S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/13/2019 - 22:41

సౌతాంప్టన్, మే 13: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ లియామ్ ప్లంకెట్‌పై వచ్చిన బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. పాకిస్తాన్‌తో ఇక్కడ జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్లంకెట్ బంతిని చేతి గోర్లతో గట్టిగా రుద్దినట్టు విమర్శలు వచ్చాయి. తద్వారా బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

05/13/2019 - 02:41

హైదరాబాద్ : ముంబయి ఇండియన్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నాలుగోసారి నిలిచింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా ఉప్పల్ మైదానంలో జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబయి జట్టు 7 వికెట్లు కోల్పోయ 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది.

05/13/2019 - 02:40

హైదరాబాద్ :

05/13/2019 - 02:51

హైదరాబాద్, మే 12: చివరి క్షణం వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం ఒక పరుగు తేడాతో ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగి, 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసిన ముంబయి, ఆతర్వాత అంత సాధారణమైన స్కోరును కూడా రక్షించుకోగలిగింది.

05/12/2019 - 23:41

న్యూఢిల్లీ, మే 12: ధనాధన్ క్రికెట్‌లో ప్రేక్షకులకు ఐపీఎల్ పంచే పరుగుల విందు అంతింత కాదు. ఈ పొట్టి ఫార్మాట్‌లో జట్టేదైనా అభిమానులు కోరుకునేది అదే. తమ అభిమాన క్రికెటర్లు కొట్టే ప్రతి బౌండరీని రికార్డుల్లో చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు, సిక్సర్లు, వేగవంతమైన సెంచరీ, అర్ధ సెంచరీలను ఒక్కసారి పరిశీలిద్దాం..

05/12/2019 - 23:40

సౌతాంప్టన్, మే 12: జొస్ బట్లర్ అజేయ శతకంతో రాణించి, పాకిస్తాన్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. బట్లర్ 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా మంచి ఫామ్‌ను కొనసాగించి 71 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

05/12/2019 - 23:38

మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్‌కు షాకిచ్చిన గ్రీస్ ఆటగాడు స్ట్ఫోనొస్ సిట్సిపాస్. తీవ్రంగా పోరాడిన నాదల్‌ను అతను 6-4, 2-6, 6-3 ఆధిక్యంతో ఓడించి ఫైనల్ చేరాడు. టైటిల్ కోసం ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌తో సిట్సిపాస్ ఢీ కొంటాడు.

05/12/2019 - 23:36

మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ రన్నరప్ సిమోనా హాలెప్ (ఎడమ)తో విజేత కికీ బెర్టెన్స్. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె హాలెప్‌ను 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టైటిల్ సాధించింది.

05/12/2019 - 23:42

వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో జరిగిన ఐబీఎఫ్, డబ్ల్యూబీఏ, ఐబీఓ సూపర్ వెల్టర్ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాలెంజర్ జారెట్ హర్డ్‌ను ఓడించి, టైటిల్ దక్కించుకున్న జూలియన్ విలియమ్స్ ఆనందం. ప్యానెల్ మొత్తం ఏకగ్రీవంగా విలియమ్స్‌ను విజేతగా ప్రకటించింది.

05/12/2019 - 04:18

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. నేడు హైదరాబాద్ వేదికగా ఉప్పల్ మైదా నంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ చాంపియన్ ముంబయ ఇండి యన్స్ తలపడనున్నాయి. ముంబైతో జరిగి మొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓడిన చెన్నై, ఢిల్లీతో జరిగిన రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
వెంటాడుతున్న ఓటమి..

Pages