S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/23/2017 - 00:44

అస్టానా (కజకస్థాన్), జూలై 22: భారత టెన్నిస్ ఆటగాడు విష్ణువర్ధన్ ప్రెసిడెంట్స్ కప్ పురుషుల డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. జపాన్‌కు చెందిన తొషిహిదే మత్సుయ్‌తో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో ఎవ్‌గెనీ టైమెవ్, ఎవ్‌గెనీ కర్లొవ్‌స్కీ జోడీని 7-6, 6-7, 10-7 తేడాతో ఓడించి, కెరీర్‌లో రెండు చాలెంజర్స్ టైటిల్‌ను స్వీకరించాడు.

07/23/2017 - 00:44

న్యూఢిల్లీ, జూలై 22: టీమిండియాతో కలిసి రాహుల్ ద్రవిడ్ విదేశీ టూర్లకు బ్యాటింగ్ సలహాదారు హోదాలో వెళ్లడం లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు.

07/22/2017 - 00:43

న్యూఢిల్లీ, జూలై 21: టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ జాక్‌పాట్ కొట్టాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) జరిపిన జూన్ మాసం నాటి చెల్లింపుల్లో అతనిదే అత్యధిక వాటా. కాంట్రాక్టులో ఉన్న పలువురు ఆటగాళ్లతోపాటు, రాష్ట్ర,విదేశీ క్రికెట్ బోర్డులు, ఐపిఎల్ ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీలకు ఎంతెంత మొత్తాన్ని విడుదల చేసిందనే వివరాలను బిసిసిఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

07/22/2017 - 00:41

న్యూఢిల్లీ, జూలై 21: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై అటు ప్రముఖులు, ఇటు అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

07/22/2017 - 00:40

డెర్బీ: ఈసారి వరల్డ్ కప్‌లో తనకు ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం గ్రూప్ దశలో లభించలేదని సెమీ ఫైనల్స్ సెంచరీ స్టార్ హర్మన్‌ప్రీత్ తెలిపింది. అందుకే, సెమీ ఫైనల్‌లో ఆసీస్‌పై లభించిన అవకాశాన్ని ఉపయోగించుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మిథాలీ రాజ్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి అద్భుతంగా రాణిస్తున్నారని, అందుకే, తాను బ్యాటింగ్‌కు దిగే సమయానికే ఎక్కువ శాతం ఓవర్లు పూర్తవుతున్నాయని చెప్పింది.

07/22/2017 - 00:39

చండీగఢ్, జూలై 21: పంజాబ్‌లోని మొగా గ్రామంలో ఎవరూ అనుకోని, ముందుగా ఊహించని పండుగ సందడి చేసింది. మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో వీరవిహారం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ స్వగ్రామం కావడంతో, మొగా మొత్తం పండగ చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అభిమానులు హర్మన్‌ప్రీత్ ఇంటికి వెల్లువెత్తి, ఆమె తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులను అభినందించారు.

07/22/2017 - 00:38

బుడాపెస్ట్ (హంగరీ)లో జరుగుతున్న ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్ మహిళల సింక్రనైజ్డ్ రొటీన్ ఫ్రీస్టయిల్
టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన రష్యా జట్టు

07/22/2017 - 00:36

బెర్న్, జూలై 21: టెన్నిస్‌లో రారాజుగా అందరికీ తెలిసిన స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్‌కు స్వదేశంలో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నా రు. 36 ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీపడుతూ, విజయాలు సాధిస్తున్న అతనిపై మీడియా దాదాపుగా ప్రతిరోజూ ప్రత్యేక కథనాలతో హడావు డి చేస్తున్నది. అందుకు అతను అన్ని విధాలా అర్హుడే. ఈ ఏడాది ఇప్పటి వరకూ మూడు గ్రాండ్ శ్లామ్ టోర్నీలు జరిగితే వాటిలో రెండు ఫెదరర్ ఖాతాలో చేరాయి.

07/22/2017 - 00:36

మొరాతువా, జూలై 21: శ్రీలంకతో శుక్రవారం మొదలైన రెండు రోజుల వామప్ మ్యాచ్ మొదటి రోజు భారత స్పిన్నర్లు విజృంభించారు. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించాడు. వీరి జోరుకు కుదేలైన శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌటైంది.

07/22/2017 - 00:33

ఆనాహెమ్, జూలై 21: యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకొని, మళ్లీ ఫామ్‌ను కొనసాగిస్తున్న కశ్యప్ తన రెండో రౌండ్‌లో హంగరీకి చెందిన గెర్గెలీ క్రాజ్‌పై మొదటి సెట్‌ను 21-18 తేడాతో గెల్చుకున్నాడు. రెండో సెట్‌లోనూ దూకుడును కొనసాగిస్తూ 17-6 ఆధిక్యాన్ని సంపాదించాడు.

Pages