S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/25/2017 - 00:42

బహమాస్, జూలై 24: కామనె్వల్త్ యూత్ గేమ్స్‌లో సచిన్ సివాచ్ భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించాడు. గత ఏడాది ప్రపంచ యూత్ గేమ్స్ బాక్సింగ్ 49 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అతను కామనె్వల్త్ యూత్ గేమ్సలోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడు. చివరి ఫైట్‌లో తన ప్రత్యర్థి జేమ్స్ నాథన్ ప్రోబర్ట్‌ను 4-1 తేడాతో చిత్తుచేశాడు. కాగా, మహిళల విభాగంలో జోనీ పతకాన్ని సాధించింది.

07/25/2017 - 00:41

గాలే, జూలై 24: భారత బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్ జ్వరంతో బాధపడుతున్నాడు. దీనితో అతను శ్రీలంకతో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టుకు దూరమయ్యాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కొలంబోలో లంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించిన రాహుల్‌కు జ్వరంగా ఉందని, దీనితో అతను నెట్ ప్రాక్టీస్‌కు రాలేకపోయాడని పేర్కొంది.

07/24/2017 - 00:38

‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఆదివారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ విజయభేరి మోగించింది. చివరి వరకూ పోరాడిన మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీని స్వీకరించింది. 1973, 1993, 2009 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ను సాధించిన ఇంగ్లాండ్ నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది.

07/24/2017 - 00:00

లార్డ్స్, జూలై 23: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో రెండోసారీ భారత్‌కు చేదు అనుభవమే మిగిలింది. 2005లో మొదటిసారి ఈ మెగా టోర్నీ ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ సాధించలేకపోయింది. ఇప్పుడు మిథాలీ రాజ్ నాయకత్వంలో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కానీ, ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన తుది పోరులో చివరి వరకూ పోరాడి ఓడింది.

07/23/2017 - 23:58

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: లారెన్ విన్‌ఫీల్డ్ బి రాజేశ్వరి గైక్వాడ్ 24, టామీ బ్యూవౌంట్ సి ఝూలన్ గోస్వామి బి పూనమ్ యాదవ్ 23, సారా టేలర్ సి సుష్మ వర్మ బి ఝూలన్ గోస్వామి 45, హీతర్ నైట్ ఎల్‌బి పూనమ్ యాదవ్ 1, నతాలీ షివెర్ ఎల్‌బి ఝూలన్ గోస్వామి 51, ఫ్రాన్ విల్సన్ ఎల్‌బి ఝూలన్ గోస్వామి 0, కాథరిన్ బ్రంట్ రనౌట్ 34, జెన్నీ గన్ 25 నాటౌట్, లారా మార్ష్ 14 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు)

07/23/2017 - 23:55

ముంబయి, జూలై 23: క్రికెటర్లకే కాదు.. ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కూడా కోట్ల రూపాయల్లో ధర పలుకుతున్నది. ఆదివారం ఇక్కడ జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ వేలంలో డిఫెండర్ అనాస్ ఎడథోడికా, యూగెనెసన్ లింగ్డో భారీ ధరను దక్కించుకొని ‘కరోడ్‌పతి క్లబ్’లో చేరారు. ఎడథోడికాను ఐఎస్‌ఎల్‌లో కొత్తగా ప్రవేశించిన జంషెడ్పూర్ జట్టు, లింగ్డోను ఎటికె జట్టు తీసుకున్నాయి.

07/23/2017 - 23:53

ముంబయి, జూలై 23: మహిళల ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి సంచలనం సృష్టించి, భారత్‌ను ఫైనల్ చేర్చిన బ్యాట్స్‌మన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ప్రమోషన్ లభించింది. పశ్చిమ రైల్వేలోని ముంబయి డివిజన్‌లో పని చేస్తున్న ఆమెకు ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖకు అధికారులు ప్రతిపాదన పంపారు.

07/23/2017 - 23:51

ఆనాహెమ్ (అమెరికా), జూలై 23: యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ భారత్‌కు దక్కడం ఖాయమైంది. కామనె్వల్త్ గేమ్స్ విజేత పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ సెమీ ఫైనల్స్‌లో తమతమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ చేరారు. ఇక టైటిల్ కోసం సహచరుల మధ్య జరిగే పోరులో ఎవరు గెలిచినా, భారత్‌కే పతకం లభిస్తుంది.

07/23/2017 - 23:51

లండన్, జూలై 23:ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో భారత ఆటగాడు శరత్ కుమార్‌కు రజత పతకం లభించింది. వరుణ్ భాటి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. వీరిద్దరూ టి-42 విభాగం కింద హైజంప్‌లో పోటీపడ్డారు. శరత్ 1.84 మీటర్లు ఎత్తును పూర్తి చేసి రజత పతకాన్ని అందుకోగా, భాటి 1.77 మీటర్లతో కాంస్య పతకాన్ని సంపాదించాడు. ఈ పోటీలో అమెరికాకు చెందిన శామ్ గ్రెవ్ 1.86 మీటర్ల ఎత్తుకు లంఘించి స్వర్ణ పతకాన్ని సాధించాడు.

07/23/2017 - 23:50

న్యూఢిల్లీ, జూలై 23: వివిధ రకాలైన ఔషధాల వినియోగం, వాటి వల్ల డోపింగ్ పరీక్షలో పట్టుబడే అవకాశాలు వంటి అంశాలపై క్రీడాకారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి రోజుకు 24 గంటలు పని చేసే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆల్ ఇంగ్లాండ్ మాజీ చాంపియన్, బాడ్మిండ్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచించాడు.

Pages