S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/07/2018 - 01:23

వింబుల్డన్, జూలై 6: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలన ఫలితం నమోదైంది. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన యెవ్‌గెనియా రొడీనా మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 11వ సీడ్ మాడిసన్ కీస్‌కు షాకిచ్చింది. టోర్నమెంట్ నాలుగో రోజైన గురువారం డిఫెండింగ్ చాంపియన్ గార్బెన్ ముగురుజా పరాజయాన్ని చవిచూడగా, ఐదో రోజున కీస్ పెవిలియన్ చేరింది.

07/06/2018 - 01:33

కజాన్, జూలై 5: ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో లీగ్ దశ ముగిసి, ప్రీ క్వార్టర్‌లో పోటీపడిన వివిధ జట్లు శుక్రవారం నుండి జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో హోరాహోరీగా తలపడనున్నాయి. ఇందులో ప్రత్యర్థులపై గెలవడం ద్వారా సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అన్ని జట్లు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉరుగ్వే-ఫ్రాన్స్, బ్రెజిల్-బెల్జియం జట్లు క్వార్టర్ ఫైనల్స్ పోరులో పైచేయి కోసం పోరాడనున్నాయి.

07/06/2018 - 01:32

నిజ్‌హ్నీ నొవ్‌గోరోడ్, జూలై 5: ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో శుక్రవారం నాడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఉరుగ్వే-ఫ్రాన్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయావకాశాలను మెరుగుపరుచుకోవడం ద్వారా సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టాలని యోచిస్తున్నాయి. ఉరుగ్వే జట్టులో స్టార్ స్ట్రయికర్ ఎడిన్‌సన్ కవానీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రష్యాతో జరిగిన ఒక మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చాడు.

07/06/2018 - 01:34

కార్డ్ఫి, జూలై 5: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. శుక్రవారంనాడు రెండో టీ-20 మ్యాచ్‌ను సైతం చేజిక్కించుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది.

07/06/2018 - 01:18

న్యూఢిల్లీ, జూలై 5 : ఇండోనేసి యాలో జరిగే ఆసియా గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్లు పాల్గొనడం లేదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో తమ జట్లకు భవిష్యత్తు లేకపోవడంతో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు పురుషుల ఫుట్‌బాల్ జట్టు వచ్చే ఏడాది జరిగే ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటాలని భావిస్తుండగా, ఐఓఏ నిర్ణయం వివాదాస్పదమైంది.

07/06/2018 - 01:17

జకార్తా, జూలై 5: ఇండోనేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ విజేత పీవీ సింధు, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించారు.

07/06/2018 - 01:16

బీజింగ్, జూలై 5: అది ఆషామాషి మన ఇళ్లల్లో తిరిగే పిల్లి కాదు. చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానుల ప్రేమను చూరగొన్న పిల్లి. వరల్డ్ కప్ గేమ్స్‌లో ఏ దేశం గెలుస్తుందో ముందుగా జోస్యం చెప్పే పిల్లి. దీంతో ఆ పిల్లికి వీరాభిమానులు ఉన్నారు. కానీ పిల్లి కూడా ఒక జీవే. ఆ పిల్లి బీజింగ్‌లో తాను ఉంటున్న ఆర్కియాలజీ ప్యాలెస్‌లో మరణించింది.

07/05/2018 - 01:44

హైదరాబాద్, జూలై 4: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) ఆరువారాలపాటు నిర్వహించిన మినీ ఒలింపిక్స్ విజయవంతమయ్యాయి. మే 26న ప్రారంభమైన పోటీలు జూలై 1న ముగిశాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టెన్నీకాయిట్, చెస్, క్యారమ్స్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి పోటీల్లో పిల్లలు నుంచి పెద్దల వరకు దాదాపు 1100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

07/05/2018 - 01:45

మాస్కో, జూలై 4: నాటకీయ పరిణామాల మధ్య సాగిన నాకౌట్ రౌండ్ తుది మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి క్వార్టర్ ‘్ఫర్’కు తెరలేపింది. ఉండే నలుగురెవరో, ఊడే నలుగురెవరో తేల్చుకోడానికి ఎనిమిది జట్లు పదుమైన సాధన పూర్తి చేసుకుని పరుగులు తీస్తున్నాయి. నిజ్ని నోవ్‌గోరోడ్, కజన, సమర, ఫిష్ట్ మైదానాల్లో రెండు రోజుల పాటు (శుక్ర, శనివారం) సాగే రసవత్తర పోరు తిలకించేందుకు అభిమానులూ ఉరకలెత్తుతున్నారు.

07/05/2018 - 01:46

మాస్కో, జూలై 4: ఇంగ్లాండ్ నమ్మకం నెగ్గింది. కొలంబియా ఆశలు ఆవిరయ్యాయి. నాకౌట్ పోరులో చివరి మ్యాచ్ షూటౌట్‌కు దారితీయడం కొలంబియాకు కలిసిరాలేదు. ఎరిక్ సాధించిన గోల్‌తో ఇంగ్లాండ్ క్వార్టర్స్‌కు చేరిపోయింది. తుది ఎనిమిది జట్ల పోరులో ఇంగ్లాండ్ స్వీడన్‌తో తలపడనుంది. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ చివరి మ్యాచ్‌గా మంగళవారం రాత్రి స్పార్టక్ స్టేడియంలో ఇగ్లాండ్ -కొలంబియాలు తలపడ్డాయి.

Pages