S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/22/2019 - 23:30

దక్షిణాఫ్రికా సూపర్ ఫాస్ట్ బౌలర్ మఖయా ఎన్టినీని 1999 వరల్డ్ కప్ సమయంలో దురదృష్టం వెంటాడింది. తొలు త ప్రకటించిన జట్టులో అతనికి స్థానం లభించింది. అయితే, ఒక పోలీస్ స్టేషన్‌లో అతడిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో, సెలక్టర్లు 1999 ఏప్రిల్ 23న జట్టు నుంచి అతనిని తప్పించారు. ఆ స్థానాన్ని అలాన్ డాసన్‌తో భర్తీ చేశారు. కానీ, వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత, ఎన్టినీని నిర్దోషిగా ప్రకటించారు.

05/22/2019 - 23:28

ప్రపంచ కప్‌లో కనీసం 20 ఇన్నింగ్స్ ఆడడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే, అత్యుత్తమ రన్‌రేట్ ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) ఖాతాలో చేరుకుతుంది. 2007-2015 మధ్యకాలంలో, మూడు వరల్డ్ కప్ టోర్నీల్లో అతను సగటున 63.52 పరుగులు సాధించాడు.

05/22/2019 - 23:26

వరల్డ్ కప్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌కు దక్కింది. 1992 నుంచి 2011 మధ్య కాలంలో ఆరు వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన సచిన్ మొత్తం 2,278 పరుగులు సాధించాడు. 1,743 పరుగులతో రికీ పాంటింగ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, ఒక వరల్డ్ కప్ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ పేరిట ఉంది. 2003 వరల్డ్ కప్‌లో అతను 673 సాధించాడు.

05/22/2019 - 23:23

చిత్రం... ఈ నెల 30న జరిగే ప్రపంచకప్ టోర్నీ కోసం బుధవారం ఉదయం ఇంగ్లాండ్‌కు బయల్దేరి వెళ్తున్న టీమిండియా ఆటగాళ్లకు ముంబయ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు

05/22/2019 - 23:19

లండన్ మే 22: కెమెరా ముందు ఎవరూ చెప్పరు కానీ.. నేనంటే బౌలర్లకు భయమేనని యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ స్టార్ బ్యాట్‌మన్ క్రిస్ గేల్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాణించడంతో ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న గేల్‌ను ఆ తర్వాత బోర్డు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించిన విషయం తెలిసిందే.

05/22/2019 - 23:17

ముంబయ, మే 22: మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌కు టీమిండియా సన్నద్ధమైంది. ఈ మెగా టోర్నీ కోసం బుధవారం ఉదయం 4.30 గంటలకు 15 మంది సభ్యలు, కోచ్, సహాయక సిబ్బంది తో కలిసి ముంబయ ఛత్రపతి శివాజీ అంతర్జా తీయ విమానాశ్ర యం నుంచి ఇంగ్లాండ్‌కు బయల్దేరిన భారత జట్టు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం లండన్ కు చేరుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.

05/22/2019 - 23:15

న్యూఢిల్లీ, మే 22: కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టును గెలిపించలేడని, జట్టులోని అం తా శ్రమిస్తేనే విజయాలు, టైటిల్ సాధించడం సాధ్యమవుతాయని భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు.

05/21/2019 - 22:45

కౌంట్‌డౌన్ -8

05/21/2019 - 22:39

ఒకప్పటి వెస్టిండీస్ క్రికెట్ జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి జట్టు పరిస్థితిని ఎంత చెప్పినా ఎక్కువే. బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించే సూపర్ ఫాస్ట్ బౌలర్లు, ఎలాంటి బౌలింగ్‌నైనా చితకబాది పరుగులు కొల్లగొట్టే మేటి హిట్టర్లు ప్రస్తు తం వెస్టిండీస్ జట్టులో లేరు.

05/21/2019 - 22:37

న్యూఢిల్లీ, మే 21: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 22న బీసీసీఐ ఎన్నికలు నిర్వహించనున్న ట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధి కారులు తెలిపారు.

Pages