S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/22/2017 - 00:33

సుమో రెజ్లింగ్‌లో మంగోలియాకు చెందిన హకుహో కొత్త చరిత్ర సృష్టించాడు. జపాన్‌లోని నగోయాలో జరిగిన గ్రాండ్ సుమో టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ తకయసును చిత్తుచేసిన అతను కెరీర్‌లో 1,048వ విజయాన్ని నమోదు చేశాడు

07/22/2017 - 00:31

న్యూఢిల్లీ, జూలై 21: మన దేశంలో జరిగే అండర్-17 ప్రపంచ కప్ సాకర్ వరల్డ్ కప్ మూడో దశ టికెట్ల అమ్మకాలు శుక్రవారం మొదలయ్యాయి. మొదటి రెండు దశల్లో అమ్మకాలకు దక్కిన ఆదరణకు నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పటికే కోల్‌కతా, గౌహతి నగరాల్లో జరిగే మ్యాచ్‌ల టికెట్లు అమ్ముడయ్యాయి. న్యూఢిల్లీలో రికార్డు స్థాయిలో లక్ష టికెట్ల అమ్మకాలు జరిగాయి.

07/21/2017 - 03:47

డెర్బీ, జూలై 20: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత్ ఫై నల్‌కు దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ కౌర్ వీరవిహారం భా రత్‌కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను చిత్తుచేసిన హర్మన్‌ప్రీత్ విజృంభణ అభిమానులను ఆక ట్టుకుంది.

07/21/2017 - 01:05

కొలంబో, జూలై 20: శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఒత్తిడి లేకుండా ఆడాలని సహచరులకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు.

07/21/2017 - 01:04

చెన్నై, జూలై 20: చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని యువతకు భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ పిలుపునిచ్చాడు. ప్రో కబడ్డీలో చెన్నై తలైవాస్ ఫ్రాంచైజీ కొత్త జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక పటుత్వంతోపాటు మానసిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని అన్నాడు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నాడు.

07/21/2017 - 01:02

కొలంబో, జూలై 20: శ్రీలంక టూర్‌ను టీమిండియా శుక్రవారం మొదలయ్యే రెండు రోజుల వామప్ మ్యాచ్‌తో మొదలుపెట్టనుంది. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్‌పై కేంద్రీకృతమైంది. వీరిద్దరూ గాయాల కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకొని, మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు.

07/21/2017 - 01:02

లండన్, జూలై 20: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మైఖేల్ లంబ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాలి మడమ గాయం కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో నాటింగ్‌హామ్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 37 ఏళ్ల లంబ్ ఇటీవల రెండు టి-20 మ్యాచ్‌లు ఆడాడు. ఆ సమయంలో కాలి మడమకు బలమైన గాయం తగిలింది. ఇకపై కెరీర్‌ను కొనసాగించే అవకాశం లేదని వైద్యులు ప్రకటించడంతో, కెరీర్‌ను ముగిస్తున్నట్టు లంబ్ ప్రకటించాడు.

07/21/2017 - 01:00

న్యూఢిల్లీ, జూలై 20: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల షాట్‌పుట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన మన్‌ప్రీత్ కౌర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షలో ఆమె విఫలమైన విషయం తెలిసిందే. వరుసగా రెండు పర్యాయాలు ఆమె ‘ఎ’ శాంపిల్స్‌లో నిషిద్ధ మాదక ద్రవ్యాలను గుర్తించారు. ‘బి’ శాంపిల్స్‌ను కూడా పరీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.

07/21/2017 - 00:59

అనాహెమ్ (అమెరికా), జూలై 20: యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ లీ హ్యున్‌పై భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్న హ్యున్‌ను అతను 21-16, 10-21, 21-19 తేడాతో ఓడించి రెండో రౌండ్ చేరాడు.

07/21/2017 - 00:58

డోటిన్‌చెమ్ (నెదర్లాండ్స్), జూలై 20: మహిళల యూరోపియన్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా గ్రూప్ ‘డి’లో స్కాట్‌లాండ్‌ను ఢీకొన్న ఇంగ్లాండ్ 6-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. జొడీ టేలర్ హ్యాట్రిక్‌తో రాణించి, ఇంగ్లాండ్ విజయంలో కీలక భూమిక పోషించింది. మ్యాచ్ 10వ నిమిషంలో తొలి గోల్ చేసిన ఆమె ఆతర్వాత 26, 53 నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించింది.

Pages