S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/13/2018 - 16:58

న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్ ప్రపంచ కప్ అండర్-20 విభాగంలో 400 మీటర్ల ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెటిక్ హిమాదాస్‌ను ప్రధాని మోదీ అభినందించారు. 400 మీటర్ల విభాగంలో అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన హిమాదాస్ ప్రపంచస్థాయి పోటీల్లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా రికార్డులకు ఎక్కింది.

07/13/2018 - 03:52

మాస్కో :వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఈసారి ఫైనల్ చేరే అవకాశం ఉన్న ఇంగ్లాండ్‌ను క్రొయేషియా సెమీ ఫైనల్‌లో ఓడించడం ఒక అద్భుతంగా కనిపించింది. చివరి క్షణాల్లో మారియో మాడ్జుకిక్ చేసిన గోల్ క్రొయేషియాను తుది పోరుకు చేర్చింది. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకూ ఇరు జట్లు గొప్పగా పోరాటం సాగించాయి. అయితే, ఇంగ్లాండ్ అవసరాన్ని మించిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, పరాజయాన్ని మూటగట్టుకుంది.

07/12/2018 - 23:33

లండన్, జూలై 12: ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్‌లో ఎవరూ ఊహించని విధంగా క్రొయేషియా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్రీడాకారులకు అభిమానులు జేజేలు పలుకుతున్నారు. వరల్డ్ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ, అసాధారణ ప్రతిభ కనబరచి సెమీ ఫైనల్ వరకూ చేరడమే అద్భుతమని ప్రశంసిస్తున్నారు.

07/12/2018 - 23:30

క్రొయేషియా చేతిలో ఓటమిపాలై, వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్ నుంచి వెనుదిరిగామన్న బాధలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు

07/12/2018 - 23:28

మాస్కో, జూలై 12: ఫిపా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఫార్వార్డ్ క్రొయేషియా ఆటగాడు మారియో మాడ్జుకిక్ రాత్రికి రాత్రే ఒక్కసారే హీరో అయిపోయాడు. ఇక క్రొయేషియా జట్టు విషయానికి వస్తే...నాలుగు మిలియన్లు (దాదాపు 40 లక్షలు) జనాభా కలిగిన ఈ చిన్నదేశం తొలిసారిగా ప్రపంచ కప్ చరిత్రలో ఫైనల్‌కు చేరుకుంది.

07/12/2018 - 23:26

బ్యాంకాక్, జూలై 12: ఒలింపిక్ రజత పతక విజేత, ప్రపంచ మూడో సీడ్, భారత షట్లర్ పీవీ సింధు ఇక్కడ జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో హాంకాంగ్‌కు చెందిన ఇప్ పుయ్ ఇన్‌ను 21-16, 21-14 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్స్‌లో చోటు కోసం శుక్రవారం అమెరికా క్రీడాకారిణి సోనియా చీహ్‌తో తలపడుతుంది.

07/12/2018 - 23:24

లండన్, జూలై 12: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో జర్మనీ క్రీడాకారిణి ఏంజిలిక్యు కెర్బర్ తన ప్రత్యర్థి, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ జెలెనా ఒస్తాపెంకోను 6-3, 6-3తో ఓడించింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒస్తాపెంకో ఏకోశానా కెర్బర్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

07/12/2018 - 23:24

లండన్, జూలై 12: జువాన్ డెల్ పొట్రో ప్రతిభావంతుడని, ఎంతటి ఆటగాళ్లనైనా నిలువరించే శక్తిసామర్థ్యాలు అతనికి ఉన్నాయని ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కితాబునిచ్చాడు.

07/12/2018 - 23:19

మాస్కో, జూలై 12: ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో క్రొయేషియా జట్టు ఆటగాళ్లు గెలుపు సంబరాలను జరుపుకుంటున్న తరుణంలో వారిమధ్యకు దూసుకువచ్చిన ఫొటోగ్రాఫర్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మ్యాచ్ అదనపు సమయంలోని 109వ నిమిషంలో క్రొయేషియా ఫార్వార్డ్ ఆటగాడు మారియో మాడ్జుకిక్ గోల్ చేసి తమ జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.

07/12/2018 - 01:10

లండన్, జూలై: వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో స్టార్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో స్టార్ క్రీడాకారుడు నవోక్ జొకోవిచ్ ఘన విజయం సాధించాడు.

Pages