S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/15/2017 - 01:02

పల్లేకల్, ఆగస్టు 14: భారత్ తొలి ఇన్నింగ్స్: 122.3 ఓవర్లలో ఆలౌట్ 487 (శిఖర్ ధావన్ 119, లోకేష్ రాహుల్ 85, విరాట్ కోహ్లీ 42, రవిచంద్రన్ అశ్విన్ 31, హార్దిక్ పాండ్య 108, విశ్వ ఫెర్నాండో 2/87, లక్షన్ సండాకన్ 5/132, మలింద పుష్పకుమార 3/82.

08/15/2017 - 01:00

న్యూఢిల్లీ, ఆగస్టు 14: కెనడాతో వచ్చేనెల జరిగే డేవిస్ కప్ మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టులో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు చొటు దక్కలేదు. ఇప్పుడు బద్ధ శత్రువుగా మారిన ఒకప్పుడు అతని డబుల్స్ భాగస్వామి మహేష్ భూపతి భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీనితో 44 ఏళ్ల పేస్‌కు కష్టాలు మొదలయ్యాయి.

08/15/2017 - 01:00

బార్సిలోనా, ఆగస్టు 14: స్పానిష్ సూపర్ కప్‌లో బార్సిలోనాపై రియల్ మాడ్రిడ్ విజయంలో కీలక భూమిక పోషించిన క్రిస్టియానో రొనాల్డోపై పది మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడింది. చిరకాల ప్రత్యర్థి బార్సిలోనాను 3-1 తేడాతో రియల్ మాడ్రిడ్ ఓడించిన ఆ మ్యాచ్‌లో అతను అనుచితంగా ప్రవర్తించాడు. షర్టు విప్పి, బార్సిలోనా ఆటగాళ్లను హేళన చేశాడు. బార్సిలోనా డిఫెండర్ సామ్యూల్ అమ్‌టిటీపై దాడికి ప్రయత్నించాడు.

08/15/2017 - 00:59

గంగాంప్ (ఫ్రాన్స్), ఆగస్టు 14: ఇటీవలే రికార్డు ధరకు బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జెర్మయిన్ (పిఎస్‌జి)కి ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిన సాకర్ సూపర్ స్టార్ నేమార్ తన కొత్త జట్టు తరఫున శుభారంభం చేశాడు. ఫ్రెంచ్ లీగ్‌లో భాగంగా గంగాంప్‌తో జరిగిన మ్యాచ్‌లో పిఎస్‌జి 3-0 తేడాతో విజయం సాధించగా, నేమార్ ఒక గోల్ చేశాడు. తన సహచరుడు గోల్ చేయడానికి సహకరించాడు.

08/15/2017 - 00:59

యార్క్‌షైర్, ఆగస్టు 14: రోడ్లీ క్రికెట్ క్లబ్‌కు కొత్త గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. అక్కడ శిక్షణ పొందుతున్న జూనియర్ స్థాయి ఆటగాళ్లు 24 గంటల్లో 2,000 ఓవర్లు బౌల్ చేశారు. గతంలో, ఎనిమిది గంటల సమయంలో 734 ఓవర్లు బౌల్ చేసి రికార్డు సృష్టించిన రోడ్లీ క్లబ్ ఈసారి ఒక రోజులో రెండు వేల ఓవర్లను బౌల్ చేసినట్టు ప్రకటించింది. గిన్నిస్ పుస్తకంలో అధికారికంగా చోటు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది.

08/15/2017 - 00:57

మాంట్రియల్‌లో జరిగిన రోజర్స్ కప్ టెన్నిస్ ఫైనల్‌లో ఓడిన రోజర్ ఫెదరర్, టైటిల్ సాధించిన అలెగ్జాండర్ జ్వెరెవ్. 36 ఏళ్ల ఫెదరర్‌ను 20 ఏళ్ల యువ సంచలన ఆటగాడు జ్వెరెవ్ 6-3, 6-4 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. వరుసగా 16 మ్యాచ్‌లను గెల్చుకున్న ఫెదరర్ విజయ పరంపరలకు బ్రేక్ వేశాడు,

08/15/2017 - 00:55

పల్లేకల్, ఆగస్టు 14: శ్రీలంకతో జరిగే వనే్డ సిరీస్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విఫలమైతే, తప్పకుండా ప్రత్యామ్నాయాలను అనే్వషిస్తామని జాతీయ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సోమవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ధోనీ ఎంపికను సమర్ధించుకున్నాడు. అనుభవజ్ఞుడైన ఆటగాళ్ల అవసరం జట్టుకు ఉందన్నాడు. ఒకవేళ ధోనీ విఫలమైతే, ఆ స్థానాన్ని భర్తీ చేయడం గురించి ఆలోచిస్తామని చెప్పాడు.

08/15/2017 - 00:54

పల్లేకల్, ఆగస్టు 14: యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు టెస్టు జట్టులో చోటు కల్పించడం లాభించిందని, అతను అద్భుతంగా ఆడాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. శ్రీలంకతో మూడు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత అతను మాట్లాడుతూ, హార్దిక్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడినట్టు చెప్పాడు.

08/14/2017 - 01:08

కెరీర్‌లో చివరి రేసులో పాల్గొన్న 30 ఏళ్ల బోల్ట్ 400 మీటర్ల రిలే ఈవెంట్‌లో బాటన్‌ను తన సహచరుడు యొహాన్ బ్లేక్ నుంచి తీసుకున్నాడు. అయితే, కొన్ని అడుగులు కూడా ముందుకు సాగకముందే కండరాలు బెణకడంతో పరుగును కొనసాగించలేకపోయాడు. అతి కష్టం మీద అడుగు వేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

08/14/2017 - 01:06

లండన్, ఆగస్టు 13: బ్రిటన్ సూపర్ అథ్లెట్ మో ఫరా జోరుకు బ్రేక్ పడింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ 10,000 మీటర్ల పరుగులో టైటిల్ నిలబెట్టుకున్న అతను 5,000 మీటర్ల విభాగంలో స్వర్ణాన్ని కాపాడుకోలేకపోయాడు. ఇథియోపియాకు చెందిన ముక్తార్ ఎడ్రిస్ 13 నిమిషాల, 32.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఫరాకు షాకిచ్చాడు.

Pages