S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/13/2017 - 08:36

ట్యూరిన్ (ఇటలీ), ఏప్రిల్ 12: చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ మొదటి లెగ్ పోటీలో పటిష్టమైన బార్సిలోనాకు జవెంటాస్ షాకిచ్చింది. ఫార్వర్డ్ ఆటగాడు పాబ్లో డైబలా రెండు గోల్స్ చేయడంతో, జువెంటాస్ 3-0 తేడాతో బార్సిలోనాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. లియోనెల్ మెస్సీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న బార్సిలోనాను మ్యాచ్ ఆరంభం నుంచే ఆత్మరక్షణలో పడేసిన జువెంటాస్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది.

04/13/2017 - 08:35

బీజింగ్, ఏప్రిల్ 12: చైనా బాడ్మింటన్ జాతీయ హెడ్ కోచ్‌గా 24 సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించిన లీ యాంగ్‌బో పదవీ విరమణను ప్రకటించాడు. అతని మార్గదర్శకంలోనే చైనా పలువురు స్టార్లను బాడ్మింటన్ ప్రపంచానికి అందించింది. రియో ఒలింపిక్స్‌లో చైనా బాడ్మింటన్‌లో కేవలం రెండు స్వర్ణాలతో సరిపుచ్చుకుంది. 2000 తర్వాత చైనా ఇంత దారుణంగా విఫలం కావడం అదే మొదటిసారి. దీనితో యాంగ్‌బోపై విమర్శలు వెల్లువెత్తాయి.

04/13/2017 - 08:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత్ బలమే తమ బలమనీ, ఒక రకంగా భారత్‌తో కలిసి తాము ముందుకు నడుస్తున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పపోన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంత బలంగా ఉంటే తాము అంతగా బలోపేతమవుతామని బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పడు.

04/13/2017 - 08:34

గయానా, ఏప్రిల్ 12: వెస్టిండీస్‌తో జరిగిన చివరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 234 పరుగుల లక్ష్యాన్ని పాక్ సులభంగా ఛేదించడంలో సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ కీలక పాత్ర పోషించాడు. అతను సెంచరీ చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది.

04/13/2017 - 08:33

డార్ట్‌మండ్, ఏప్రిల్ 12: డార్ట్‌మండ్ ఫుట్‌బాల్ జట్టును లక్ష్యంగా చేసుకొని దాడి జరగడంతో జర్మనీలో హై అలర్ట్ ప్రకటించారు. చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ ఫస్ట్‌లెగ్ మ్యాచ్‌లు జరిగే అన్ని ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, డార్ట్‌మండ్ జట్టును లక్ష్యంగా చేసుకొని జరిగిన బాంబు దాడిపై జర్మనీ పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు.

04/12/2017 - 01:32

పుణె, ఏప్రిల్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు సంజూ శాంసన్ శతకంతో గర్జించాడు. ఈ టోర్నీలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను మంగళవారం ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన అతను చక్కగా రాణించి 63 బంతుల్లో 102 పరుగులు సాధించాడు.

04/12/2017 - 01:30

బెంగళూరు, ఏప్రిల్ 11: మలేసియాలోని ఇపోలో ఈ నెల 29వ తేదీ నుంచి జరుగనున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ 26వ ఎడిషన్ హాకీ టోర్నమెంట్‌లో తలపడే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు స్టార్ కస్టోడియన్ పిఆర్.శ్రీజేష్ సారథ్యం వహించనుండగా, మన్‌ప్రీత్ సింగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

04/12/2017 - 01:29

బ్యూనస్ ఎయిర్స్, ఏప్రిల్ 11: అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం (ఎఎఫ్‌ఎ) తమ జాతీయ జట్టు కోచ్ ఎడ్వర్డో బవుజాకు ఉద్వాసన పలికింది. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించేందుకు అర్జెంటీనా జట్టు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.

04/12/2017 - 01:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) అథ్లెట్ల కమిషన్‌లో చోటు కోసం అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న తెలుగు తేజం, ఒలింపిక్ రజత పతక విజేత పివి.సింధు సహా మొత్తం తొమ్మిది పోటీపడుతున్నారు. నాలుగు స్థానాల కోసం జరిగే ఈ ఎన్నికల్లో సింధుతో పాటు భారత్ నుంచి అంతగా పరిచయం లేని పురుష షట్లర్ నిఖర్ గార్గ్ కూడా రేసులో నిలవడం గమనార్హం.

04/12/2017 - 01:26

బెంగళూరు, ఏఅపిల్ 11: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ క్రికెట్ బోర్డు, ఐపిఎల్ రెండిటితోను సంబంధాలు కలిగి ఉండి కూడా బ్రాండ్లకు ఎలా ప్రచారకర్తగా ఉంటారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఉన్నతాధికారి ఒకరు ప్రశ్నించారు. గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Pages