S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/15/2017 - 00:47

కాల్గరీ, జూలై 14: కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు మను అత్రి, బి.సుమిత్ రెడ్డి పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రెండో సీడ్ జోడీగా బరిలోకి దిగిన ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కీ రెడ్డి కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

07/15/2017 - 00:47

లండన్, జూలై 14: వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు రోహన్ బొపన్న, అతని భాగస్వామి గాబ్రియేలా డబ్రోవ్‌స్కీకి చుక్కెదురైంది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్లుగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్న వీరు మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో హెన్రీ కొంటినెన్ (్ఫన్లాండ్), హీథర్ వాట్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో పరాజయం పాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

07/15/2017 - 00:46

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 14: జాతీయస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉందని అథ్లెటిక్స్ ఫెడరెషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సికె వల్సన్ అన్నారు. శుక్రవారం ఆంధ్రభూమి క్రీడా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా బ్లూ కలర్ ట్రాక్‌ను వాడుతున్నారన్నారు. బ్లూ కలర్ వల్ల రేడియేషన్ తక్కువగా ఉంటుందన్నారు.

07/15/2017 - 00:46

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 14: ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నుండి నాలుగు రోజుల పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అథ్లెటిక్స్ పండుగ జరుగనుంది.

07/14/2017 - 01:05

లండన్, జూలై 13: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో స్పెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ 14వ ర్యాంకర్ గార్బినె ముగురుజా, 11వ స్థానంలో ఉన్న వీనస్ విలియమ్స్ ఫైనల్ చేరారు. టైటిల్ కోసం వీరి మధ్య శనివారం తుది పోరాటం జరుగుతుంది.

07/14/2017 - 01:02

లండన్, జూలై 13: వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయ. కెనడాకు చెందిన గాబ్రియేల డ్రబోవ్‌స్కీతో కలిసి బరిలోకి దిగిన రోహన్ బొపన్న 7-6, 6-2 తేడాతో నికొలా మెక్టిక్, అనా జొన్జూ జోడీని ఓడించాడు. అయతే, మరో మ్యాచ్‌లో హైదరాబాదీ సానియా మీర్జా ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.

07/14/2017 - 01:02

బార్సిలోనా: బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ, అతని తండ్రి జార్జి హొరాసియోలకు స్పెయిన్ కోర్టులో ఊరట లభించింది. జైలు శిక్షకు బదులు జరిమానా చెల్లించే వెసులుబాటు కల్పించింది. తప్పుడు లెక్కలు చూపి వీరిద్దరూ భారీగా పన్ను ఎగవేశారని ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన కేసును పరిశీలించిన కోర్టు నిరుడు జూలై మాసంలో వీరికి జైలు శిక్షను ఖరారు చేసింది.

07/14/2017 - 01:01

ముంబయి, జూలై 13: బ్రెజిల్ మాజీ సూపర్ స్టార్ ఫుట్‌బాలర్ రొనాలినో శుక్రవారం ముంబయికి వస్తాడు. ఇండోర్ గేమ్‌గా ఆడే ప్రీమియర్ ఫుట్సాల్ సిరీస్‌లో ఆడే విషయంపై అతను ఒక ప్రకటన చేస్తాడని సమాచారం. గత ఏడాది గోవా ఫ్రాంచైజీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. పాల్ స్కూలర్స్, బెంగళూరు ఫైవ్స్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో మొత్తం ఐదు గోల్స్ సాధించాడు.

07/14/2017 - 00:59

లండన్: వింబుల్డన్‌లో పాల్గొనే వారంతా సంప్రదాయంగా వస్తున్న తెల్లటి దుస్తులనే ధరించాలి. గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లోగానే, మిగతా ఏ టోర్నీలోనూ కనిపించని డ్రెస్ కోడ్‌ను వింబుల్డన్‌లో తప్పనిసరిగా పాటిస్తున్నారు. దుస్తులే కాదు.. చివరికి బూట్లు కూడా తెల్లనివే వేసుకోవాలి. డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన వారికి అంపైర్లు ముందుగా జరిగిన పొరపాటును సూచిస్తారు. మార్పు రాకపోతే, చర్యలు తీసుకుంటారు.

07/14/2017 - 00:58

న్యూఢిల్లీ, జూలై 13: భారత క్రికెటర్లకు పాఠాలు చెప్పడానికి తాను రాలేదని, అలాంటి ప్రయత్నం కూడా తాను చేయనని టీమిండియా కొత్త కోచ్ రవి శాస్ర్తీ స్పష్టం చేశాడు. క్రికెటర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తానని, ఎలాంటి ఒత్తిడి లేకుండా వారు తమ బాధ్యతలను నిర్వర్తించేలా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని సృష్టిస్తానని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి శాస్ర్తీ అన్నాడు.

Pages