S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/16/2017 - 01:29

లండన్, జూలై 15: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను మరోసారి కైవసం చేసుకోవాలన్న వీనస్ విలియమ్స్ కలలకు గార్బెనె ముగురుజా గండి కొట్టింది. గతంలో ఐదు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచిన వీనస్‌ను ఆమె 7-5, 6-0 తేడాతో, వరుస సెట్లలో ఓడించింది. మొదటి సెట్‌లో తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ వీనస్ తన ప్రత్యర్థికి కళ్లెం వేయలేకపోయింది. దీనితో నిరాశకు గురైన ఆమె పదేపదే పొరపాట్లు చేస్తూ, ఓటమిని కొనితెచ్చుకుంది.

07/16/2017 - 01:26

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 15: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో శనివారం ప్రారంభమైన 57వ జాతీయ సీనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు రెండు పతకాలు సాధించి శుభారంభం చేశారు. 400 మీటర్ల హర్డిల్స్ పురుషుల విభాగంలో ఎంపీ జబీర్, ఎం రామచంద్రన్ ఇద్దరూ వరుసగా స్వర్ణ, రజత పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌కు బోణీ కొట్టారు. తరువాతి స్థానంలో తమిళనాడుకు చెందిన సంతోష్‌కుమార్ నిలిచాడు.

07/16/2017 - 01:26

లండన్: వింబుల్డన్‌లో ఇప్పటికే ఏడు పర్యాయాలు విజేతగా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్ వన్, వెటరన్ స్టార్ రోజర్ ఫెదరర్ మరోసారి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో ఆదివారం మారిన్ సిలిక్‌తో జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నాడు. వైఫల్యాలను ఎదుర్కొంటున్న ప్రతిసారీ విమర్శలకు గురికావడం, ఆ వెంటనే ఎవరూ ఊహించని రీతిలో చెలరేగి సత్తా చాటడం ఫెదరర్‌కు అలవాటుగా మారింది.

07/16/2017 - 01:24

టౌన్టన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల ప్రపంచ కప్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 59 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 48.3 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. బేత్ మూనీ (53), నికోల్ బోల్టన్ (79), ఎలిస్ పెర్రీ (55) అర్ధ శతకాలు సాధించడంతో ఆసీస్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. సనే లస్ 67 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టింది.

07/16/2017 - 01:24

న్యూఢిల్లీ, జూలై 15: ప్రో కబడ్డీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో ప్రైజ్‌మనీని నిర్వాహకులు అమాంతం రెట్టింపు చేశారు. ఐదో ప్రో కబడ్డీ ఈనెల 28న హైదరాబాద్‌లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ప్రారంభమవుతుంది. ఈ టోర్నీకి ప్రైజ్‌మనీని ఐదు కోట్ల రూపాయలుగా ఖరారు చేశారు. మొత్తం 138 మ్యాచ్‌లు జరిగే ఈ పోటీల్లో విజేత జట్టుకు మూడు కోట్ల రూపాయలు లభిస్తాయి.

07/16/2017 - 01:23

డెర్బీ, జూలై 15: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌ని భారత్ సొంతం చేసుకొని, సెమీ ఫైనల్లో చోటు దక్కించుకుంది. గెలిస్తేగానీ టోర్నీలో నిలిచే అవకాశం లేని అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రత్యర్థి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్ అండగా నిలిచింది.

07/15/2017 - 00:53

లండన్, జూలై 14: ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టైటిల్ కోసం ఈసారి స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌తో పాటు క్రొయేషియాకి చెందిన ఏడో సీడ్ ఆటగాడు మారిన్ సిలిక్ అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో వీరిద్దరూ తమతమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు.

07/15/2017 - 00:51

కొలంబో, జూలై 14: శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశాడు. 2011ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో శ్రీలంక జట్టు ఓటమి పాలవడంపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.

07/15/2017 - 00:49

న్యూఢిల్లీ, జూలై 14: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై జస్టిస్ లోధా కమిటీ రెండేళ్ల పాటు విధించిన నిషేధం అధికారికంగా పూర్తయింది. దీంతో ఆ రెండు జట్లు వచ్చే ఏడాది నుంచి మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది.

07/15/2017 - 00:49

నైరోబీ, జూలై 14: కెన్యా రాజధాని నైరోబీలో జరుగుతున్న అండర్-18 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ బాలుర హ్యామర్‌త్రో ఈవెంట్‌లో భారత్‌కు చెందిన దనీత్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ పోటీల్లో భారత్‌కు మూడు రోజుల తర్వాత గురువారం తొలి పతకం లభించింది. తొలి ప్రయత్నంలో దనీత్ సింగ్ హ్యామర్‌ను 74.20 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనతో ఈ పతకాన్ని గెలుచుకున్నాడు.

Pages