S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/10/2018 - 00:01

న్యూఢిల్లీ, నవంబర్ 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌కుగాను టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ మహమ్మద్ కైఫ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్ నియామకాన్ని ఢిల్లీ యాజమాన్యం ధృవీకరించింది. 2017 సీజన్‌లో గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీకి బ్రాడ్ హడ్జ్ కోచ్‌గా ఉన్న సమయంలో కైఫ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు.

11/09/2018 - 23:48

చెన్నై, నవంబర్ 9: వెస్టిండీస్‌తో ఆదివారం ఇక్కడి ఎం.ఏ చిదంబరం స్టేడియంలో జరిగే టీ-20 ఇంటర్నేషనల్ మూడోది, ఆఖరిది అయిన మ్యాచ్‌లో టీమిండియాలో ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు.

11/10/2018 - 00:02

గాలే (శ్రీలంక), నవంబర్ 9: శ్రీలంక-ఇంగ్లాండ్ మధ్య ఇక్కడి గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఇంగ్లాండ్ 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక తొలి ఇన్సింగ్స్‌లో 203, రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 322 పరుగులు చేసింది.

11/09/2018 - 23:46

మెల్బోర్న్, నవంబర్ 9: ప్రపంచాన్ని కుదిపేస్తున్న బాల్‌ట్యాంపరింగ్‌ను అరికట్టేందుకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బాగా ఉపకరిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఐసీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఐరిష్ అభిప్రాయపడ్డాడు.

11/09/2018 - 02:36

సిడ్నీ: దక్షిణాఫ్రికా, భారత్‌తో జరగబోయే టీ-20 సిరీస్‌ల నుంచి సూపర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లియాన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విశ్రాంతినిచ్చింది.

11/08/2018 - 23:47

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఫాస్ట్ బౌలర్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల, వారిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి మినహాయించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు.

11/08/2018 - 23:45

ట్యూరిన్ (ఇటలీ), నవంబర్ 8: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తన జట్టు జువెంటాస్‌ను నాకౌట్ దశకు చేర్చడానికి క్రిస్టియానో రొనాల్డో పడిన శ్రమ వృథా అయింది. మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో జువెంటాస్ గెలిచివుంటే, నేరుగా నాకౌట్‌కు చేరేది. అయితే, ఆ జట్టు అనూహ్యంగా 1-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

11/08/2018 - 23:43

ఫుజో, నవంబర్ 8: ఇక్కడ జరుగుతున్న చైనా ఓపెన్ వరల్డ్ టూర్ 750 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు తేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తమతమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఒలింపిక్స్‌లో ఒకసారి, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండు పర్యాయాలు రజత పతకం సాధించిన సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన బుసనాన్ ఒగాంరుగపన్‌పై 21-12, 21-15 తేడాతో విజయం సాధించింది.

11/08/2018 - 23:42

కువైట్ సిటీ, నవంబర్ 8: భారత యువ సంచలన షూటర్ సౌరభ్ చౌదరీ తన కెరీర్‌లో మరో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. మీరట్‌కు చెందిన ఓ వ్యవసాయ కుటుంబం నంచి వచ్చిన 16 సౌరభ్ ఇక్కడ జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో టైటిల్ సాధించాడు. గత నాలుగు నెలల్లో అతనికి అంతర్జాతీయ వేదికలపై ఇది నాలుగో స్వర్ణ పతకం కావడం గమనార్హం.

11/06/2018 - 23:53

శ్రీలంక: శ్రీలంక-ఇంగ్లాండ్ మధ్య ఇక్కడి గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్, సీనియర్ ఆటగాడు రంగనా హెరాత్ చరిత్ర సృష్టించాడు. ఈ మైదానంలో వంద వికెట్లకు ఒక వికెట్ దూరంలో ఉన్న హెరాత్ మంగళవారం ఈ రికార్డును సాధించాడు.

Pages