S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/06/2018 - 23:45

బెంగళూరు, సెప్టెంబర్ 6: దేశంలో ఈక్వెస్ట్రియన్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు వీలుగా నిధులు కేటాయించాలని ఆసియా గేమ్స్ విజేత ఫౌదా మీర్జా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఫౌదా మీర్జా రికార్డు సృష్టించింది.

09/07/2018 - 01:19

ముంబయి: ఈనెల 18 నుంచి జరిగే ఆసియా కప్‌లో టీమిండియా జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అత్యంత కీలకం కానున్నారని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు.

09/07/2018 - 01:18

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో జాన్ మిల్‌మాన్‌ను ఓడించిన దిగ్గజ ఆటగాడు సెర్బియా దిగ్గజం నవోక్ జొకోవిచ్ సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన కై నిషికొరితో తలపడనున్నాడు.

09/07/2018 - 01:17

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ జో రూట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా వ్యాఖ్యానించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 ట్రోఫీ టూర్‌లో భాగంగా ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న బ్రియాన్ లారా ఒక మీడియాతో మాట్లాడాడు.

09/06/2018 - 04:27

న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యోలో 2020 సంవత్సరంలో నిర్వహించే ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యే అథ్లెట్లకు పుష్కలంగా నిధులు అందజేస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపాడు. ఇప్పటివరకు ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నాడు.

09/05/2018 - 23:56

బెంగళూరు, సెప్టెంబర్ 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ కొత్త కోచ్‌గా ఆశిష్ నెహ్రా ఎంపికయ్యాడు. నెహ్రా ప్రస్తుతం ఇదే జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

09/05/2018 - 23:55

చిత్రాలు..ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో హాకీ (పురుషులు), ఆర్చరీ, బ్రిడ్జి, అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

09/05/2018 - 23:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఆసియా క్రీడల్లో తనతో పోటీ పడిన చైనా, పాకిస్తాన్ అథ్లెట్లతో ధీటుగా పోటీపడి గోల్డ్ మెడల్ సాధించిన విజయం తన జీవితంలో మరపురానిదని జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. ఆసియా గేమ్స్‌లో ఈ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

09/05/2018 - 23:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఆసియా గేమ్స్‌లో 1500 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించిన పరుగుల వీరుడు, కాలికట్‌కు చెందిన జిన్సన్ జాన్సన్ ఇపుడు టోక్యో ఒలింపిక్స్‌పై దృష్టి సారించాడు. 2020లో జరిగే ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల పరుగు పందెంలో మరో రికార్డు సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో జాన్సన్ 3.44 నిమిషాల 72 సెకన్లలో గోల్డ్ మెడల్ సాధించాడు.

09/05/2018 - 23:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ అమిత్ పంగల్ తన తదుపరి ఒలింపిక్స్‌లో మెడల్ సాధించే లక్ష్యంలో భాగంగా అమెరికా శిక్షణ పొందనున్నాడు. భారత ఆర్మీ సహకారంతో అమెరికాలో తగిన శిక్షణ పొందేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపాడు. 22 కేజీల అమిత్ ఫంగల్ జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో 49 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు.

Pages