర్ ఫైనల్‌లో తన కంటే రెండు ర్యాంకులు మెరుగైన స్థానంలో ఉన్న వీనస్‌ను 14వ ర్యాంకర్ వెస్నినా 6-2, 4-6, 6-3 తేడాతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఫైనల్‌లో చోటు కోసం ఆమె మ్లాడెనొవిచ్‌ను ఢీ కొంటుంది.

03/18/2017 - 01:09

ఐర్లాండ్‌తో శుక్రవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌లో 101 పరుగులు సాధించిన అఫ్గానిస్తాన్ జట్టు కెప్టెన్ అజ్గర్ స్టానిక్‌జయ్. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ 338 పరుగులకు ఆలౌట్‌కాగా, చివరి వరకూ పోరాడిన ఐర్లాండ్ 47.3 ఓవర్లలో 304 పరుగులకు పరిమితమై, 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది

03/18/2017 - 01:07

న్యూఢిల్లీ, మార్చి 17: ఇటీవల సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృ చెందిన సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. శుక్రవారం 27వ ఏట అడుగుపెట్టిన ఆమె ఒక్కో కుటుంబానికి యాభై వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు లక్షల రూపాయలను ఆయా కుటుంబాలకు అందచేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

03/18/2017 - 01:06

కొలంబో, మార్చి 17: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ అద్భుతమైన సెంచరీతో కదంతొక్కగా, బంగ్లాదేశ్ 467 పరుగులు సాధించగలిగింది. అంతకు ముందు శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు కట్టడి చేసిన బంగ్లాదేశ్‌కు 129 పరుగుల ఆధిక్యం లభించింది.

03/18/2017 - 01:05

వెల్లింగ్టన్, మార్చి 17: న్యూజిలాండ్‌తో జరుగు న్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 81 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 268 పరుగులకు సమాధానంగా, రెండు వికెట్ల నష్టానికి 24 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతోరెండో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్లకు 349 పరుగులు సాధించింది.

03/18/2017 - 01:05

రాంచీ, మార్చి 17: టీమిండియాపై భారత్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవెన్ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు మైఖేల్ క్లార్క్ చెన్నైలో 130 పరుగులు సాధించగా, స్మిత్ ఈ మ్యాచ్‌లో 178 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేగాక, భారత్‌లో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా కూడా అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.

03/17/2017 - 01:18

రాంచీ, మార్చి 16: భారత్‌తో గురువారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సూపర్ సెంచరీ సాధించి, క్రీజ్‌లో నిలవగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్లకు 299 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 పరుగుల స్కోరువద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది.

03/17/2017 - 01:14

చక్కటి హుక్ షాట్‌తో అభిమానులను అలరిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లేన్ మాక్స్‌వెల్. అతను సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను చివరిసారి 2014లో యుఎఇలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాడు. కాగా, మాక్స్‌వెల్‌కు కెరీర్‌లో ఇది కేవలం ఐదో టెస్టు.

03/17/2017 - 01:12

రాంచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజానికి గాయమైంది. ఆస్ట్రేలియాతో గురువారం మొదలైన మూడో టెస్టు, మొదటి రోజున, భోజన విరామం తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ఒక బౌండరీని ఆడేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో నేలపై బలంగా పడడంతో, అతని భుజానికి దెబ్బ తగిలింది. నొప్పి భరించలేక అల్లాడిన అతను కొంత సేపు ఐస్ ప్యాక్‌లతో ఉపశమనం పొందిన అతను ఆతర్వాత వైద్య పరీక్షలకు హాజరయ్యాడు.

Pages