S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/21/2017 - 00:56

జొహానె్నస్‌బర్గ్, జూలై 20: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో ఐదు నుంచి ఎనిమిది వరకు స్థానాల కోసం గురువారం జపాన్‌ను ఢీకొన్న భారత్ ఓటమిపాలైంది. భారత క్రీడాకారిణులు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలను జపాన్ గోల్‌కీపర్ మెగుమీ కగెయమా సమర్థంగా అడ్డుకుంది. కాగా, మ్యాచ్ 7వ నిమిషంలో కనా నొమురా, 29వ నిమిషంలో నహో ఇచితానీ గోల్స్ సాధించారు.

07/21/2017 - 00:56

దోహా, జూలై 20: ఫుట్‌బాల్ అండర్-23 ఎఎఫ్‌సి క్వాలిఫయర్స్‌లో భారత్‌కు మొదటి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. సిరియాను ఢీకొని, 0-2 తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆట ఆరంభం నుంచి ఇరు జట్లు మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. దీనితో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ చాలాసేపు ఇదే తరహా ఆటతో ఇరు జట్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి.

07/20/2017 - 03:12

న్యూఢిల్లీ, జూలై 19: ఇటీవల జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల షాట్‌పుట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మన్‌ప్రీత్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు తేలింది.

07/20/2017 - 03:11

ముంబయి, జూలై 19: కుప్పలుతెప్పలుగా వెలువడే కథనాలనుగానీ, ఊహాగానాలనుగానీ తాను పట్టించుకోనని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. మూడు టెస్టులు, ఐదు వనే్డలు, ఒక టి-20 మ్యాచ్‌లు ఆడేందుకు సహచరులతో కలిసి శ్రీలంకకు బయలుదేరే ముందు అతను విలేఖరులతో మాట్లాడుతూ కొత్త కోచ్ రవి శాస్ర్తీతో ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నాడు.

07/20/2017 - 03:11

న్యూఢిల్లీ, జూలై 19: మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ గుగ్లీతో క్లీన్ బౌల్డ్ చేయడం భారత క్రికెట్‌లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా మండలి (సిఎసి) బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను నియమిస్తున్నట్టు ప్రకటిస్తే, అది కేవలం ప్రతిపాదన మాత్రమేనని బిసిసిఐ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

07/20/2017 - 03:11

న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సచిన్ తెండూల్కర్ బాధ్యతలు తీసుకుంటే.. అంతకంటే కావాల్సింది ఏముంటుంది? బౌలింగ్ కోచ్‌గా పట్టుబట్టిమరీ భరత్ అరుణ్‌కు అవకాశం ఇప్పించుకున్న చీఫ్ కోచ్ రవి శాస్ర్తీ దృష్టి ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌పై పడింది. రాహుల్ ద్రవిడ్ ఎంపికైనట్టు తొలుత వార్తలు వచ్చినా, ఆతర్వాత అది ప్రతిపాదన మాత్రమేనంటూ బిసిసిఐ వివరణ ఇచ్చింది.

07/20/2017 - 03:10

డెర్బీ, జూలై 19: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా, గురువారం ఆస్ట్రేలియాతో జరిగే సెమీ ఫైనల్‌కు మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. కాగితంపై చూస్తే, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తున్నది. ఆ జట్టుకే ఫైనల్ అవకాశాలు ఉన్నాయని విశే్లషకులు సైతం జోస్యం చెప్తున్నారు.

07/19/2017 - 02:47

ముంబయి, జూలై 18: భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ నియమితుడయ్యాడు. ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన మాజీ కెప్టెన్ రవి శాస్ర్తీ డిమాండ్ మేరకు బిసిసిఐ మంగళవారం భరత్ అరుణ్‌ను ఈ పదవిలో నియమించి గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న గందరగోళానికి తెర దించింది. గతంలో రవి శాస్ర్తీ టీమిండియాకు డైరెక్టర్‌గా వ్యవహరిచినప్పుడు భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించిన విషయం తెలిసిందే.

07/19/2017 - 01:27

కరాచి, జూలై 18: పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌పై జరుగుతున్న విచారణలో తమ పేర్లు ప్రస్తావనకు రావడంతో పాకిస్తాన్ క్రికెటర్లు మహమ్మద్ సమీ, ఉమర్ అక్మల్‌లు చిక్కుల్లో పడ్డారు.

07/19/2017 - 01:26

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 18: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న 57వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ చాంపియషన్ షిప్స్‌లో ఓవరాల్ చాంపియన్‌గా 159 పాయింట్లతో కేరళ నిలువగా, 110 పాయింట్లతో తమిళనాడు, 101.5 పాయింట్లతో హరియాణా రాష్ట్రాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. 42.5 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది.

Pages