S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/12/2018 - 23:26

బ్యాంకాక్, జూలై 12: ఒలింపిక్ రజత పతక విజేత, ప్రపంచ మూడో సీడ్, భారత షట్లర్ పీవీ సింధు ఇక్కడ జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో హాంకాంగ్‌కు చెందిన ఇప్ పుయ్ ఇన్‌ను 21-16, 21-14 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్స్‌లో చోటు కోసం శుక్రవారం అమెరికా క్రీడాకారిణి సోనియా చీహ్‌తో తలపడుతుంది.

07/12/2018 - 23:24

లండన్, జూలై 12: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో జర్మనీ క్రీడాకారిణి ఏంజిలిక్యు కెర్బర్ తన ప్రత్యర్థి, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ జెలెనా ఒస్తాపెంకోను 6-3, 6-3తో ఓడించింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒస్తాపెంకో ఏకోశానా కెర్బర్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

07/12/2018 - 23:24

లండన్, జూలై 12: జువాన్ డెల్ పొట్రో ప్రతిభావంతుడని, ఎంతటి ఆటగాళ్లనైనా నిలువరించే శక్తిసామర్థ్యాలు అతనికి ఉన్నాయని ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కితాబునిచ్చాడు.

07/12/2018 - 23:19

మాస్కో, జూలై 12: ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో క్రొయేషియా జట్టు ఆటగాళ్లు గెలుపు సంబరాలను జరుపుకుంటున్న తరుణంలో వారిమధ్యకు దూసుకువచ్చిన ఫొటోగ్రాఫర్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మ్యాచ్ అదనపు సమయంలోని 109వ నిమిషంలో క్రొయేషియా ఫార్వార్డ్ ఆటగాడు మారియో మాడ్జుకిక్ గోల్ చేసి తమ జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.

07/12/2018 - 01:10

లండన్, జూలై: వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో స్టార్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో స్టార్ క్రీడాకారుడు నవోక్ జొకోవిచ్ ఘన విజయం సాధించాడు.

07/12/2018 - 00:40

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూలై 11: ‘చెప్పలేనంత ఆనందానికి గురవుతున్నా’ అని ఫ్రాన్స్ కోచ్ డిడెర్ డెస్‌చాంప్స్ వెల్లడించాడు. బెల్జియంపై అపూర్వ విజయంతో ఫిఫా ఫుట్‌బాల్ ఫైనల్‌కు చేరడంపట్ల తాను, జట్టుమొత్తం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందన్నారు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకునేది లేదని, 2016 యూరోలో ప్రదర్శించిన ఆట ప్రావీణ్యం కంటే మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తామన్నారు.

07/12/2018 - 01:04

పారిస్, జూలై 11: పారిస్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫిఫా వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నంత ఘనంగా వేలాది మంది అభిమానులు, ప్రజలు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. డిడర్ డెస్‌చాంప్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంను 1-0 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

07/12/2018 - 00:38

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూలై 11: బెల్జియం కల ఒక్క అడుగూ ముందుకుపడలేదు. పడే అవకాశమూ ఇక లేదు. ఫ్రాన్స్ చేతిలో బెల్జియం ఓడిపోయింది. ఆ దేశం కలపై 1-0తో ఫ్రాన్స్ పిడుగుపడింది. చివరి వరకూ ఉత్కంఠ రేకెత్తించి, తరువాత చేతులెత్తేయడం లాంటి సెంటిమెంట్‌ను బెల్జియం కంటిన్యూ చేసింది. నిజానికి 2014 ప్రపంచకప్, 2016 యూరో క్లబ్ టోర్నీల్లో బెల్జియం క్వార్టర్స్‌లో విజయం సాధించి సెమీస్‌లో బోల్తాపడింది.

07/12/2018 - 00:37

మాస్కో, జూలై 11: వాళ్లేమీ ప్రపంచకప్ ఫుట్‌బాల్ దిగ్గజాలు కాదు. ఫైనల్ మ్యాచ్ ఆడిన దాఖలాలూ లేవు. వాళ్లొక పిల్ల ఫుట్‌బాల్ జట్టు మాత్రమే. అయితేనేం, వాళ్లే ఇప్పుడు సాకర్ హీరోలు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఫుట్‌బాల్ క్లబ్‌లు, దిగ్గజ ఆటగాళ్లు సైతం పిల్ల జట్టును హీరోల్లా చూస్తున్నారు. కారణం, మృత్యువుతో గేమ్ ఆడి గెలిచినోళ్లు కనుక.

07/12/2018 - 01:06

బ్యాంకాక్, జూలై 11: భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, హెచ్.ఎస్.ప్రణయ్ ఇక్కడ జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ మహిళలు, పురుషుల సింగిల్స్ విభాగాల్లో ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన ఓపెనింగ్ రౌండ్‌లో ఒలింపిక్ రజత పతక విజేత సింధు మహిళల విభాగంలోని బల్గేరియా క్రీడాకారిణి లిండా జెట్‌ఛిరిని 21-8, 21-15 తేడాతో ఓడించింది.

Pages